Telugu Global
NEWS

ఎర్ర‌చంద‌నం స్మ‌గ్లింగ్‌లో మోడ‌ల్, న‌టి అరెస్ట్

ఎర్ర‌చంద‌నం స్మ‌గ్లింగ్‌లోకి మోడ‌ల్స్ కూడా దిగారు. తాజాగా పోలీసుల ద‌ర్యాప్తులో సంగీత చ‌ట‌ర్జీ పేరు వెలుగులోకి వ‌చ్చింది. కోల్ క‌తాలో ఎయిర్‌హోస్ట్ గా ప‌నిచేసిన ఈమె అంత‌ర్జాతీయ స్మ‌గ్ల‌ర్ల‌తో సంబంధ‌నాలు న‌డిపింది. విలాస‌వంత‌మైన జీవిత‌మంటే ఇష్ట‌ప‌డే సంగీత … ఎర్ర‌చంద‌నం స్మ‌గ్ల‌ర్ ల‌క్ష్మ‌ణ్‌ను పెళ్లిచేసుకుంది. అత‌డు జైలుపాలు కావ‌డంతో ఈమె చ‌క్రం తిప్పింది. కోట్లాది రూపాయ‌ల విలువైన ఎర్ర‌చంద‌నం దేశాన్ని దాటించేసింది. లక్ష్మణ్ అయిదేళ్ల క్రితం సంగీతను రెండో పెళ్లి చేసుకున్నా డు. కోల్‌కతాలో ఎయిర్‌హోస్ట్‌గా పనిచేసేప్పుడు […]

ఎర్ర‌చంద‌నం స్మ‌గ్లింగ్‌లో మోడ‌ల్, న‌టి అరెస్ట్
X

13090277_1011977552220195_7018265_n ఎర్ర‌చంద‌నం స్మ‌గ్లింగ్‌లోకి మోడ‌ల్స్ కూడా దిగారు. తాజాగా పోలీసుల ద‌ర్యాప్తులో సంగీత చ‌ట‌ర్జీ పేరు వెలుగులోకి వ‌చ్చింది. కోల్ క‌తాలో ఎయిర్‌హోస్ట్ గా ప‌నిచేసిన ఈమె అంత‌ర్జాతీయ స్మ‌గ్ల‌ర్ల‌తో సంబంధ‌నాలు న‌డిపింది. విలాస‌వంత‌మైన జీవిత‌మంటే ఇష్ట‌ప‌డే సంగీత … ఎర్ర‌చంద‌నం స్మ‌గ్ల‌ర్ ల‌క్ష్మ‌ణ్‌ను పెళ్లిచేసుకుంది. అత‌డు జైలుపాలు కావ‌డంతో ఈమె చ‌క్రం తిప్పింది. కోట్లాది రూపాయ‌ల విలువైన ఎర్ర‌చంద‌నం దేశాన్ని దాటించేసింది.

13187716_1011977545553529_1197574652_nలక్ష్మణ్ అయిదేళ్ల క్రితం సంగీతను రెండో పెళ్లి చేసుకున్నా డు. కోల్‌కతాలో ఎయిర్‌హోస్ట్‌గా పనిచేసేప్పుడు పలువురు అంతర్జాతీయ స్మగ్లర్లతో ఈమెకు పరిచయాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆ తరువాత మోడల్‌గా రాణించి పలు యాడ్స్‌లో నటించింది. భ‌ర్త జైల్లో ఉన్న సమయంలో సౌత్ ఇండియాకు చెందిన స్మగ్లర్లకు భారీగా నగదు ముట్టచెప్పి ఎర్రచందనం దుంగల్ని విదేశాలకు తరలించినట్లు పోలీసులు గుర్తించారు. బర్మా నుంచి సంగీత హవాలా రూపంలో చెన్నైకు చెందిన ఎర్రచందనం స్మగ్లర్ మోజెస్ ద్వారా రూ.10 కోట్లకు పైగా చెల్లింపులు చేసినట్లు గుర్తించారు.

13219583_1011977585553525_692007512_nఈమెను పట్టుకోవడానికి చిత్తూరు మహిళా డీఎస్పీ గిరిధర్, పశ్చిమ సీఐ ఎం.ఆదినారాయణ తమ సిబ్బందితో కలిసి కోల్‌కతాకు వెళ్లిన బృందం శనివారం సంగీత చటర్జీని కోల్‌కతాలోని న్యూగరియాలో అరెస్టు చేశారు. ట్రాన్సిట్ వారెంట్‌పై చిత్తూరుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తుండ‌గానే ఒకరోజు తరువాత సంగీత బెయిల్‌పై విడుదలైంది. అయినా స‌రే ఆమెను మ‌రోసారి అరెస్ట్ చేసి ఏపీకి తీసుకొచ్చేందుకు పోలీసులు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఇక సంగీత అరెస్టు సమయంలో సీజ్ చేసిన ఆరు బ్యాంకు ఖాతాలు, ఓ లాకర్ తాళాలు చిత్తూరు పోలీసుల వద్ద ఉన్నాయి. వీటిని తీసి చూస్తే మరిన్ని విషయాలు వెలుగు చూసే అవకాశం ఉందంటున్నారు. విలాసాల‌కు అల‌వాటు ప‌డిన సంగీత … అందుకోస‌మే ఎర్ర‌చంద‌నం స్మ‌గ్ల‌ర్ల‌కు ద‌గ్గ‌రైంద‌ని చెబుతున్నారు. త‌న అందంతో ఎర్ర చందనం స్మ‌గ్ల‌ర్ల‌కు సులువ‌గానే ద‌గ్గ‌రైన‌ట్టు చెబుతున్నారు.

Click on Image to Read:

rami-reddy-pratap-kumar-red

heritage1

venumadhav1

renu-desai

uttarakand

snake-gang

amaravathi1

ttdp

vijayawada

There-are-no-widows-in-this

chalasani

First Published:  10 May 2016 10:25 PM GMT
Next Story