Telugu Global
Others

రేవంత్ స‌న్నాసి.. కాంగ్రెస్ నాయ‌కులు వెధ‌వ‌లా?

తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి ల‌క్ష్మారెడ్డికి కోపం వ‌చ్చింది. ఆర్డీ ఎస్ విష‌యంలో కాంగ్రెస్ చేప‌ట్టిన ధ‌ర్నానే ఆయ‌న కోపానికి కార‌ణం అంతే.. టీడీపీ, కాంగ్రెస్‌ల‌పై ఆయ‌న ఒంటికాలితో లేచారు. రేవంత్ ఓ స‌న్నాసి, కాంగ్రెస్ నాయ‌కులు వెధ‌వ‌లు అని మండిప‌డ్డారు. రాష్ర్టాన్ని ఐదు ద‌శాబ్దాల పాటు పాలించిన కాంగ్రెస్‌కు ఇన్నాళ్లూ పాల‌మూరు సంక్షేమం ఎందుకు ప‌ట్ట‌లేద‌ని ప్ర‌శ్నించారు. ఆర్డీఎస్ కోసం కాంగ్రెస్ నాయ‌కులు ఇప్పుడు పాద‌యాత్ర చేప‌ట్ట‌డమేంట‌ని నిల‌దీశారు. ఆర్డీఎస్ విష‌యంలో ఓ ద‌ద్ద‌మ్మ (రేవంత్‌రెడ్డి) […]

తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి ల‌క్ష్మారెడ్డికి కోపం వ‌చ్చింది. ఆర్డీ ఎస్ విష‌యంలో కాంగ్రెస్ చేప‌ట్టిన ధ‌ర్నానే ఆయ‌న కోపానికి కార‌ణం అంతే.. టీడీపీ, కాంగ్రెస్‌ల‌పై ఆయ‌న ఒంటికాలితో లేచారు. రేవంత్ ఓ స‌న్నాసి, కాంగ్రెస్ నాయ‌కులు వెధ‌వ‌లు అని మండిప‌డ్డారు. రాష్ర్టాన్ని ఐదు ద‌శాబ్దాల పాటు పాలించిన కాంగ్రెస్‌కు ఇన్నాళ్లూ పాల‌మూరు సంక్షేమం ఎందుకు ప‌ట్ట‌లేద‌ని ప్ర‌శ్నించారు. ఆర్డీఎస్ కోసం కాంగ్రెస్ నాయ‌కులు ఇప్పుడు పాద‌యాత్ర చేప‌ట్ట‌డమేంట‌ని నిల‌దీశారు. ఆర్డీఎస్ విష‌యంలో ఓ ద‌ద్ద‌మ్మ (రేవంత్‌రెడ్డి) మాట్లాడుతుంటే కాంగ్రెస్ నాయ‌కులంతా వెధ‌వ‌ల్లా వింటున్నార‌ని ఎద్దేవా చేశారు. ఆర్డీఎస్ విష‌యంలో కాంగ్రెస్ ధ‌ర్నా చేయ‌డం, దానికి టీడీపీ మ‌ద్దతుగా రావ‌డం ఏంట‌ని వాపోయారు. ప‌ర‌స్ప‌ర విరుద్ధ సిద్దాంతాలు ఉన్న రెండుపార్టీలు ప్రభుత్వంపై బుర‌ద‌జ‌ల్లే ప్ర‌య‌త్నంతోనే ఒక్క‌ట‌వుతున్నాయ‌ని విమ‌ర్శించారు. ఆర్డీఎస్‌కు నీటి విడుద‌ల విష‌య‌మై ఇప్ప‌టికే క‌ర్ణాట‌క మంత్రి పాటిల్‌తో తెలంగాణ మంత్రి హ‌రీశ్‌రావు చ‌ర్చ‌లు జ‌రిపార‌ని గుర్తు చేశారు. ఆయ‌న సానుకూలంగా స్పందించాక ఇప్పుడు ధ‌ర్నా చేయ‌డ‌మేంట‌ని ఎద్దేవా చేశారు. ముఖ్య‌మంత్రిపై వ్యాఖ్య‌లు చేసేముందు ఒక‌సారి ఆలోచించుకోవాల‌ని హిత‌వుప‌లికారు.
First Published:  10 May 2016 1:36 AM GMT
Next Story