Telugu Global
Others

కేటీఆర్ జైలుకు వెళ్లాల్సి వ‌స్తుందా?

పాలేరు ఉప ఎన్నిక ప్ర‌చారంలో భాగంగా కేటీఆర్  కాంగ్రెస్‌పై చేసిన విమ‌ర్శ‌లు పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. కాంగ్రెస్‌ను పాత‌రేయాల‌ని కేటీఆర్ ప్ర‌జ‌ల‌కు రాసిన బ‌హిరంగ లేఖ‌లో పిలుపునిచ్చిన సంగ‌తి తెలిసిందే! ఈ వ్యాఖ్య‌ల‌పై కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌లు అగ్గిమీద గుగ్గిల‌మ‌వుతున్నారు. కేటీఆర్‌కు అదే స్థాయిలో ప్ర‌తివిమ‌ర్శ‌లు చేస్తున్నారు.  ఎమ్మెల్సీ ష‌బ్బీర్ అలీ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాత‌రేయ‌డం కేటీఆర్ వ‌ల్ల కాదు క‌దా! ఆయ‌న తాత వ‌ల్ల కూడా కాద‌ని స్ప‌ష్టం చేశారు. కాంగ్రెస్ చ‌రిత్ర తెల‌వ‌కుండా మాట్లాడ‌వ‌ద్ద‌ని […]

కేటీఆర్ జైలుకు వెళ్లాల్సి వ‌స్తుందా?
X
పాలేరు ఉప ఎన్నిక ప్ర‌చారంలో భాగంగా కేటీఆర్ కాంగ్రెస్‌పై చేసిన విమ‌ర్శ‌లు పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. కాంగ్రెస్‌ను పాత‌రేయాల‌ని కేటీఆర్ ప్ర‌జ‌ల‌కు రాసిన బ‌హిరంగ లేఖ‌లో పిలుపునిచ్చిన సంగ‌తి తెలిసిందే! ఈ వ్యాఖ్య‌ల‌పై కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌లు అగ్గిమీద గుగ్గిల‌మ‌వుతున్నారు. కేటీఆర్‌కు అదే స్థాయిలో ప్ర‌తివిమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఎమ్మెల్సీ ష‌బ్బీర్ అలీ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాత‌రేయ‌డం కేటీఆర్ వ‌ల్ల కాదు క‌దా! ఆయ‌న తాత వ‌ల్ల కూడా కాద‌ని స్ప‌ష్టం చేశారు. కాంగ్రెస్ చ‌రిత్ర తెల‌వ‌కుండా మాట్లాడ‌వ‌ద్ద‌ని హిత‌వుప‌లికారు. రాష్ట్రంలో టీఆర్ ఎస్ అధికారంలోకి రావ‌డం కాంగ్రెస్ పుణ్య‌మేన‌ని తెలిపారు. సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రం ఇవ్వ‌కుంటే మీరు అధికారంలోకి వ‌చ్చేవారా? అని ప్ర‌శ్నించారు. టీడీపీలో చేర‌క‌ముందు మీ తండ్రి ఏపార్టీలో ఉండేవారో తెలుసుకోవాల‌ని సూచించారు..
ఘాటు ప‌దాల‌తో చెల‌రేగిన‌ భ‌ట్టీ…!
ష‌బ్బీర్ అలీ కాస్త సున్నితంగా చెప్పినా.. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భ‌ట్టి విక్ర‌మార్క మాత్రం త‌న‌దైన శైలిలో ఘాటుగా విమ‌ర్శించారు. కేటీఆర్ ఓ పిల్లకాకి అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ఉండేలు దెబ్బ తెలియ‌క మాట్లాడుతున్నాడ‌ని, అది త‌గిలే రోజులు ముందే ఉన్నాయ‌ని హెచ్చ‌రించారు. కాంగ్రెస్‌ను కాదు.. నిన్ను, నీ అయ్యను, నీ కుటుంబాన్ని పాతరేసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. నోరు అదుపులో పెట్టుకోకుంటే పాలేరు ప్రజలు తరిమికొడతారని స్ప‌ష్టం చేశారు. ఖమ్మం జిల్లాలో రూ.10 వేల కోట్లు దోచుకునేందుకు కేసీఆర్, కేటీఆర్, తుమ్మల ప్రణాళికలు రూపొందించినట్లు ఆరోపించారు. అభివృద్ధి పేరిట‌ కేటీఆర్ చేసిన అవినీతి బయటపడితే జైలుకు వెళ్లాల్సి వస్తుందనే భయంతోనే ఇటీవల ఆయన మంత్రిత్వ శాఖను సీఎం కేసీఆర్ మార్చివేశాడ‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.
First Published:  9 May 2016 1:10 AM GMT
Next Story