Telugu Global
National

ఇత‌ను కూడా మోస్ట్ ఎట్రాక్టివ్ మ్యానే!

సాధార‌ణంగా ఆక‌ర్ష‌ణీయ‌మైన మ‌నుషులంటే చాలా అందంగా ఉండాలి లేదా ఏదో ఒక గొప్ప టాలెంట్ ఉండాలి… సెల‌బ్రిటీ అయినా అయి ఉండాలి. కానీ ఇవేమీ లేకుండానే అరుణ్ రైక్వార్ (37) ప్ర‌పంచంలోనే అత్యంత ఆక‌ర్ష‌ణీయ‌మైన వ్య‌క్తి అనే పేరు వ‌చ్చింది. ఇందుకోసం ఆయ‌న క‌ష్ట‌ప‌డింది కూడా ఏమీలేదు. అలా నిల‌బ‌డితే చాలు. అరుణ్ మౌనంగా క‌ద‌ల‌కుండా నిల‌బ‌డితే..ఎవ‌రైనా అత‌ని ఒంటికి గ‌రిటెలు, మేకులు లాంటి వాటిని అతికిస్తారు. విష‌య‌మేమిటంటే అలా నిట్ట‌నిలువుగా నిల‌బ‌డిన మ‌నిషి ఒంటిమీద పెట్టిన గ‌రిటెలు, స్పూన్లు గోడ‌కు త‌గిలించిన‌ట్టుగా అలా ఉండిపోతాయి. […]

ఇత‌ను కూడా మోస్ట్ ఎట్రాక్టివ్ మ్యానే!
X

సాధార‌ణంగా ఆక‌ర్ష‌ణీయ‌మైన మ‌నుషులంటే చాలా అందంగా ఉండాలి లేదా ఏదో ఒక గొప్ప టాలెంట్ ఉండాలి… సెల‌బ్రిటీ అయినా అయి ఉండాలి. కానీ ఇవేమీ లేకుండానే అరుణ్ రైక్వార్ (37) ప్ర‌పంచంలోనే అత్యంత ఆక‌ర్ష‌ణీయ‌మైన వ్య‌క్తి అనే పేరు వ‌చ్చింది. ఇందుకోసం ఆయ‌న క‌ష్ట‌ప‌డింది కూడా ఏమీలేదు. అలా నిల‌బ‌డితే చాలు. అరుణ్ మౌనంగా క‌ద‌ల‌కుండా నిల‌బ‌డితే..ఎవ‌రైనా అత‌ని ఒంటికి గ‌రిటెలు, మేకులు లాంటి వాటిని అతికిస్తారు. విష‌య‌మేమిటంటే అలా నిట్ట‌నిలువుగా నిల‌బ‌డిన మ‌నిషి ఒంటిమీద పెట్టిన గ‌రిటెలు, స్పూన్లు గోడ‌కు త‌గిలించిన‌ట్టుగా అలా ఉండిపోతాయి. ఇదే అరుణ్ ఘ‌న‌త.

తన ఒంటిమీద అతికించిన వ‌స్తువుల‌ను అలా అయ‌స్కాంతంలా ఆక‌ర్షించేయ‌టం వ‌ల్ల‌నే ఆయ‌న‌కు మోస్ట్ ఎట్రాక్టివ్ మ్యాన్ అనే పేరు వ‌చ్చింది. ఒక రోజు టేబుల్‌కి మేకుని కొడుతుంటే మేకు త‌న శ‌రీరానికి అతుక్కుపోతున్న‌ద‌న్న సంగ‌తి అరుణ్‌కి అర్థ‌మైంది. త‌రువాత ఇది తెలిసిన వారంతా అత‌డిని వింత‌గా చూడ‌టం మొద‌లుపెట్టారు. ఇప్పుడు అరుణ్‌కి ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఎట్రాక్టివ్ మ్యాన్ అనే పేరు వ‌చ్చింది. అయితే ఈ పేరు ప‌ట్ల అరుణ్ పెద్ద సంతోషంగా ఏమీ లేడు. ఇలా ఎందుకు జ‌రిగిందో త‌న‌కు తెలియ‌ద‌ని, తెలుసుకోవాల‌నే ఆస‌క్తి కూడా లేద‌ని అత‌ను చెబుతున్నాడు. అయితే అంద‌రూ త‌న‌ని చూడ‌టానికి రావ‌టం మాత్రం త‌న‌కు సంతోషాన్ని ఇస్తోంద‌ని అంటున్నాడు.

మొద‌ట్లో ఈ ప‌రిస్థితి భ‌యంగా అనిపించేద‌ని, కానీ త‌రువాత అల‌వాటై పోయింద‌ని ఆయ‌న చెబుతున్నాడు. ఇది త‌న ఆరోగ్యానికి హాని చేయ‌ద‌ని తెలుసుకునేందుకు డాక్ట‌రుని కూడా సంప్ర‌దించాడు. ఒక డాక్ట‌రు దీనిపై స్పందిస్తూ, మ‌న శ‌రీరాల్లో కూడా అయ‌స్కాంత క్షేత్రాలు ఉంటాయ‌ని, అరుణ్ రైక్వార్‌లో ఇది మ‌రింత ఎక్కువ‌గా ఉంద‌ని పేర్కొన్నాడు. మధ్య‌ప్ర‌దేశ్‌లోని సాగ‌ర్ జిల్లాకు చెందిన అరుణ్ ఫొటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తున్నాడు.

First Published:  6 May 2016 6:33 PM GMT
Next Story