Telugu Global
National

మోడీ... డిగ్రీలు చూపించారు...అయినా ఫేక‌న్నారు!

ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ చ‌దువుకి సంబంధించిన ధృవీక‌ర‌ణ ప‌ట్టాల‌ను బిజెపి పార్టీ వెల్ల‌డించింది. బిజెపి అధ్య‌క్షుడు అమిత్‌షా, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఇరువురు క‌లిసి సోమ‌వారం వీటిని విలేక‌రుల స‌మావేశంలో చూపించారు. మోడీ ఢిల్లీ విశ్వ‌విద్యాల‌యం నుండి బిఎ, గుజ‌రాత్ విశ్వ‌విద్యాల‌యం నుండి ఎంఎ పూర్తి చేశార‌ని వారు వివ‌రించారు. ఇటీవ‌ల ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్,  మోడీ 2014లో త‌న ఎన్నిక‌ల అఫిడ‌విట్‌లో పేర్కొన్న విద్యార్హ‌త‌లు నిజం కాద‌ని ఆరోపించ‌డంతో…త‌ద‌నంత‌ర ప‌రిణామాల్లో ఈ వివరాలు […]

మోడీ... డిగ్రీలు చూపించారు...అయినా ఫేక‌న్నారు!
X

ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ చ‌దువుకి సంబంధించిన ధృవీక‌ర‌ణ ప‌ట్టాల‌ను బిజెపి పార్టీ వెల్ల‌డించింది. బిజెపి అధ్య‌క్షుడు అమిత్‌షా, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఇరువురు క‌లిసి సోమ‌వారం వీటిని విలేక‌రుల స‌మావేశంలో చూపించారు. మోడీ ఢిల్లీ విశ్వ‌విద్యాల‌యం నుండి బిఎ, గుజ‌రాత్ విశ్వ‌విద్యాల‌యం నుండి ఎంఎ పూర్తి చేశార‌ని వారు వివ‌రించారు. ఇటీవ‌ల ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్, మోడీ 2014లో త‌న ఎన్నిక‌ల అఫిడ‌విట్‌లో పేర్కొన్న విద్యార్హ‌త‌లు నిజం కాద‌ని ఆరోపించ‌డంతో…త‌ద‌నంత‌ర ప‌రిణామాల్లో ఈ వివరాలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. దేశ ప్ర‌ధాని విద్యార్హ‌త‌ల గురించి ఇలా రుజువులు చూపాల్సి రావ‌టం దుర‌దృష్ట‌క‌ర‌మ‌ని, కేజ్రీవాల్ క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని అమిత్ షా, అరుణ్ జైట్లీ డిమాండ్ చేశారు. వీరు వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం మోడీ 1978లో ఢిల్లీ యూనివ‌ర్శిటీనుండి బిఎ, 1983లో గుజ‌రాత్ యూనివ‌ర్శిటీ నుండి దూర‌విద్య ద్వారా పొలిటిక‌ల్ సైన్స్‌లో పిజి చేశారు. అయితే బిజెపి నేత‌లు వెల్ల‌డించిన డిగ్రీల‌ ప‌ట్టాలు అస‌లైన‌వి కాద‌ని, అవి న‌కిలీవ‌ని ఆప్ నాయ‌కుడు అశుతోష్ అన్నారు. వాటిలో పేర్లు మ్యాచ్ కావ‌టం లేద‌ని ఆయ‌న పేర్కొన్నారు

First Published:  9 May 2016 1:02 AM GMT
Next Story