Telugu Global
Others

టీఆర్ ఎస్ మైండ్ గేమ్‌లో కాంగ్రెస్ చిక్కుకుందా?

పాలేరు ఉప ఎన్నిక ప్ర‌చారం తుదిద‌శ‌కు చేరుకుంది. టీఆర్ ఎస్ – కాంగ్రెస్‌ల మ‌ధ్య మాట‌ల యుద్ధం ముదిరి పాకాన‌ప‌డింది. టీఆర్ ఎస్‌కు మాన‌వ‌త్వం లేని పార్టీగా అభివ‌ర్ణిస్తూ.. ఓడించాల‌ని ప్ర‌జ‌ల‌ను కోరుతోంది కాంగ్రెస్‌. తాము చేస్తోన్న అభివృద్ధి చూసి త‌మ‌నే గెలిపిస్తున్నార‌ని ధీమా వ్య‌క్తం చేస్తోంది. ఈ విషయంలో టీఆర్ ఎస్ క్ర‌మంగా మాన‌సికంగా పైచేయి సాధిస్తున్న‌ట్లే క‌నిపిస్తోంది. పాలేరులో గెల‌వ‌కుంటే..త‌న మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేస్తాన‌ని కేటీఆర్ విసిరిన స‌వాలుకు ఇంత‌వ‌ర‌కూ టీపీసీసీ నేత […]

పాలేరు ఉప ఎన్నిక ప్ర‌చారం తుదిద‌శ‌కు చేరుకుంది. టీఆర్ ఎస్ – కాంగ్రెస్‌ల మ‌ధ్య మాట‌ల యుద్ధం ముదిరి పాకాన‌ప‌డింది. టీఆర్ ఎస్‌కు మాన‌వ‌త్వం లేని పార్టీగా అభివ‌ర్ణిస్తూ.. ఓడించాల‌ని ప్ర‌జ‌ల‌ను కోరుతోంది కాంగ్రెస్‌. తాము చేస్తోన్న అభివృద్ధి చూసి త‌మ‌నే గెలిపిస్తున్నార‌ని ధీమా వ్య‌క్తం చేస్తోంది. ఈ విషయంలో టీఆర్ ఎస్ క్ర‌మంగా మాన‌సికంగా పైచేయి సాధిస్తున్న‌ట్లే క‌నిపిస్తోంది. పాలేరులో గెల‌వ‌కుంటే..త‌న మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేస్తాన‌ని కేటీఆర్ విసిరిన స‌వాలుకు ఇంత‌వ‌ర‌కూ టీపీసీసీ నేత ముందుకు రాలేదు. పైపెచ్చు కేటీఆర్ ఓ బ‌చ్చా అని సంభోదించారే గానీ, స‌వాలుకు ప్ర‌తిస‌వాలు విస‌ర‌లేదు. అంటే, కాంగ్రెస్‌కు విజ‌యంపై విశ్వాసం లేదా? అన్న సంశయాన్ని ప్ర‌జ‌ల్లో క‌లిగించ‌డంలో గులాబీ నేత‌లు క్ర‌మంగా పైచేయి సాధిస్తున్నార‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు. ఒక‌ర‌కంగా చెప్పాలంటే.. కాంగ్రెస్ నేత‌ల ఆత్మ‌స్థైర్యం దెబ్బ‌తీసేందుకే గులాబీ నేత‌లు ఇలా మైండ్ గేమ్ ఆడుతున్నార‌ని విశ్లేషిస్తున్నారు.
గ్రేట‌ర్‌లోనూ ఇదేపోక‌డ!
గ్రేట‌ర్‌లోనూ ఇలానే కేటీఆర్ స‌వాలుకు ప్ర‌తిస‌వాలు విసిరిన రేవంత్, నారాయ‌ణ ఆ త‌రువాత మీడియాకు ముఖం చాటేశారు. విశ్వ‌స‌నీయ స‌మాచారం మేర‌కే మంత్రి ఇలాంటి ప్ర‌క‌ట‌న‌లు, స‌వాళ్లు చేస్తున్నార‌ని వాటిని సీరియ‌స్‌గా తీసుకుంటే ప్ర‌తిష్ట‌కు న‌ష్టం వాటిల్లుతుంద‌ని కాంగ్రెస్ కిందిస్థాయి నాయ‌కులు అనుకుంటున్నారు. దీనికితోడు కాంగ్రెస్‌కు మ‌ద్ద‌తుగా నిలిచిన టీడీపీ ఓటర్ల‌ను త‌మ‌వైపుకు తిప్పుకునేందుకు గులాబీ నేత‌లు మ‌రో ప్లాన్ వేసిన‌ట్లు తెలుస్తోంది. ఖ‌మ్మం జిల్లా స‌త్తుప‌ల్లికి చెందిన తెలుగుదేశం నేత సండ్ర వెంక‌ట వీర‌య్య‌ను పార్టీలో చేర్చుకోవాల‌ని చూస్తోంద‌న్న ప్ర‌చారం జోరుగా సాగుతోంది. అంటే సండ్ర‌తోనే టీడీపీని తిట్టించి ఓ పార్టీ ఓట్ల‌ను ఆక‌ర్షించే ప్ర‌య‌త్నంలోనే ఆయ‌న్నుపార్టీలో చేర్చుకుంటోంద‌ని స‌మాచారం. తాజాగా కేటీఆర్ మ‌రో బాంబు పేల్చారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నిక‌ల‌కు ముందే మాన‌సికంగా ఓట‌మికి సిద్ధ‌మైంద‌ని అందుకే ప్ర‌చారంలో వారిలో గెలుపుపై ధీమా క‌నిపించ‌డం లేద‌ని మంత్రి ఎగ‌తాళి చేస్తున్నారు. మొత్తానికి టీఆర్ ఎస్ ఆడుతున్న మైండ్ గేమ్ ఎంత‌మేర‌కు ఫ‌లిస్తుందో చూడాలి.
First Published:  10 May 2016 11:06 PM GMT
Next Story