Telugu Global
Cinema & Entertainment

రామ్ చరణ్ ను అలా సెట్ చేసేసిన అల్లు అరవింద్

రామ్ చరణ్ ప్రస్తుతం ఫ్లాపులో ఉన్నాడు. బ్రూస్ లీ సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. కానీ మెగావారసుడిగా, గత హిట్స్ మూలంగా క్రేజ్ మాత్రం అలానే కొనసాగుతోంది. మరి ఇలాంటి పొజిషన్ లో ఉన్న హీరోకు పారితోషికం ఎంత ఇవ్వాలి. అడిగినంత ఇవ్వడానికి నిర్మాత అల్లు అరవింద్ కు ఇష్టం లేదు. అందుకే చెర్రీని తెలివిగా సెట్ చేశాడు. రెమ్యునరేషన్ ఇవ్వకుండా లాభాల్లో వాటాలు తీసుకోమని ఊరించాడు. సినిమా హిట్టయితే అల్లు అరవింద్ తో పాటు చెర్రీ […]

రామ్ చరణ్ ప్రస్తుతం ఫ్లాపులో ఉన్నాడు. బ్రూస్ లీ సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. కానీ మెగావారసుడిగా, గత హిట్స్ మూలంగా క్రేజ్ మాత్రం అలానే కొనసాగుతోంది. మరి ఇలాంటి పొజిషన్ లో ఉన్న హీరోకు పారితోషికం ఎంత ఇవ్వాలి. అడిగినంత ఇవ్వడానికి నిర్మాత అల్లు అరవింద్ కు ఇష్టం లేదు. అందుకే చెర్రీని తెలివిగా సెట్ చేశాడు. రెమ్యునరేషన్ ఇవ్వకుండా లాభాల్లో వాటాలు తీసుకోమని ఊరించాడు. సినిమా హిట్టయితే అల్లు అరవింద్ తో పాటు చెర్రీ కూడా హ్యాపీ. ఒకవేళ సినిమా ఫ్లాప్ అయితే… చెర్రీ మాత్రమే బాధపడతాడు. అల్లు అరవింద్ ఎలాగూ అయినకాడికి సినిమాను అమ్ముకుంటాడు కాబట్టి సేఫ్ జోన్ లోకి వెళ్లిపోతాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చేస్తున్న సినిమాకు రామ్ చరణ్ – అల్లు అరవింద్ మధ్య కుదిరిన ఒప్పందం ఇది. యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాతో ఎలాగైనా హిట్ బాట పట్టాలని చెర్రీ భావిస్తుంటే…. కిక్-2 పరాజయాన్ని మరిచిపోవాలని సురేందర్ రెడ్డి కూడా కసిగా ఉన్నాడు. మరోవైపు సరైనోడు సినిమాతో నిర్మాతగా నెగెటివ్ టాక్ తెచ్చుకున్న అల్లు అరవింద్ కూడా చెర్రీ సినిమాతో మగధీర రేంజ్ హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు. వీళ్లు ముగ్గురూ కలిసి ఏ రేంజ్ లో సంచలనం సృష్టిస్తారో చూడాలి.
First Published:  4 May 2016 10:58 PM GMT
Next Story