Telugu Global
International

ఆక‌లేసి తిండి దొంగిలిస్తే...అది నేరం కాదు!

ఇట‌లీలోని సుప్రీంకోర్టు ఆహారం దొంగ‌త‌నం విష‌యంలో స‌రైన తీర్పునే ఇచ్చింది. ఒక మ‌నిషికి తిండి దొంగ‌త‌నం చేయాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డింది అంటే…అందుకు ఆ స‌మాజం మొత్తం బాధ్య‌త వ‌హించాల్సి ఉంటుంది…అనే విష‌యాన్నిదృష్టిలో పెట్టుకుని కోర్టు ఈ తీర్చునిచ్చింది. జెనీవాలో ఇల్లువాకిలి లేకుండా రోడ్ల‌మీద తిరిగే ఓ వ్య‌క్తి ఆక‌లికి త‌ట్టుకోలేక సూప‌ర్ మార్కెట్ నుండి ఛీజ్‌ని, సాసేజ్‌ని దొంగిలించ‌డంతో అత‌డిని పోలీసులు అరెస్టుచేశారు. 2011లో ఈ సంఘ‌ట‌న జ‌ర‌గ్గా, 2015లో కింది కోర్టు అత‌నికి ఆరునెల‌ల జైలు […]

ఇట‌లీలోని సుప్రీంకోర్టు ఆహారం దొంగ‌త‌నం విష‌యంలో స‌రైన తీర్పునే ఇచ్చింది. ఒక మ‌నిషికి తిండి దొంగ‌త‌నం చేయాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డింది అంటే…అందుకు ఆ స‌మాజం మొత్తం బాధ్య‌త వ‌హించాల్సి ఉంటుంది…అనే విష‌యాన్నిదృష్టిలో పెట్టుకుని కోర్టు ఈ తీర్చునిచ్చింది.

జెనీవాలో ఇల్లువాకిలి లేకుండా రోడ్ల‌మీద తిరిగే ఓ వ్య‌క్తి ఆక‌లికి త‌ట్టుకోలేక సూప‌ర్ మార్కెట్ నుండి ఛీజ్‌ని, సాసేజ్‌ని దొంగిలించ‌డంతో అత‌డిని పోలీసులు అరెస్టుచేశారు. 2011లో ఈ సంఘ‌ట‌న జ‌ర‌గ్గా, 2015లో కింది కోర్టు అత‌నికి ఆరునెల‌ల జైలు శిక్ష‌, 100 యూరోల జ‌రిమానా విధించింది. దీనిపై ప‌త్రిక‌ల్లో, ప్ర‌జ‌ల్లో తీవ్ర‌మైన వాదోప‌వాదాలు, చ‌ర్చ‌లు జ‌రిగిన నేప‌థ్యంలో, ఈ కేసుని విచారించిన సుప్రీంకోర్టు, అత‌డిని నిర్దోషిగా ప్ర‌క‌టించింది. ఆక‌లివేసి కొంచెం మొత్తంలో ఆహారాన్ని దొంగిలిస్తే అది నేరంకాద‌ని స్పష్టంగా చెప్పింది. ఉక్రెయిన్‌కి చెందిన రోమ‌న్ ఒస్టియాకోవ్ అనే 30 ఏళ్ల వ్య‌క్తి 4.07 యూరోల విలువ చేసే ఫుడ్‌ని దొంగ‌లిస్తుండ‌గా మార్కెట్ సిబ్బంది ప‌ట్టుకున్నారు.

ప్ర‌తివాదికి ఎవ‌రూ లేరు క‌నుక అత‌ను త‌న క‌డుపుని తాను నింపుకోవ‌టం అత్యవ‌స‌రం క‌నుక, అత‌ను చేసిన ప‌ని నేరం కాద‌ని కోర్టు పేర్కొంది. నాగ‌రిక స‌మాజంలో ఏ మ‌నిషీ తిండి లేక ఆక‌లితో ఉండ‌కూడ‌ద‌నే విష‌యాన్ని అంద‌రూ గ‌ర్తుంచుకోవాల‌ని కోర్టు కోరింది. ఐదు యూరోల‌కంటే త‌క్కువ విలువైన దొంగ‌త‌నం కోసం ఖ‌రీదైన న్యాయ‌వ్య‌వ‌స్థ కాలాన్ని వృథా చేయ‌టంపై ఇట‌లీ పేప‌ర్లు వ్యంగంగా క‌థ‌నాలు రాశాయి. నిరుపేద‌ల‌కు జీవించే హ‌క్కుని క‌ల్పించాల‌ని మ‌రొక ప‌త్రిక‌ కోర్టుని కోరింది.

First Published:  5 May 2016 4:02 AM GMT
Next Story