Telugu Global
Others

కాంగ్రెస్ ను పాత‌రేయండి:  కేటీఆర్‌

తెలంగాణ వెన‌క‌బాటుకు కార‌ణ‌మైన కాంగ్రెస్‌ను పాత‌రేస్తేనే.. తెలంగాణ అభివృద్ధి సాధ్య‌మని కేటీఆర్ పిలుపునిచ్చారు. సానుభూతి విష‌యంలో ఆ పార్టీ అనుస‌రిస్తున్న విధానం దాని ద్వంద వైఖ‌రికి అద్దం ప‌డుతోంద‌ని విమ‌ర్శించారు. పాలేరు ఉప ఎన్నిక‌లో కాంగ్రెస్‌, టీడీపీ అనుస‌రిస్తోన్న విధానాల‌పై ఆయ‌న బ‌హిరంగ లేఖ విడుద‌ల చేశారు. లేఖ‌లో రెండుపార్టీల‌ను కేటీఆర్ తూర్పార‌బ‌ట్టారు. ఎన్నిక‌ల్లో పోటీ చేయాలంటే కావాల్సింది సానుభూతి కాద‌న్న సంగ‌తి కాంగ్రెస్ గుర్తెర‌గాల‌ని హిత‌వు ప‌లికారు. అయినా, సానుభూతి గురించి మాట్లాడే నైతిక‌త కాంగ్రెస్‌కు […]

కాంగ్రెస్ ను పాత‌రేయండి:  కేటీఆర్‌
X
తెలంగాణ వెన‌క‌బాటుకు కార‌ణ‌మైన కాంగ్రెస్‌ను పాత‌రేస్తేనే.. తెలంగాణ అభివృద్ధి సాధ్య‌మని కేటీఆర్ పిలుపునిచ్చారు. సానుభూతి విష‌యంలో ఆ పార్టీ అనుస‌రిస్తున్న విధానం దాని ద్వంద వైఖ‌రికి అద్దం ప‌డుతోంద‌ని విమ‌ర్శించారు. పాలేరు ఉప ఎన్నిక‌లో కాంగ్రెస్‌, టీడీపీ అనుస‌రిస్తోన్న విధానాల‌పై ఆయ‌న బ‌హిరంగ లేఖ విడుద‌ల చేశారు. లేఖ‌లో రెండుపార్టీల‌ను కేటీఆర్ తూర్పార‌బ‌ట్టారు. ఎన్నిక‌ల్లో పోటీ చేయాలంటే కావాల్సింది సానుభూతి కాద‌న్న సంగ‌తి కాంగ్రెస్ గుర్తెర‌గాల‌ని హిత‌వు ప‌లికారు. అయినా, సానుభూతి గురించి మాట్లాడే నైతిక‌త కాంగ్రెస్‌కు లేద‌ని స్ప‌ష్టం చేశారు. 1996లో సుజాతాన‌గ‌ర్ సిట్టింగ్ ఎమ్మెల్యే మ‌హ్మ‌ద్ ర‌జ‌బ్ అలీ మ‌ర‌ణిస్తే.. ఇదే రాంరెడ్డి వెంక‌ట‌రెడ్డి పోటీ చేశార‌ని గుర్తు చేశారు. పాలేరు విష‌యంలో ఇప్పుడు నీతులు చెబుతున్న కాంగ్రెస్కు ఆ స‌మ‌యంలో సానుభూతి విష‌యం గుర్తుకు రాలేదా? అని ప్ర‌శ్నించారు. 2014లో తెలంగాణ ఉద్య‌మంలో ఆత్మ‌త్యాగం చేసిన‌.. శ్రీ‌కాంతాచారి త‌ల్లి హుజూర్ న‌గ‌ర్ నుంచి పోటీ చేసిన‌పుడు ఉత్త‌మ్ కుమార్ రెడ్డికి సానుభూతి గుర్తుకు రాలేదా? అని ప్ర‌శ్నించారు.
తెలుగుదేశం ముమ్మాటికీ తెలంగాణ ద్రోహుల పార్టీ..
తెలంగాణ‌లో ఉంటూ ఏపీ ప్ర‌యోజ‌నాల కోసం పోరాడుతున్న తెలుగుదేశం మ‌రోసారి ఈ ప్రాంతానికి ద్రోహం చేస్తోంద‌ని ఆరోపించారు. పాలేరు ఉప ఎన్నిక‌లో కాంగ్రెస్ కు మ‌ద్ద‌తు ఇవ్వ‌డం ఆ పార్టీ అవ‌కాశ‌వాద రాజ‌కీయాల‌ను మ‌రోసారి నిరూపించుకుంద‌న్నారు. టీడీపీ త‌న మౌలిక విధానాల‌ను వ్య‌తిరేకంగా వ్య‌వ‌హ‌రించ‌డం త‌గ‌ద‌న్నారు. కాంగ్రెస్ కు వ్య‌తిరేకంగా పార్టీ స్థాపించిన ఎన్టీఆర్‌కు ఇప్పుడు కూడా ఆ పార్టీ నేత‌లు వెన్నుపోటు పొడుస్తూనే ఉన్నార‌ని ఆరోపించారు. పాలేరు ప్ర‌జ‌లు టీడీపీ, కాంగ్రెస్‌ను క‌చ్చితంగా ఓడిస్తార‌ని ధీమా వ్యక్తం చేశారు.
First Published:  6 May 2016 11:29 PM GMT
Next Story