Telugu Global
NEWS

తండ్రిని తప్పుదారి పట్టించే ప్రయత్నంలోనే ప్రమాదం.. కారు 180 డీగ్రీలు కట్ కొట్టింది- సీపీ

హైదరాబాద్ జూబ్లిహిల్స్ లో అనుమానాస్పద స్థితిలో చనిపోయిన దేవి ఉదంతంపై పోలీసుల విచారణ ముగిసింది. వివరాలను హైదరాబాద్ సీపీ మహేందర్ రెడ్డి మీడియాకు వివరించారు. భరత్ తో తాను ఉన్న విషయం తండ్రి తెలియకుండా ఉంచేందుకు దేవి ప్రయత్నించే క్రమంలోనే కారు ప్రమాదం జరిగిందని చెప్పారు. దేవి ఇంటి దగ్గర నుంచి బయలుదేరి… చివరకు ప్రాణాల కోల్పోయే వరకు  ప్రతి నిమిషం ఏం జరిగిందన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేశారు. దేవి పబ్ కు వెళ్తున్న విషయం […]

తండ్రిని తప్పుదారి పట్టించే  ప్రయత్నంలోనే ప్రమాదం.. కారు 180 డీగ్రీలు కట్ కొట్టింది- సీపీ
X

హైదరాబాద్ జూబ్లిహిల్స్ లో అనుమానాస్పద స్థితిలో చనిపోయిన దేవి ఉదంతంపై పోలీసుల విచారణ ముగిసింది. వివరాలను హైదరాబాద్ సీపీ మహేందర్ రెడ్డి మీడియాకు వివరించారు. భరత్ తో తాను ఉన్న విషయం తండ్రి తెలియకుండా ఉంచేందుకు దేవి ప్రయత్నించే క్రమంలోనే కారు ప్రమాదం జరిగిందని చెప్పారు. దేవి ఇంటి దగ్గర నుంచి బయలుదేరి… చివరకు ప్రాణాల కోల్పోయే వరకు ప్రతి నిమిషం ఏం జరిగిందన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేశారు.

దేవి పబ్ కు వెళ్తున్న విషయం ఆమె తండ్రి కి తెలియదని సీపీ చెప్పారు. స్నేహితురాలు సోనాలి ఇంటి వద్ద దేవిని ఆమె తండ్రి డ్రాప్ చేసి వెళ్లారు. సోనాలి ఇంటి వద్దకు వచ్చిన భరత్ సింహారెడ్డి తన కారులో దేవి, సోనాలిని ఎక్కించుకుని నానక్ గూడలోని పబ్ కు వెళ్లాడు. భరత్ తో పాటు అతడి స్నేహితులు పృథ్వీ, విశ్వనాథ్ కూడా పబ్ కు వచ్చారు. అయితే రాత్రి ఒంటి గంట సమయంలో దేవి తండ్రి నుంచి ఆమెకు ఫోన్ వచ్చింది. ఆలస్యమైందని వెంటనే ఇంటికి రావాలని సూచించారు. అయితే తనను సోనాలి ఇంటి వద్ద డ్రాప్ చేస్తుందని వచ్చేస్తున్నానని దేవి చెప్పింది.

ఎంత సేపటికీ రాకపోవడంలో దేవి తండ్రి నుంచి పదేపదే ఫోన్ కాల్స్ వచ్చినట్టు పోలీసులు గుర్తించారు. ఈ బ్యాచ్ రాత్రి 2. 30కు పబ్ నుంచి బయటకు వచ్చినట్టు సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా గుర్తించారు. దేవిని ఇంటి దగ్గర డ్రాప్ చేసేందుకు సోనాలి ముందుకొచ్చినా తాను భరత్ తో కలిసి వెళ్తానని దేవి చెప్పింది. దీంతో సోనాలి, ఆమె కజిన్ కలిసి ఇంటికి వెళ్లిపోయారు. ఆ రోజు పబ్ కు వచ్చిన వారి సంఖ్య భారీగా ఉండడంతో పార్కింగ్ నుంచి కారు బయటకు తీసి బయలు దేరే సమయానికి రాత్రి. 3.30 అయినట్టు గుర్తించారు.

అప్పటికే దేవి తండ్రి పదేపదే ఫోన్ చేస్తూనే ఉన్నారు. ఎక్కడున్నావో చెబితే తానే వచ్చి తీసుకెళ్తానని చెప్పారు. అయితే భరత్ తో తాను ఉన్న విషయం తెలిస్తే ఇబ్బంది వస్తుందని భయపడిన దేవి … దారిలో ఉన్నాం వచ్చేస్తున్నాం అని నమ్మిచింది. త్వరగా చేరుకోవాలన్న ఉద్దేశంతో 14 కి. మీ దూరాన్ని కేవలం 10 నిమిషాల్లో క్రాస్ చేశారు. చివరకు దేవి ఇంటికి దగ్గర్లోకి వచ్చిన తర్వాత భరత్ తో తాను ఉన్నట్టు ఫాదర్ కు తెలిసిపోతుందని దేవి భయపడింది. అప్పటి వరకు తాను సోనాలితోనే ఉన్నానని నమ్మించేందుకు కారును పక్కనే ఉన్న ఒక గల్లీలోకి తీసుకెళ్లి ఆపారు.

తన తండ్రిని నమ్మించేందుకు సోనాలితో కాన్ఫరెన్స్ కాల్ కలిపే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే దేవి ఫోన్ లో చార్జీంగ్ అయిపోవడంతో భరత్ మొబైల్ నుంచి ట్రై చేశారు. కానీ అది వర్కవుట్ కాకపోవడంతో కారును వేగంగా వెనక్కు తిప్పాడు భరత్. అలా గల్లీలో నుంచి బయటకు వస్తూ మలుపు చివరకు చాలా వేగంగా కారును తిప్పాడు భరత్. దీంతో కారు అదుపు తప్పి 180 డిగ్రీలు గిర్రున తిరిగి వెళ్లి పక్కనే ఉన్న చెట్టును ఢీకొట్టినట్టు సీపీ చెప్పారు. కారులోని రెండు ఎయిర్ బ్యాగులు ఓపెన్ అయినప్పటికీ కారు 180 డిగ్రీలు తిరిగి పక్క వైపు నుంచి చెట్టును ఢీకొట్టడంతో దేవికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే బయటకు దిగిన భరత్… దేవి దేవి అంటూ కేకలు వేస్తూ కారు చుట్టూ తిరిగారని సీపీ మహేందర్ రెడ్డి చెప్పారు.

అదే సమయంలో అటుగా వెళ్లిన పెట్రోలింగ్ పోలీసులు వెళ్లి అతి కష్టం మీద దేవిని కారు నుంచి బయటకు తీశారని వెల్లడించారు. ఇంతలోనే భరత్ కు అతడి తల్లిదండ్రుల నుంచిపోన్ కాల్ వచ్చిందని … ప్రమాదం విషయం వారితో భరత్ చెప్పారని సీపీ వెల్లడించారు. దేవి మొబైల్ కారులోపల పడిపోవడంతో దాన్ని కనిపెట్టి ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందించడంలో ఆలస్యమైందని సీపీ చెప్పారు. భరత్, దేవి ఇద్దరు గొడవ పడడం, అమ్మాయిని బలవంతంగా కారులో వేసుకోవడం తాను చూశానని వాచ్ మెన్ రాములు చెప్పడంపైనా సీపీ స్పందించారు.

రాములు చెప్పిన దానికి సంబంధించి సరైన ఆధారాలు లభించలేదన్నారు. ఆ కోణంలో ఇంకా దర్యాప్తు కొనసాగిస్తామన్నారు. తెల్లవారుజామున 3. 58 గంటలకు ప్రమాదంజరిగిందని వెల్లడించారు. ప్రమాదం జరిగిన సమయంలో భరత్ తాగి ఉన్నాడని వెల్లడించారు. తాగి కారు నడిపి దేవి మృతికి కారణమైన భరత్ పై కేసులు నమోదు చేశామని చెప్పారు. కనీసం పదేళ్లు జైలు శిక్ష‌ పడే అవకాశం ఉందన్నారు. దేవిపై ఎలాంటి లైంగిక దాడి జరగలేదని వైద్యులు నిర్ధారించారని చెప్పారు సీపీ. నేరుగా ఇంటికి వెళ్లి ఉంటే ప్రమాదం జరిగేది కాదని…దేవి తన తండ్రిని తప్పుదోవ పట్టించే ప్రయత్నంలోనే ఇదంతా జరిగిందని సీపీ మహేందర్ రెడ్డి వివరించారు.

click to read-

upasana-reaction

babu-heritage

revanth

katamaneni-bhaskar

gattu-srikanth-reddy

ganta-srinivas-rao

chandrababu-pulivendula

defection-mlas

First Published:  8 May 2016 7:18 AM GMT
Next Story