Telugu Global
Others

తెలంగాణ‌లో చంద్ర‌బాబు గొంతుక‌లా రేవంత్‌!

తెలంగాణ‌లో తెలుగుదేశం పార్టీ అధికార పార్టీలో విలీనం జ‌రిగినా… ఇంకా ముగ్గురు ఎమ్మెల్యేలు మిగిలే ఉన్నారు. వారిలో ఎల్‌బీన‌గ‌ర్ ఎమ్మెల్యే క్రిష్ణయ్య తెలుగుదేశానికి  మొద‌టి నుంచి దూరంగానే ఉంటూ వ‌స్తున్నారు. మిగిలిన ఇద్ద‌రు స‌త్తు ప‌ల్లి ఎమ్మెల్యే సండ్ర వెంక‌ట వీర‌య్య‌, కోడంగ‌ల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి వీరిద్ద‌రూ ఓటుకు నోటు కేసులో కీల‌క నిందితులుగా ఉన్నారు. ఎప్ప‌టికైనా వీరు విచార‌ణ ఎదుర్కోక త‌ప్ప‌ని ప‌రిస్థితి. ఇలాంటి ప‌రిస్థితుల్లో తెలంగాణ‌లో చంద్ర‌బాబు వాద‌న‌ల‌ను వినిపించే వారు దాదాపు […]

తెలంగాణ‌లో చంద్ర‌బాబు గొంతుక‌లా రేవంత్‌!
X
తెలంగాణ‌లో తెలుగుదేశం పార్టీ అధికార పార్టీలో విలీనం జ‌రిగినా… ఇంకా ముగ్గురు ఎమ్మెల్యేలు మిగిలే ఉన్నారు. వారిలో ఎల్‌బీన‌గ‌ర్ ఎమ్మెల్యే క్రిష్ణయ్య తెలుగుదేశానికి మొద‌టి నుంచి దూరంగానే ఉంటూ వ‌స్తున్నారు. మిగిలిన ఇద్ద‌రు స‌త్తు ప‌ల్లి ఎమ్మెల్యే సండ్ర వెంక‌ట వీర‌య్య‌, కోడంగ‌ల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి వీరిద్ద‌రూ ఓటుకు నోటు కేసులో కీల‌క నిందితులుగా ఉన్నారు. ఎప్ప‌టికైనా వీరు విచార‌ణ ఎదుర్కోక త‌ప్ప‌ని ప‌రిస్థితి. ఇలాంటి ప‌రిస్థితుల్లో తెలంగాణ‌లో చంద్ర‌బాబు వాద‌న‌ల‌ను వినిపించే వారు దాదాపు క‌ర‌వయ్యారు అనుకున్నారంతా. కానీ, తాను ఉన్నానంటూ ముందుకు వ‌చ్చాడు రేవంత్‌. 38 ల‌క్ష‌ల జ‌నాభా ఉన్న పాల‌మూరులో ఇప్ప‌టికే 18 ల‌క్ష‌ల మంది క‌రువు దెబ్బ‌కు ఇత‌ర రాష్ర్టాల వ‌ల‌స వెళ్లారు. అలాంటి బీద జిల్లాలో జ‌న్మించిన రేవంత్ రెడ్డి జిల్లా ప్రయోజ‌నాల‌కు వ్య‌తిరేకంగా మాట్లాడుతుండ‌టంపై పాల‌మూరువాసులు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. పాల‌మూరు ప్రాజెక్టుపై చంద్ర‌బాబు త‌న‌ అభ్యంత‌రాల‌ను త‌న ఆయుధమైన రేవంత్‌తో వినిపిస్తున్నాడ‌ని తెలంగాణ‌వాదులు మండిప‌డుతున్నారు. పాల‌మూరులో పుట్టి ఏపీ అభ్యంత‌రాల‌ను నువ్వెలా వినిపిస్తావ‌ని రేవంత్‌ను అడుగుతున్నారు. ఏపీలో ఉన్న ఒక్క తెలుగుదేశం నేత‌నైనా తెలంగాణ‌లోని పాల‌మూరుకు అనుకూలంగా మాట్లాడుతున్నారా? అని ప్ర‌శ్నిస్తున్నారు.
జిల్లావాసులు ఏమ‌నుకున్నా ఆయ‌న‌కు అవ‌స‌రం లేదు..
ఏపీ సీఎం చంద్ర‌బాబు ఈ విష‌యంలో ప్రెస్ మీట్ పెట్టి ఎలాంటి అభ్యంత‌రాల‌ను తెల‌ప‌లేదు. కానీ, ఆయ‌న కంటే ఎక్కువ ఆవేద‌న వ్య‌క్తం చేస్తోన్న రేవంత్‌పై గులాబీ నేత‌లు మండిప‌డుతున్నారు. మ‌రీ అంత‌లా చంద్ర‌బాబుకు సాగిల ప‌డాల్సిన అవ‌స‌ర‌మేం ఉంద‌ని ప్ర‌శ్నిస్తున్నారు. ఓటుకు నోటు కేసు నుంచి త‌న‌ను చంద్ర‌బాబు బ‌య‌ట‌ప‌డేస్తాడ‌న్న భ్రమ‌లో రేవంత్‌ ఉన్నాడ‌ని.. అందుకే ఇలాంటి పిచ్చి కూత‌లు కూస్తున్నాడ‌ని ఆరోపిస్తున్నారు. పిల్ల‌నిచ్చిన మామ‌కే వెన్నుపోటు పొడిచి, తోడ‌ల్లుడిని పార్టీ నుంచి త‌రిమేసిన చంద్ర‌బాబు నిన్నుమాత్రం ఎందుకు ఆదుకుంటాడు? అన్న‌ పాయింట్ లేవ‌నెత్తుతున్నారు. గ‌తంలో తాను ద‌త్త‌త తీసుకున్న పాల‌మూరు జిల్లా ప్ర‌యోజ‌నాల‌ను దెబ్బ తీయాల‌ని చూస్తోన్న చంద్ర‌బాబు నీకు న్యాయం చేస్తాడ‌నుకోవ‌డం క‌లేన‌ని క‌రాకండిగా చెబుతున్నారు. తెలంగాణ ప్ర‌యోజ‌నాల‌కు వ్య‌తిరేకంగా మాట్లాడుతున్న రేవంత్‌కు ప్ర‌జ‌ల చేతిలో గుణ‌పాఠం త‌ప్ప‌ద‌ని హెచ్చ‌రిస్తున్నారు.
First Published:  5 May 2016 1:03 AM GMT
Next Story