Telugu Global
NEWS

జ‌గ‌న్‌కు చంద్రబాబు సలహా... మరి ఆయనేం చేస్తారో ?

ప్రత్యేక హోదా అంశం టీడీపీని నీడలా వెంటాడుతోంది. ప్రత్యేక హోదా సాధ్యం కాదంటున్న బీజేపీ కంటే టీడీపీపైనే ఎక్కువగా ఒత్తిడి, విమర్శలు వస్తున్నాయి. ప్రత్యేకహోదా ఇవ్వలేమని కేంద్రం చెబుతున్నా చంద్రబాబు ఏం చేస్తున్నారని ప్ర‌తిప‌క్షాలు, ముఖ్యంగా వైసీపీ గ‌ట్టిగా డిమాండ్ చేస్తోంది. బిజేపితో చెలిమి వ‌దులుకుంటే ఏం జ‌రుగుతుందో త‌న దివ్యదృష్టితో క‌నిపెట్టేసిన చంద్ర‌బాబు మాత్రం విప‌క్షాల‌పైనే ఎదురుదాడి చేస్తున్నారు. గతంలో గుజ‌రాత్ లో అల్ల‌ర్లు జ‌రిగిన‌ప్పుడు మోదీని ఏపీలో అడుగుపెట్ట‌నివ్వ‌బోన‌ని గ‌ర్జించిన చంద్ర‌బాబు ఇప్పుడు మాత్రం సూక్ష్మ‌ధ్వ‌నుల‌తో […]

జ‌గ‌న్‌కు చంద్రబాబు సలహా... మరి ఆయనేం చేస్తారో ?
X

ప్రత్యేక హోదా అంశం టీడీపీని నీడలా వెంటాడుతోంది. ప్రత్యేక హోదా సాధ్యం కాదంటున్న బీజేపీ కంటే టీడీపీపైనే ఎక్కువగా ఒత్తిడి, విమర్శలు వస్తున్నాయి. ప్రత్యేకహోదా ఇవ్వలేమని కేంద్రం చెబుతున్నా చంద్రబాబు ఏం చేస్తున్నారని ప్ర‌తిప‌క్షాలు, ముఖ్యంగా వైసీపీ గ‌ట్టిగా డిమాండ్ చేస్తోంది. బిజేపితో చెలిమి వ‌దులుకుంటే ఏం జ‌రుగుతుందో త‌న దివ్యదృష్టితో క‌నిపెట్టేసిన చంద్ర‌బాబు మాత్రం విప‌క్షాల‌పైనే ఎదురుదాడి చేస్తున్నారు. గతంలో గుజ‌రాత్ లో అల్ల‌ర్లు జ‌రిగిన‌ప్పుడు మోదీని ఏపీలో అడుగుపెట్ట‌నివ్వ‌బోన‌ని గ‌ర్జించిన చంద్ర‌బాబు ఇప్పుడు మాత్రం సూక్ష్మ‌ధ్వ‌నుల‌తో స‌రిపెడుతోంది.

తాజాగా ఆదివారం విజ‌య‌వాడ‌లో పార్టీ సీనియ‌ర్ నేత‌ల‌తో చంద్ర‌బాబు చ‌ర్చించారు. ప్ర‌స్తుత ప‌రిస్థితి నుంచి గ‌ట్టెక్క‌డం ఎలా అన్న దానిపై స‌మాలోచ‌న చేశారు. చివ‌ర‌కు పాత పాటే పాడాల‌ని నిర్ణ‌యించుకున్నారు. కేంద్రంలో మిత్ర‌ప‌క్షంగానే ఉంటూ ఒత్తిడి తెద్దాం అని సీనియ‌ర్ల‌కు చంద్ర‌బాబు సూచించారు. ఇది ఊహించ‌ని స‌మాధానం కావడంతో సీనియ‌ర్లు కూడా ఎదురు చెప్ప‌లేదని స‌మాచారం. ప్ర‌ధానికి ఒక లేఖ రాద్దామ‌ని కూడా చంద్ర‌బాబు చెప్పారు. ప‌నిలో ప‌నిగా వైసీపీ విమ‌ర్శ‌ల‌పైనా చంద్ర‌బాబు సీరియ‌స్ అయ్యారు. జగన్ రాష్ట్రంలో ఆందోళనలు చేయడం సరికాదన్నారు. లోకల్ లో నిరసనల వల్ల ఫలితం ఉండదని వెళ్లి ఢిల్లీలో నిరసన తెలపాలని జ‌గ‌న్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

చంద్ర‌బాబు చెప్పింది కాస్త గ‌మ్మ‌త్తుగానే ఉంది. కేంద్రంతో క‌య్యం పెట్టుకుంటే హోదా రాదంటూనే జ‌గ‌న్ ఢిల్లీ వెళ్లి ఆందోళ‌న‌లు చేయాల‌నడం కొత్త‌గానే ఉంది. పైగా ప్ర‌తిప‌క్షం చేసే పోరాటాల‌కు స్పందించే స్థాయిలో ప్ర‌భుత్వాలు న‌డుస్తున్నాయా?. అదేదో కేంద్రం నుంచి మంత్రుల‌ను ఉప‌సంహ‌రించుకుని ప్ర‌తిప‌క్షాల‌కు నీత‌లు చెబితే బాగుంటుంద‌ని గానీ… మేం మాత్రం బీజేపీ బెడ్ రూమ్ ను వ‌దిలిరాం… మీరు మాత్రం ఢిల్లీ గ‌ల్లీలో పోరాటం చేయండి అని చెప్ప‌డం బట్టి నిజంగా చంద్ర‌బాబు గ్రేటే. ప్రతిపక్షాలు ఢిల్లీలో ధ‌ర్నాలు చేస్తే మ‌రి చంద్ర‌బాబు ఇక్క‌డుండి ఏం చేస్తారో?. అయినా నిజం చెప్పాలంటే ప్రత్యేక హోదా సాధించేంత సినిమా మన లీడర్లకు ఉందా?.

click to read-

devi-reddy-death

upasana-reaction

babu-heritage

revanth

katamaneni-bhaskar

gattu-srikanth-reddy

ganta-srinivas-rao

chandrababu-pulivendula

defection-mlas

First Published:  8 May 2016 10:07 AM GMT
Next Story