Telugu Global
CRIME

ఎట్ట‌కేల‌కు టెక్నాలజీ....అత‌నికి విడాకులు ఇప్పించింది!

త‌న తెలివితేట‌ల‌న్నీ ఉప‌యోగించి ఒక టెక్కీ, భార్య చేస్తున్న మోసాన్ని బ‌య‌ట‌పెట్టి విడాకులు పొందాడు. బెంగ‌ళూరుకి చెందిన ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ (31)కి త‌న‌బార్యకి వివాహేత‌ర సంబంధం ఉంద‌నే అనుమానం వ‌చ్చింది. గ‌త ఏడాది ఫిబ్ర‌వ‌రిలో త‌న ఇంట్లో ఒక సిగ‌రెట్ ముక్క‌ని చూసిన‌పుడు అత‌నికి ఆ అనుమానం వ‌చ్చింది. భార్యని నిల‌దీసినా ఆమె కాదంటే కాదంది. దాంతో అత‌ను ఇంట్లో లివింగ్ రూములో వాల్‌క్లాక్ వెనుక ఒక‌సారి, మ‌రో రెండు ప్ర‌దేశాల్లో మ‌రొక‌సారి ర‌హ‌స్య కెమెరాలు […]

ఎట్ట‌కేల‌కు టెక్నాలజీ....అత‌నికి విడాకులు ఇప్పించింది!
X

త‌న తెలివితేట‌ల‌న్నీ ఉప‌యోగించి ఒక టెక్కీ, భార్య చేస్తున్న మోసాన్ని బ‌య‌ట‌పెట్టి విడాకులు పొందాడు. బెంగ‌ళూరుకి చెందిన ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ (31)కి త‌న‌బార్యకి వివాహేత‌ర సంబంధం ఉంద‌నే అనుమానం వ‌చ్చింది. గ‌త ఏడాది ఫిబ్ర‌వ‌రిలో త‌న ఇంట్లో ఒక సిగ‌రెట్ ముక్క‌ని చూసిన‌పుడు అత‌నికి ఆ అనుమానం వ‌చ్చింది. భార్యని నిల‌దీసినా ఆమె కాదంటే కాదంది. దాంతో అత‌ను ఇంట్లో లివింగ్ రూములో వాల్‌క్లాక్

వెనుక ఒక‌సారి, మ‌రో రెండు ప్ర‌దేశాల్లో మ‌రొక‌సారి ర‌హ‌స్య కెమెరాలు ఫిట్ చేశారు. అంతేకాకుండా భార్య ఫోన్ సంభాష‌ణ త‌న ల్యాప్‌ట్యాప్‌లో వినిపించేలా ఏర్పాట్లు చేసుకున్నాడు. ఇదంతా చేశాక గ‌త ఏడాది జులైలో అతను భార్య‌ని ప‌ట్టుకోగ‌లిగాడు. ఆమె త‌న బాయ్‌ఫ్రెండ్‌కి గ‌ర్భ‌నిరోధ‌క సాధ‌నాలు తెమ్మ‌ని ఫోన్ ద్వారా చెప్ప‌టాన్ని రికార్డు చేశాడు. దాంతోపాటు ఇంట్లో ఫిట్ చేసిన కెమెరాలు కూడా వారిద్ద‌రినీ ఒక‌టిగా ప‌ట్టిచ్చాయి.
ఈ కేసుని బెంగ‌లూరులోని మ‌ధ్య‌వ‌ర్తిత్వ కేంద్రం (బిఎమ్‌సి) విచార‌ణ జ‌రిపింది. గత ఏడాది ఆగ‌స్టులో భ‌ర్త బిఎమ్‌సిలో కేసు వేశాడు. చివ‌రికి భార్య త‌న త‌ప్పుని ఒప్పుకుని విడాకుల‌కు అంగీక‌రించింది. ప‌ర‌స్ప‌ర అంగీకారం మీద వారికి ఇప్పుడు విడాకులు మంజూరు అయ్యాయి. వారి మూడేళ్ల చిన్నారి బాధ్య‌త‌ను తండ్రికి అప్ప‌గించారు. ఈ మ‌ధ్య‌కాలంలో ఇలాంటి వివాహేత‌ర సంబంధాలు పెరిగిపోతున్నాయ‌ని, కొంత‌మంది వివాహ బంధాన్ని తెంచుకోవ‌డానికి ఇష్ట‌ప‌డ‌టం లేద‌ని, కొంద‌రు తెంచేసుకుంటున్నారని బిఎమ్‌సి ప్ర‌తినిధి ఒకరు అన్నారు.

First Published:  8 May 2016 2:13 AM GMT
Next Story