Telugu Global
National

వ్యవస్థలే సిగ్గుపడాలి… 5పైసల కోసం 41ఏళ్లుగా కోర్టు చుట్టూ...

ఇదో విచిత్ర‌మైన కేసు. ర‌ణ్‌వీర్ సింగ్ యాద‌వ్ (73)అనే వ్య‌క్తి న‌ల‌భై ఏళ్లుగా ఢిల్లీ ర‌వాణా సంస్థ‌తో న్యాయ‌పోరాటం చేస్తున్నాడు. అదీ వేలు, ల‌క్షల కోసం కాదు, కేవ‌లం..ఐదుపైస‌లు…అవును ఐదు పైస‌ల కోస‌మే ఆయ‌న న‌ల‌భై ఏళ్లుగా ల‌క్ష‌ల రూపాయ‌లు ఖ‌ర్చుపెట్టాడు. అస‌లేం జ‌రిగింది అనే క‌థ‌లోకి వెళితే… 1973లో యాద‌వ్, ఢిల్లీ ర‌వాణా సంస్థ బ‌స్‌లో కండ‌క్ట‌ర్‌గా ప‌నిచేస్తుండేవాడు. అప్పుడు ఆయ‌న ఒక మ‌హిళా ప్ర‌యాణికురాలికి ప‌దిపైస‌ల టికెట్‌ని ఇచ్చి ఐదుపైస‌లు త‌న జేబులో వేసుకున్నాడు… […]

వ్యవస్థలే సిగ్గుపడాలి… 5పైసల కోసం 41ఏళ్లుగా కోర్టు చుట్టూ...
X

ఇదో విచిత్ర‌మైన కేసు. ర‌ణ్‌వీర్ సింగ్ యాద‌వ్ (73)అనే వ్య‌క్తి న‌ల‌భై ఏళ్లుగా ఢిల్లీ ర‌వాణా సంస్థ‌తో న్యాయ‌పోరాటం చేస్తున్నాడు. అదీ వేలు, ల‌క్షల కోసం కాదు, కేవ‌లం..ఐదుపైస‌లు…అవును ఐదు పైస‌ల కోస‌మే ఆయ‌న న‌ల‌భై ఏళ్లుగా ల‌క్ష‌ల రూపాయ‌లు ఖ‌ర్చుపెట్టాడు. అస‌లేం జ‌రిగింది అనే క‌థ‌లోకి వెళితే… 1973లో యాద‌వ్, ఢిల్లీ ర‌వాణా సంస్థ బ‌స్‌లో కండ‌క్ట‌ర్‌గా ప‌నిచేస్తుండేవాడు. అప్పుడు ఆయ‌న ఒక మ‌హిళా ప్ర‌యాణికురాలికి ప‌దిపైస‌ల టికెట్‌ని ఇచ్చి ఐదుపైస‌లు త‌న జేబులో వేసుకున్నాడు… అనేది అత‌నిమీద ఉన్న అభియోగం. త‌నిఖీ అధికారి ఆయ‌న‌ను ప‌ట్టుకోవ‌టంతో దీనిపై సంస్థ‌లో అంత‌ర్గ‌త విచార‌ణ చేయించారు. 1976లో యాద‌వ్‌ని దోషిగా తేల్చి ఉద్యోగం నుండి తొల‌గించారు. యాద‌వ్ 1990లో లేబ‌ర్ కోర్టులో త‌న కేసులో విజ‌యం సాధించాడు. అత‌డిని ఉద్యోగం నుండి తొల‌గించ‌డం చ‌ట్ట‌విరుద్ద‌మ‌ని కోర్టు పేర్కొంది. అయితే ఢిల్లీ ట్రాన్స్‌పోర్టు కార్పొరేష‌న్ దీనిపై తిరిగి పైకోర్టుకి వెళ్లింది. అప్ప‌టికే డిటిసి ఈ కేసుపై 47వేల రూపాయ‌లు ఖ‌ర్చుచేసింది.

చివ‌రికి ఈ కేసుని ఈ ఏడాది జ‌న‌వ‌రిలో హైకోర్టు కొట్టేసింది. యాద‌వ్‌కి న‌ష్ట‌ప‌రిహారంగా డిటిసి 30వేల రూపాయ‌లు చెల్లించాల‌ని, గ్రాట్యుటీ, ప్రావిడెంట్ ఫండ్‌గా రూ.1.28 ల‌క్ష‌లు, రూ. 1.37ల‌క్ష‌లు చెల్లించాల‌ని ఆదేశించింది. ఐదుపైస‌ల రిక‌వ‌రీ కోసం ఏన్ని ల‌క్ష‌లు ఖ‌ర్చుపెట్టారో చెప్ప‌మంటూ కోర్టు డిటిసిని ప్ర‌శ్నించింది. యాద‌వ్ అన్ని కోర్టుల్లో త‌న కేసులో విజ‌యం సాధిస్తున్నా అత‌నికి ప‌లితం ద‌క్క‌టం లేదంటూ కోర్టు డిటిసి వైఖ‌రిని త‌ప్పుప‌ట్టింది. ఈ కేసు ఇంకా ముగిసిపోలేదు. కార్‌క‌ర్‌డుమా కోర్టులో ఈ నెల 26న మ‌రొకసారి విచార‌ణ ఉంది.

ఐదుపైస‌ల కేసుకోసం తాము ఎన్నో క‌ష్టాల పాల‌య్యామ‌ని, ఆ నాణేలు సైతం చ‌లామ‌ణిలోంచి వెళ్లిపోయినా, ఇప్ప‌టికీ అది త‌మ‌ని వేధిస్తూనే ఉంద‌ని యాద‌వ్ భార్య విమ‌ల అంది. త‌న పిల్ల‌లకు ఊహ తెలియ‌క ముందు మొద‌లైన కేసు కావ‌టంతో పిల్ల‌లు త‌న‌ని నువ్వు నిజంగా నేరం చేశావా అని అడుగుతుంటే ఎంత‌గానో బాధ క‌లిగేద‌ని, అంద‌రూ ఆహ్లాద‌క‌ర‌మైన ప్రయాణాలు చేస్తుంటే తాను మాత్రం కోర్టుల చుట్టూ తిరిగాన‌ని యాద‌వ్ వాపోయాడు. ఇప్ప‌టివ‌ర‌కు చ‌ట్టానికి క‌ళ్లు లేవ‌నే అనుకునే వాళ్లం…ఈ కేసు చూశాక చ‌ట్టానికి కామ‌న్‌సెన్స్ కూడా లేద‌నిపిస్తోంది.

Click on Image to Read:

arun-jaitly

YS-Jagan

priyamani

ambati

pawan

IAS-Gorle-Rekha-Rani

pattipati1

madileti

drought

ys-jagan

babu-modi

sv-mohan-reddy-tdp

tdp corporaters

ap-medical-seets-scam

ajay-devagan-chandrababu

srichaitanya

First Published:  5 May 2016 3:03 AM GMT
Next Story