Telugu Global
Others

రేవంత్ కాంగ్రెస్‌లోకి వెళ్ల‌డం లేదా?

టీడీపీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, ఓటుకు నోటు కేసులో ప్ర‌ధాన నిందితుడు రేవంత్ రెడ్డిపై ఓ ప్ర‌చారం న‌డుస్తోంది. ఆయ‌న కాంగ్రెస్‌లోకి వెళ‌తార‌న్న‌ది దాని సారాంశం. అలాంటిదేమీ లేద‌ని రేవంత్‌ నెత్తీనోరు బాదుకుంటున్నా.. ఈ ప్ర‌చారం మాత్రం ఆగ‌డం లేదు. ఇటు మీడియాలో.. అటు అసెంబ్లీ లాబీల్లో ఏ ఇద్దరు క‌లిసినా ఈ విష‌య‌మే మాట్లాడుతున్నారు. తాజాగా ఆర్డీఎస్ వ‌ద్ద కాంగ్రెస్ ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన ధ‌ర్నాకు రేవంత్ హాజ‌ర‌య్యారు. అక్క‌డ కూడా ఈ ప్ర‌చారంపై ఆయ‌న వివ‌ర‌ణ ఇచ్చుకోవాల్సి […]

రేవంత్ కాంగ్రెస్‌లోకి వెళ్ల‌డం లేదా?
X
టీడీపీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, ఓటుకు నోటు కేసులో ప్ర‌ధాన నిందితుడు రేవంత్ రెడ్డిపై ఓ ప్ర‌చారం న‌డుస్తోంది. ఆయ‌న కాంగ్రెస్‌లోకి వెళ‌తార‌న్న‌ది దాని సారాంశం. అలాంటిదేమీ లేద‌ని రేవంత్‌ నెత్తీనోరు బాదుకుంటున్నా.. ఈ ప్ర‌చారం మాత్రం ఆగ‌డం లేదు. ఇటు మీడియాలో.. అటు అసెంబ్లీ లాబీల్లో ఏ ఇద్దరు క‌లిసినా ఈ విష‌య‌మే మాట్లాడుతున్నారు. తాజాగా ఆర్డీఎస్ వ‌ద్ద కాంగ్రెస్ ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన ధ‌ర్నాకు రేవంత్ హాజ‌ర‌య్యారు. అక్క‌డ కూడా ఈ ప్ర‌చారంపై ఆయ‌న వివ‌ర‌ణ ఇచ్చుకోవాల్సి వ‌చ్చిందంటే ఆ ప్ర‌చార తీవ్ర‌త అర్థం చేసుకోవ‌చ్చు. ఈ వార్త‌ను ప‌దే ప‌దే రాస్తోందంటూ ఓ ప‌త్రిక‌పై ఆయ‌న మండిప‌డ్డారు కూడా. అయితే, తాను కాంగ్రెస్‌లోకి వెళ్ల‌డం లేదంటూ కాంగ్రెస్ నిర్వ‌హించిన ధ‌ర్నాలోనే రేవంత్ స్ప‌ష్టం చేశారు.
ఇంత‌కీ ఆ ప్ర‌చారం ఎప్పుడు మొద‌లైంది…
టీ-టీడీపీ టీఆర్ ఎస్‌లో విలీనం కాక‌ముందే ఈ ప్ర‌చారం మొద‌లైంది. దీంతో తెలంగాణ‌లో తెలుగుదేశం పార్టీ ప‌నై పోయింద‌ని, అందుకే ఆయ‌న రాజ‌కీయ భ‌విష్య‌త్తు గంద‌ర‌గోళంలో ప‌డింద‌ని, గ‌త్యంత‌ర లేక కాంగ్రెస్‌లో చేరుతున్నార‌న్న‌ది ఈ ప్ర‌చారం సారాంశం. దీనిపై ఇప్ప‌టికే చాలాసార్లు రేవంత్ వివ‌ర‌ణ ఇచ్చుకున్నారు. అయితే, తాజాగా ఆయ‌న ఆర్డీఎస్ వ‌ద్ద‌ కాంగ్రెస్ చేప‌ట్టిన‌ ధ‌ర్నాకు హాజ‌ర‌వ్వ‌డం, ఆ పార్టీకి మ‌ద్ద‌తుగా మాట్లాడటంతో ఈ ప్ర‌చారం మ‌రింత ఊపందుకుంది. ఆయ‌న త్వ‌ర‌లోనే పార్టీ మాతార‌ని, అందుకే ముంద‌స్తుగా ఆపార్టీ నేత‌ల‌తో స్నేహం పెంచుకుంటున్నార‌ని రేవంత్ ప్ర‌త్య‌ర్థులు విశ్లేషిస్తున్నారు. ధ‌ర్నాలో వేదిక‌పై రేవంత్ స‌మీప‌ బంధువు (కాంగ్రెస్ కీల‌క నేత‌) ఒక‌రు ఉండ‌టం వారి ప్ర‌చారానికి మ‌రింత ఊత‌మిస్తోంది.
First Published:  10 May 2016 1:36 AM GMT
Next Story