Telugu Global
Cinema & Entertainment

దుమ్మురేపుతున్న సూర్య

సూర్య-విక్రమ్ కుమార్ కాంబినేషన్ లో వచ్చిన 24 సినిమా బాక్సాఫీస్ బరిలో దుమ్మురేపుతోంది. తొలి రోజు నుంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. విక్రమ్ కుమార్ టేకింగ్, సూర్య యాక్టింగ్ ను ప్రతి ఒక్కరు మెచ్చుకుంటున్నారు. మరీ ముఖ్యంగా ఆత్రేయ పాత్రలో సూర్య నటన అద్భుతమంటూ పొగిడేస్తున్నారు. ఇలా పాజిటివ్ టాక్ తో తొలి రోజువసూళ్ల వర్షం కురిపించింది సూర్య సినిమా. ఏపీ, నైజాంతో కలుపుకొని దాదాపు మూడున్నర కోట్ల రూపాయల కలెక్షన్లు కొల్లగొట్టింది. ఈ సినిమాను […]

దుమ్మురేపుతున్న సూర్య
X
సూర్య-విక్రమ్ కుమార్ కాంబినేషన్ లో వచ్చిన 24 సినిమా బాక్సాఫీస్ బరిలో దుమ్మురేపుతోంది. తొలి రోజు నుంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. విక్రమ్ కుమార్ టేకింగ్, సూర్య యాక్టింగ్ ను ప్రతి ఒక్కరు మెచ్చుకుంటున్నారు. మరీ ముఖ్యంగా ఆత్రేయ పాత్రలో సూర్య నటన అద్భుతమంటూ పొగిడేస్తున్నారు. ఇలా పాజిటివ్ టాక్ తో తొలి రోజువసూళ్ల వర్షం కురిపించింది సూర్య సినిమా. ఏపీ, నైజాంతో కలుపుకొని దాదాపు మూడున్నర కోట్ల రూపాయల కలెక్షన్లు కొల్లగొట్టింది. ఈ సినిమాను తెలుగులో నితిన్ కు చెందిన శ్రేష్ఠ్ మూవీస్ సంస్థ సమర్పిస్తోంది. నైజాంలో మొదటి రోజే ఈ సినిమాకు కోటిన్నర షేర్ వచ్చింది. దాదాపు 2కోట్ల రూపాయలకు నితిన్ ఈ సినిమాను కొన్నట్టు తెలుస్తోంది. అంటే శని, ఆదివారాల వసూళ్లతో కలుపుకుంటే నితిన్ మూడు రోజుల్లోనే ప్రాఫిట్ జోన్ లోకి ఎంటరైపోయాడన్నమాట. ఇక మరో వీకెండ్ కూడా 24 సినిమా నడిచిందంటే శ్రేష్ఠ్ మూవీస్ కు లాభాల పంటే. అన్నట్టు ఈ సినిమాలో అన్నీ బాగున్నప్పటికీ ప్రేమ సన్నివేశాలు సరిగా పండలేదు. అందుకే దాదాపు 9 నిమిషాల నిడివి కలిగిన రొమాంటిక్ సన్నివేశాల్ని సినిమా నుంచి తొలిగిస్తున్నారు.
First Published:  9 May 2016 1:09 AM GMT
Next Story