Telugu Global
CRIME

దేశ‌ప‌టాన్ని తప్పుగా చిత్రీకరిస్తే ఏడేళ్ల జైలు... రూ.100 కోట్ల జరిమానా!

దేశ చిత్ర‌ప‌టాన్ని త‌ప్పుగా చిత్రీక‌రించిన వారిపై కఠిన చ‌ర్య‌లు తీసుకునేందుకు కేంద్రం సిద్ధ‌మౌతోంది. ఇక‌పై ఎవ‌రైనా ఇలాంటి నేరానికి పాల్ప‌డితే వారికి ఏడేళ్ల వ‌ర‌కు జైలుశిక్ష‌ని, వంద కోట్ల వ‌ర‌కు జ‌రిమానాని విధించ‌నున్నారు. ఇటీవ‌ల కొన్ని సోష‌ల్ నెట్‌వ‌ర్కింగ్ సైట్లు జ‌మ్ము క‌శ్మీర్‌ పాకిస్తాన్‌లోనూ, అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌ చైనాలోనూ అంత‌ర్భాగం అన్న‌ట్టుగా దేశ చిత్ర‌ప‌టాన్నిరూపొందించి త‌మ సైట్ల‌లో ఉంచిన‌ నేప‌థ్యంలో కేంద్రం దీనిపై తీవ్రంగా స్పందించిన‌ట్టుగా తెలుస్తోంది. ఇటీవ‌ల ట్విట్ట‌ర్‌ క‌శ్మీర్‌ని చైనాలో, జ‌మ్ముని పాక్‌లో ఉన్న‌ట్టుగా […]

దేశ చిత్ర‌ప‌టాన్ని త‌ప్పుగా చిత్రీక‌రించిన వారిపై కఠిన చ‌ర్య‌లు తీసుకునేందుకు కేంద్రం సిద్ధ‌మౌతోంది. ఇక‌పై ఎవ‌రైనా ఇలాంటి నేరానికి పాల్ప‌డితే వారికి ఏడేళ్ల వ‌ర‌కు జైలుశిక్ష‌ని, వంద కోట్ల వ‌ర‌కు జ‌రిమానాని విధించ‌నున్నారు. ఇటీవ‌ల కొన్ని సోష‌ల్ నెట్‌వ‌ర్కింగ్ సైట్లు జ‌మ్ము క‌శ్మీర్‌ పాకిస్తాన్‌లోనూ, అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌ చైనాలోనూ అంత‌ర్భాగం అన్న‌ట్టుగా దేశ చిత్ర‌ప‌టాన్నిరూపొందించి త‌మ సైట్ల‌లో ఉంచిన‌ నేప‌థ్యంలో కేంద్రం దీనిపై తీవ్రంగా స్పందించిన‌ట్టుగా తెలుస్తోంది. ఇటీవ‌ల ట్విట్ట‌ర్‌ క‌శ్మీర్‌ని చైనాలో, జ‌మ్ముని పాక్‌లో ఉన్న‌ట్టుగా చూపించడం, కేంద్రం దానిపై నిర‌స‌న వ్య‌క్తం చేయ‌డంతో త‌న తప్పుని స‌రిదిద్దుకోవ‌టం తెలిసిందే. భూప్రాదేశిక సమాచార నియంత్రణ బిల్లు 2016 ముసాయిదా ప్రకారం..దేశ చిత్ర‌ప‌టాన్ని తాము సొంతంగా చిత్రీక‌రించుకుని, త‌మ ప్ర‌సార మాధ్య‌మాల ద్వారా ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లాల‌నుకున్న‌వారు త‌ప్ప‌నిస‌రిగా ప్ర‌భుత్వ అనుమ‌తి తీసుకోవాలి.

భార‌త భౌగోళిక రూపాన్ని కానీ డాటాని కానీ విమానాలు, ఉప‌గ్ర‌హాలు, బెలూన్స్‌, అంత‌రిక్ష నౌక‌లు లేదా మాన‌వ ర‌హిత అంత‌రిక్ష వాహ‌నాల ద్వారా ఫొటోల రూపంలో పొంద‌టం, అలాగే మ‌నుషులు చిత్రీక‌రించిన‌వి అయినా ఆ ముసాయిదా బిల్లు ప్రకారం భూ ప్రాదేశిక స‌మాచారం కింద‌కే వ‌స్తాయి. దీని ప్ర‌కారం గూగుల్ లాంటి ఆన్‌లైన్ వేదిక‌లు కూడా భార‌త్‌లో గూగుల్ మ్యాప్‌, గూగుల్ ఎర్త్ లాంటివి నిర్వ‌హించాలంటే త‌ప్ప‌నిస‌రిగా ప్ర‌భుత్వ నుండి అనుమ‌తి తీసుకోవాల్సి ఉంటుంది.

First Published:  6 May 2016 3:37 AM GMT
Next Story