Telugu Global
Cinema & Entertainment

అబ్బా స‌మంత కు ఎంత మెచ్యూర్టీ..!

ఒక స్థాయికి చేరుకున్న వారిలో కొందిరికి స్వియ నామ జ‌పం బాగా వుంటుంది. అంటే త‌మ గురించి ఎదుటి వారు పొగుడుతుంటే.. ఆ మాట‌ల‌న్నీ నిజ‌మే అనుకుంటూ పొంగి పోతుంటారు. అటువంటి వారిని ఫేస్ చేయ‌డానికే ముత్యాల ముగ్గు చిత్రంతో రావు గోపాల రావు ఒక బ్యాండ్ ను పెట్టుకుంటాడు. ప్ర‌తి నాయుడి పాత్ర‌లో త‌న‌ను క‌ల‌వ‌డానికి వ‌చ్చి.. లేని పోనివి క‌లిపి పొగ‌డ్తల పైత్యం చూపితే వెంట‌నే బ్యాండ్ వాయిస్తూ అప్ర‌మ‌త్తం చేస్తుంటారు. అస‌లిదంతా ఎందుకంటే.. […]

అబ్బా స‌మంత కు ఎంత మెచ్యూర్టీ..!
X

ఒక స్థాయికి చేరుకున్న వారిలో కొందిరికి స్వియ నామ జ‌పం బాగా వుంటుంది. అంటే త‌మ గురించి ఎదుటి వారు పొగుడుతుంటే.. ఆ మాట‌ల‌న్నీ నిజ‌మే అనుకుంటూ పొంగి పోతుంటారు. అటువంటి వారిని ఫేస్ చేయ‌డానికే ముత్యాల ముగ్గు చిత్రంతో రావు గోపాల రావు ఒక బ్యాండ్ ను పెట్టుకుంటాడు. ప్ర‌తి నాయుడి పాత్ర‌లో త‌న‌ను క‌ల‌వ‌డానికి వ‌చ్చి.. లేని పోనివి క‌లిపి పొగ‌డ్తల పైత్యం చూపితే వెంట‌నే బ్యాండ్ వాయిస్తూ అప్ర‌మ‌త్తం చేస్తుంటారు. అస‌లిదంతా ఎందుకంటే.. స‌మంత ను ఈ మ‌ధ్య పొగిడే బ్యాచ్ ఎక్కువ‌యార‌ట‌.

అయితే త‌ను మాత్రం ఆ పొగ‌డ్త‌ల‌కు పొంగ కుండా చాల బ్యాల్సెన్డ్ గా ఉంటుంద‌ట‌. ఇంత‌కు స‌మంత‌ను త‌రుచుగా అడిగే ప్ర‌శ్న‌లు ఏమిటి అంటే.. మీ అందం, మీ అభిన‌యం ఈ రెంటిలో మీకు ఏది ఎక్కువ అంటే.. స‌మంత మాత్రం ఈ రెండు నాకు న‌చ్చేవి కాదని చెప్పిందిట‌. ఎందుకంటే.. అందంలో కానీ.. అభిన‌యంలో కాని.. అవ‌కాశం ఇస్తే.. త‌న‌కంటే అందగ‌త్తెలు..త‌న కంటే గొప్ప‌గా యాక్టింగ్ చేసే వాళ్లున్నార‌ని క్లారీటి ఇచ్చింది. అందుకే త‌నను త‌ను ఓ శ్రామికురాలు అని చెప్పుకుంటుంద‌ట‌. సో త‌న‌ను అందం, అభిన‌యం అంటూ పొగ‌డ‌టం కంటే.. త‌న హార్డ్ వ‌ర్క్ ను గౌర‌విస్తేనే సంతోషిస్తుంద‌ట‌. ప్ర‌స్తుతం 24 చిత్రంతో అల‌రిస్తున్న ఈ ముద్దుగుమ్మ.. త్వ‌ర‌లో బ్ర‌హ్మోత్స‌వం చిత్రంతో ముచ్చ‌ట‌గా మూడోసారి మ‌హేష్ స‌ర‌స‌న ఆడియ‌న్స్ ను అల‌రించనుంది. మొత్తం మీద స‌మంత పొగ‌డ్త‌ల‌ను బ్యాలెన్స్ చేస్తూ.. త‌న ప‌ని ప‌ట్ల డిగ్నిటి ఆఫ్ లేబ‌ర్ అనే ఆలోచ‌న‌న‌ను ఒక హీరోయిన్ క‌లిగి వుండ‌టం గొప్ప విష‌య‌మే.

First Published:  7 May 2016 2:55 AM GMT
Next Story