Telugu Global
Others

కేసీఆర్‌కు కొత్త జిల్లాల సెగ‌!

తెలంగాణ‌లో త‌ల‌పెట్టిన  ఏర్పాటు చేయ‌ద‌త‌ల‌చిన కొత్త జిల్లాల ఏర్పాటు సెగ అప్పుడే మొద‌లైంది. తెలంగాణ‌లో ఇప్పుడున్న 10 జిల్లాల‌కు అద‌నంగా మ‌రో 15 జిల్లాల‌ను ఏర్పాటు చేయాల‌ని కేసీఆర్ నిర్ణ‌యించిన సంగ‌తి తెలిసిందే! ఇంత‌కాలం ప్ర‌తిపాద‌న‌ల ద‌శ‌లో ఉన్న ఈ అంశం ఇప్పుడు ప‌ట్టాలెక్క‌నుంద‌ని తెలియ‌డంతో అనుకూల, వ్య‌తిరేక అంశాలు తెర‌పైకి వ‌స్తున్నాయి. ఓ వైపు మ‌రిన్ని ప్రాంతాల‌ను జిల్లాలుగా ప్ర‌క‌టించాల‌ని కొంద‌రు డిమాండ్ చేస్తుండ‌గా.. మ‌రికొంద‌రు ఇందుకు వ్య‌తిరేకంగా ఆందోళ‌న‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్నారు. మ‌రోవైపు అధికార పార్టీ […]

కేసీఆర్‌కు కొత్త జిల్లాల సెగ‌!
X
తెలంగాణ‌లో త‌ల‌పెట్టిన ఏర్పాటు చేయ‌ద‌త‌ల‌చిన కొత్త జిల్లాల ఏర్పాటు సెగ అప్పుడే మొద‌లైంది. తెలంగాణ‌లో ఇప్పుడున్న 10 జిల్లాల‌కు అద‌నంగా మ‌రో 15 జిల్లాల‌ను ఏర్పాటు చేయాల‌ని కేసీఆర్ నిర్ణ‌యించిన సంగ‌తి తెలిసిందే! ఇంత‌కాలం ప్ర‌తిపాద‌న‌ల ద‌శ‌లో ఉన్న ఈ అంశం ఇప్పుడు ప‌ట్టాలెక్క‌నుంద‌ని తెలియ‌డంతో అనుకూల, వ్య‌తిరేక అంశాలు తెర‌పైకి వ‌స్తున్నాయి. ఓ వైపు మ‌రిన్ని ప్రాంతాల‌ను జిల్లాలుగా ప్ర‌క‌టించాల‌ని కొంద‌రు డిమాండ్ చేస్తుండ‌గా.. మ‌రికొంద‌రు ఇందుకు వ్య‌తిరేకంగా ఆందోళ‌న‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్నారు. మ‌రోవైపు అధికార పార్టీ నేత‌ల్లో మ‌రో ర‌క‌మైన కొత్త ఆందోళ‌న చెల‌రేగుతోంది. దీంతో కొత్త జిల్లాల ప్ర‌తిపాద‌న అధికార పార్టీలో చిచ్చు రేప‌వ‌చ్చ‌ని, కొత్త నాయ‌కుల పార్టీ ఆవిర్భావానికి వేదిక కానుంద‌న్న ప్ర‌చారం ఊపందుకుంది.
త‌మ నియోజ‌క‌వ‌ర్గం ఉంటుందా?
కొత్త జిల్లాల‌ ఏర్పాటుతో కేంద్రం నుంచి అద‌న‌పు నిధులు వ‌స్తాయ‌ని, యువ‌త‌కు ఉపాధి అవ‌కాశాలు పెరుగుతాయ‌ని కేసీఆర్ భావిస్తున్నారు. త‌ద్వారా ఇత‌ర పార్టీల నుంచి వ‌చ్చిన నాయ‌కుల‌తోపాటు, కొత్త నాయ‌కుల‌కు అవ‌కాశం ల‌భిస్తుంద‌ని సీఎం ఆశాభావంతో ఉన్నారు. ఇదే స‌మ‌యంలో కొత్త జిల్లాల ప్ర‌తిపాద‌న‌ సొంత‌పార్టీ నాయ‌కుల్లో క‌ల‌వ‌రానికి కార‌ణ‌మ‌వుతోంది. కొత్త జిల్లాలు ఏర్పాటైతే.. నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న త‌ప్ప‌నిస‌రి అవుతుంది. అంటే.. ఇప్పుడు త‌మ‌కు ప్రాబ‌ల్య‌మున్న ప్రాంతాలు మ‌రో నియోజ‌క‌వ‌ర్గంలో క‌లుస్తాయి. కొత్త జిల్లాల ఏర్పాటు, నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌పై సాధ్య‌మైనంత త్వ‌రగా నిర్ణ‌యం తీసుకోవాల‌ని ఒత్తిడి మొద‌లు పెట్టారు. ఈ విష‌యంలో ఇప్ప‌టికిప్పుడు నిర్ణ‌యం తీసుకోకుంటే త‌మ రాజ‌కీయ భ‌విష్య‌త్తు గంద‌ర‌గోళంగా మారుతుంద‌ని ఆందోళ‌న ప‌డుతున్నారు. అప్పుడు ప్ర‌తిప‌క్షాల‌కు ఆయాచిత ల‌బ్ధి చేకూర్చిన‌వారిమ‌వుతామ‌ని వాపోతున్నారు. అయితే, అలాంటి జాప్యం గ‌న‌క జ‌రుగుతుంద‌ని తెలిస్తే.. కొత్త జిల్లాల ఏర్పాటును కేసీఆరే వాయిదా వేస్తార‌ని ఆశాభావం వ్య‌క్తం చేస్తున్నారు.
First Published:  6 May 2016 11:42 PM GMT
Next Story