ఎన్టీఆర్ ను వాళ్ల అమ్మ బాగా కొట్టి మందు రాసేదా..!

జూనియ‌ర్ ఎన్టీఆర్ చిన్న‌ప్పుడు మ‌హా అల్లరి పిల్లాడు . గొడ‌వ బాగా చేసే వాడ‌ట‌. దీంతో వాళ్ల అమ్మ‌గారు బాగా కొట్టి ఆ త‌రువాత దెబ్బ‌ల‌కు ముందు రాసేవార‌ట‌. ఆమే దెబ్బ‌ల కొట్ట‌డం వెన‌క ..కొడుకు ప్ర‌యోజ‌కుడై మంచి గుర్తింపు తెచ్చుకోవాల‌న‌దే . ఆ విష‌యం అప్పుడు ఎన్టీఆర కు అర్దం కాక పోయినా.. హీరో అయిన త‌రువాత త‌ల్లి త‌న కోసం ఎంత ఆవేద‌న చెందేదో.. త‌నను ఆ స‌మ‌యానికి కొన్ని దెబ్బ‌లు కొట్టిన‌ప్ప‌ట‌కి .. ఆ త‌రువాత ఆమే క‌న్నీళ్లు పెట్టుకుంటూ క‌ష్ట‌ప‌డి జీవితంలో ఎద‌గాలిరా.. గుర్తింపు .. గౌర‌వం తెచ్చుకోవాలి అని చెప్పిన మాట‌లు మాత్రం ఎన్టీఆర్ కు గుండెల్లోకి వెళ్లాయి. అందుకే ఎన్టీఆర్ మాతృదేవోభ‌వ అంటున్నారు. అమ్మ ఆవేద‌న‌.. దండ‌న లేక పోతే త‌నంత‌టి వాడు అయ్యే వాడినే కాదంటూ త‌ల్లి కి మ‌ద‌ర్స్ డే శుభాకాంక్షలు చెప్పారు. సో క‌మ్మ‌నైనా అమ్మ దెబ్బ కూడా దీవెనే అంటే ఇదే క‌దా.!