Telugu Global
Others

శ‌భాష్‌.. హ‌రీశ్‌..!

రెండు రాష్ర్టాల మ‌ధ్య వివాదాస్ప‌ద‌మ‌వుతున్న పాల‌మూరు ప్రాజెక్టు విష‌యంలో ఏపీ లేవ‌నెత్తిన అభ్యంత‌రాల‌ను నివృత్తి చేసేందుకు తెలంగాణ భారీ నీటిపారుద‌ల మంత్రి చొర‌వ‌ను అంతా అభినందిస్తున్నారు. క‌ర‌వు తాండ‌విస్తోన్న పాల‌మూరు జిల్లాను సస్య‌శ్యామ‌లం చేస్తూనే.. నిబంధ‌న‌ల మేర‌కు ఏపీకి రావాల్సిన వాటాను ఇచ్చేందుకు తెలంగాణ ప్ర‌భుత్వం సిద్ధ‌మేన‌ని ప్ర‌క‌టించ‌డంపై రాయ‌ల‌సీమ‌, తెలంగాణ వాసులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. ఈవిష‌యంలో పంతాలు ప‌ట్టింపుల‌కు పోతే.. రెండు రాష్ర్టాల ప్ర‌జ‌ల మ‌ధ్య భావోద్వేగాలు చెల‌రేగ‌డం మిన‌హా సాధించేదేమీ ఉండ‌దన్న‌ది అందిరి […]

శ‌భాష్‌.. హ‌రీశ్‌..!
X
రెండు రాష్ర్టాల మ‌ధ్య వివాదాస్ప‌ద‌మ‌వుతున్న పాల‌మూరు ప్రాజెక్టు విష‌యంలో ఏపీ లేవ‌నెత్తిన అభ్యంత‌రాల‌ను నివృత్తి చేసేందుకు తెలంగాణ భారీ నీటిపారుద‌ల మంత్రి చొర‌వ‌ను అంతా అభినందిస్తున్నారు. క‌ర‌వు తాండ‌విస్తోన్న పాల‌మూరు జిల్లాను సస్య‌శ్యామ‌లం చేస్తూనే.. నిబంధ‌న‌ల మేర‌కు ఏపీకి రావాల్సిన వాటాను ఇచ్చేందుకు తెలంగాణ ప్ర‌భుత్వం సిద్ధ‌మేన‌ని ప్ర‌క‌టించ‌డంపై రాయ‌ల‌సీమ‌, తెలంగాణ వాసులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. ఈవిష‌యంలో పంతాలు ప‌ట్టింపుల‌కు పోతే.. రెండు రాష్ర్టాల ప్ర‌జ‌ల మ‌ధ్య భావోద్వేగాలు చెల‌రేగ‌డం మిన‌హా సాధించేదేమీ ఉండ‌దన్న‌ది అందిరి అభిప్రాయంగా ఉంది. రాష్ర్టాల మ‌ధ్య త‌లెత్తే ఇలాంటి జ‌ల‌వివాదాల‌ను కూర్చుని చ‌ర్చించుకుంటే త‌ప్ప‌కుండా స‌మ‌స్య‌కు ప‌రిష్కారం దొరుకుతుంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు ఎప్ప‌టి నుంచో చెబుతున్నారు.
నిన్న క‌ర్ణాట‌క‌, మ‌హారాష్ర్ట‌.. ఇప్పుడు ఏపీ..
పాల‌మూరుపై ఏపీ అభ్యంత‌రాల నేప‌థ్యంలో.. హ‌రీశ్ ఏపీ నీటిపారుద‌ల మంత్రి దేవినేని ఉమ‌కు ఫోన్ చేశారు. ఈ విష‌యంపై చ‌ర్చించేందుకు తాము సిద్ధ‌మ‌ని హ‌రీశ్ ప్ర‌క‌టించ‌డాన్ని అంతా స్వాగ‌తిస్తున్నారు. అంత‌రాష్ట్ర జ‌ల‌వివాదాల‌ను కూర్చుని మాట్లాడుకుని ప‌రిష్కారం చూపించేందుకు హ‌రీశ్ చేసిన ప్ర‌య‌త్నం అభినంద‌నీయ‌మే. ఇంత‌క్రితం తెలంగాణ తాను చేప‌ట్ట‌బోయే ప్రాజెక్టుల గురించి మ‌హారాష్ట్ర, క‌ర్ణాట‌క‌ల‌తో చ‌ర్చ‌లు జ‌ర‌ప‌డం, అవి స‌ఫ‌లం కావ‌డం తెలిసిందే. తాజాగా నెల‌కొన్న వివాదాన్ని కూడా అదే బాట‌లో ప‌రిష్క‌రించుకోవాల‌ని చూడ‌టాన్ని అంతా స్వాగ‌తిస్తున్నారు. ఇటు తెలంగాణ‌, అటు ఏపీ ఎవరి వాటాను వారు కేటాయింపుల మేర‌కు వాడుకుంటే ఎవ‌రికీ అభ్యంత‌రం ఉండ‌దు. నిబంధ‌న‌ల‌కు మించి వాడుకుంటేనే అది వివాదంగా మారుతుంది. ఇప్పుడు క‌ర్ణాట‌క‌, మ‌హారాష్ట్రలు ఇష్టానుసారంగా చేప‌ట్టిన ప్రాజెక్టుల‌తో తెలుగు రాష్ర్టాల‌కు నీటి క‌రువు ఏర్ప‌డిన సంగ‌తి తెలిసిందే. ఆ రెండు రాష్ర్టాలు త‌మ రాష్ట్రంలో చేప‌ట్ట‌బోయే ప్రాజెక్టుల విష‌యంపై ఏనాడూ ఉమ్మ‌డి ఏపీతో చ‌ర్చ‌ల‌కు ముందుకు రాలేదు. రాష్ర్ట విభ‌జ‌న త‌రువాత ఎగువ రాష్ర్టంగా ఉన్న తెలంగాణ తాను చేప‌ట్ట‌బోయే ప్రాజెక్టుల‌పై ఏపీ సందేహాల‌ను తీర్చేందుకు ముందుకు రావ‌డం శుభ‌సూచ‌క‌మే.
First Published:  5 May 2016 1:02 AM GMT
Next Story