Telugu Global
Health & Life Style

బిడ్డ‌కు ఆరునెల‌ల‌లోపు జ‌లుబు....పెద్ద‌య్యాక మ‌ధుమేహం ముప్పు!

పుట్టిన ఆరునెల‌ల లోపు తీవ్ర‌మైన జ‌లుబు, ఫ్లూ జ్వ‌రాలు వ‌చ్చిన పిల్ల‌ల‌కు, పెద్ద‌య్యాక టైప్ 1డ‌యాబెటిస్ వ‌చ్చే అవ‌కాశాలు పెరుగుతాయ‌ని ఒక అధ్య‌య‌నంలో వెల్ల‌డైంది. ఇందుకోసం బవేరియాలో 2005-07 మ‌ధ్య‌కాలంలో జ‌న్మించిన మూడుల‌క్ష‌ల మంది పిల్ల‌ల ఆరోగ్య వివ‌రాల‌ను సేక‌రించారు. త‌రువాత పిల్ల‌ల‌కు మొద‌టి ఆరునెల‌ల్లో వ‌చ్చిన అనారోగ్యాలు, ఇన్‌ఫెక్ష‌న్ల వివ‌రాలు తెలుసుకున్నారు. చ‌ర్మం, క‌ళ్లు, పొట్ట‌లోప‌ల‌, ఊపిరితిత్తుల్లో వ‌చ్చే ప‌లుర‌కాల ఇన్‌ఫెక్ష‌న్ల‌ను న‌మోదు చేశారు. శిశువుల్లో మొద‌టి ఆరునెల‌ల్లో వైర‌స్ కార‌ణంగా వ‌చ్చిన జ‌లుబు, ఫ్లూ […]

బిడ్డ‌కు ఆరునెల‌ల‌లోపు జ‌లుబు....పెద్ద‌య్యాక మ‌ధుమేహం ముప్పు!
X

పుట్టిన ఆరునెల‌ల లోపు తీవ్ర‌మైన జ‌లుబు, ఫ్లూ జ్వ‌రాలు వ‌చ్చిన పిల్ల‌ల‌కు, పెద్ద‌య్యాక టైప్ 1డ‌యాబెటిస్ వ‌చ్చే అవ‌కాశాలు పెరుగుతాయ‌ని ఒక అధ్య‌య‌నంలో వెల్ల‌డైంది. ఇందుకోసం బవేరియాలో 2005-07 మ‌ధ్య‌కాలంలో జ‌న్మించిన మూడుల‌క్ష‌ల మంది పిల్ల‌ల ఆరోగ్య వివ‌రాల‌ను సేక‌రించారు. త‌రువాత పిల్ల‌ల‌కు మొద‌టి ఆరునెల‌ల్లో వ‌చ్చిన అనారోగ్యాలు, ఇన్‌ఫెక్ష‌న్ల వివ‌రాలు తెలుసుకున్నారు. చ‌ర్మం, క‌ళ్లు, పొట్ట‌లోప‌ల‌, ఊపిరితిత్తుల్లో వ‌చ్చే ప‌లుర‌కాల ఇన్‌ఫెక్ష‌న్ల‌ను న‌మోదు చేశారు. శిశువుల్లో మొద‌టి ఆరునెల‌ల్లో వైర‌స్ కార‌ణంగా వ‌చ్చిన జ‌లుబు, ఫ్లూ జ్వ‌రాలు వారి శ్వాస నాళం మీద ప్ర‌భావాన్ని చూపిన‌ట్టుగా, ఈ రిస్క్ వ‌ల‌న త‌రువాత జీవితంలో టైప్ 1 డ‌యాబెటిస్‌కి గుర‌య్యే ల‌క్ష‌ణాలు పెరిగినట్టుగా గుర్తించారు.

ఆ త‌రువాత వ‌య‌సులో వ‌చ్చిన ఇన్‌ఫెక్ష‌న్లు, శ్వాస నాళానికి కాకుండా ఇత‌ర అవ‌య‌వాలకు వ‌చ్చిన ఇన్‌ఫెక్ష‌న్లు టైప్ 1 మ‌ధుమేహం రిస్క్‌ని పెంచ‌క‌పోవ‌టం కూడా గ‌మ‌నించారు. అయితే ఈ ఇన్‌ఫెక్ష‌న్లు స‌రిగ్గా వ్యాధిగా మార‌డానికి దోహ‌దం చేస్తున్న అంశాల‌పై శాస్త్ర‌వేత్త‌ల‌కు ఇంకా స్ప‌ష్టత రావాల్సి ఉంది. మ‌నిషి జీవితంలో మొద‌టి ఆరునెల‌ల కాలం రోగ‌నిరోధ‌క వ్య‌వ‌స్థ అభివృద్ధికి, టైప్ 1 డ‌యాబెటిస్ లాంటి ఆటోఇమ్యూన్ వ్యాధులు వ‌చ్చే రిస్క్ పెర‌గ‌డానికి దోహ‌దం చేస్తుందని అధ్య‌య‌నం నిర్వ‌హించిన శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు. ఈ అద్య‌య‌నం త‌రువాత‌ వారు
భ‌విష్య‌త్తులో మ‌రిన్ని అంశాల‌ను క‌నుగొనాల్సి ఉంది. చిన్న‌త‌నంలో వ‌చ్చిన శ్వాస‌నాళ స‌మ‌స్య‌ల‌కు, పెద్ద‌య్యాక వ‌చ్చే టైప్ 1 డ‌యాబెటిస్ కి ఉన్న సంబంధం ఏమిటి…నిర్దిష్టంగా వ్యాధికార‌క క్రిములు ఉన్నాయా అనేది తేల్చాల్సి ఉంది. అదే తేలితే ఈ వ్యాధికి వ్యాక్సిన్ క‌నుగొన‌టం తేలిక‌వుతుంది.

First Published:  8 May 2016 11:14 AM GMT
Next Story