Telugu Global
Others

25 జిల్లాలు ఏర్పాటవుతాయా?

తెలంగాణ‌లో కొత్త జిల్లాల క‌స‌ర‌త్తు ముమ్మ‌రంగా సాగుతోంది. గ‌తంలో ఈ ప్ర‌తిపాద‌న తెచ్చిన‌ప్ప‌టికీ సాధ్యాసాధ్యాల‌పై ప‌లువురు సందేహాలు లేవ‌నెత్త‌డంతో తాత్కాలికంగా వాయిదా ప‌డింది. తాజాగా మ‌రోసారి ఈ అంశం తెర‌పైకి వ‌చ్చింది. తెలంగాణ‌లో ఇప్పుడున్న 10 జిల్లాల‌కు అద‌నంగా 15 కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాల‌ని కేసీఆర్ నిర్ణ‌యించారు. కొత్త జిల్లాల‌తోపాటు కొత్త‌గా 40 మండ‌లాల‌ను సైతం ఏర్పాటు చేయాల‌ని యోచిస్తున్నారు. వీటిలో 8 నుంచి 10 మండ‌లాల‌కు ఒక ఆర్డీఓను నియ‌మిస్తారు. కొత్త జిల్లాల వ‌ల్ల […]

25 జిల్లాలు ఏర్పాటవుతాయా?
X
తెలంగాణ‌లో కొత్త జిల్లాల క‌స‌ర‌త్తు ముమ్మ‌రంగా సాగుతోంది. గ‌తంలో ఈ ప్ర‌తిపాద‌న తెచ్చిన‌ప్ప‌టికీ సాధ్యాసాధ్యాల‌పై ప‌లువురు సందేహాలు లేవ‌నెత్త‌డంతో తాత్కాలికంగా వాయిదా ప‌డింది. తాజాగా మ‌రోసారి ఈ అంశం తెర‌పైకి వ‌చ్చింది. తెలంగాణ‌లో ఇప్పుడున్న 10 జిల్లాల‌కు అద‌నంగా 15 కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాల‌ని కేసీఆర్ నిర్ణ‌యించారు. కొత్త జిల్లాల‌తోపాటు కొత్త‌గా 40 మండ‌లాల‌ను సైతం ఏర్పాటు చేయాల‌ని యోచిస్తున్నారు. వీటిలో 8 నుంచి 10 మండ‌లాల‌కు ఒక ఆర్డీఓను నియ‌మిస్తారు. కొత్త జిల్లాల వ‌ల్ల ప్ర‌జ‌ల‌కు ప‌రిపాల‌న మ‌రింత చేరువ అవుతుంద‌ని కేసీఆర్ చెబుతున్నారు. కేంద్రం నుంచి అద‌న‌పు నిధులు వ‌స్తాయ‌ని, యువ‌త‌కు ఉపాధి అవ‌కాశాలు పెరుగుతాయ‌ని వివ‌రిస్తున్నారు.
ఆచ‌ర‌ణ సాధ్య‌మేనా!
కొత్త జిల్లాల ఏర్పాటు విష‌య‌మై ఇప్ప‌టికే కేసీఆర్ నియ‌మించిన అధికార బృందం అధ్య‌య‌నం పూర్తి చేసింది. వీటిలో జిల్లా కేంద్రాల‌కు దూరంగా ఉన్న ప‌లు ప‌ట్ట‌ణాల‌ను జిల్లా కేంద్రాలుగా చేయాల‌ని వారు నివేదిక‌లో పేర్కొన్న‌ట్లు తెలిసింది. అయితే, దేవుడు క‌రుణించినా.. పూజారి వ‌ర‌మిస్తాడా..? అన్న‌ట్లుగా మారింది కొత్త జిల్లాల ఏర్పాటు.
తెలంగాణ రాష్ట్రం వీటి ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నా..కేంద్రం స‌హ‌క‌రించ‌క‌పోతే ఈ ప్ర‌క్రియ ముందుకు సాగే ప‌రిస్థితి లేదు. జిల్లా ప‌రిపాలన బాధ్య‌త చూడాల్సింది ఐఏఎస్‌లు, శాంతి భ‌ధ్ర‌త‌ల నిర్వ‌హ‌ణ ఐపీఎస్‌ల‌ది. అద‌నంగా 30 మంది అధికారులు కేంద్రం నుంచి రావాలంటే.. ఇప్ప‌టికిప్పుడు సాధ్య‌మ‌య్యే ప‌రిస్థితి కాదు.
ఇక‌పోతే.. కొత్త మండ‌లాల‌కు త‌హ‌సీల్దార్‌లు, ఆర్డీఓలు కావాలి. ఇది రాష్ట్ర ప‌రిధిలోని అంశ‌మే అయినా.. ఇప్ప‌టికిప్పుడు అంతమందిని ఎలా రిక్రూట్ చేస్తార‌న్న‌ది స‌మాధానం లేని ప్ర‌శ్నే! ఇక‌పోతే.. ఏపీ నుంచి విడిపోయాక ఇప్ప‌టికీ ఉద్యోగుల విభ‌జ‌నే పూర్తి కాలేదు. తెలంగాణ‌కు ఐఏఎస్‌, ఐపీఎస్‌లను కేటాయించ‌డం లేద‌ని ప‌లుమార్లు ప్ర‌భుత్వ‌మే అస‌హ‌నం వ్య‌క్తం చేసింది. మ‌రి ఇంత‌మంది కేంద్ర అధికారుల‌ను ఎలా పొందుతుంద‌న్న ప్ర‌శ్న‌కు ఎవ‌రి వ‌ద్దా స‌మాధానం లేదు. కొత్త జిల్లాల ఏర్పాటు రెండుమూడేళ్ల‌లో చేప‌ట్టే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు.
First Published:  6 May 2016 3:47 AM GMT
Next Story