రేవంత్ కు ఈసీ నోటీసులు ఇస్తుందా?

టీడీపీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మ‌రోసారి వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. ఎన్నిక‌ల్లో ఓట‌ర్ల‌ను డ‌బ్బులు తీసుకోవాల‌ని చెప్పి వివాదానికి కార‌ణ‌మ‌య్యారు. విష‌య‌మేంటంటే.. పాలేరు ఉప ఎన్నిక ప్ర‌చారం సంద‌ర్భంగా త‌మ పార్టీ సిద్ధాంతాల‌ను ప‌క్క‌నబెట్టి కాంగ్రెస్ కు అనుకూలంగా ప్ర‌సంగించారు రేవంత్‌. ప‌నిలోప‌నిగా అధికార పార్టీని తిట్టిపోశారు. ఈ క్ర‌మంలోనే ఎన్నిక‌ల్లో టీఆర్ ఎస్ విప‌రీతంగా డ‌బ్బు ఖ‌ర్చు పెడుతోంద‌ని ఆరోపించారు. టీఆర్ ఎస్ ఎన్ని డ‌బ్బులు ఇచ్చినా తీసుకోవాల‌ని.. ఓటు మాత్రం కాంగ్రెస్ కే వేయాల‌ని పిలుపునిచ్చారు. ఇక్క‌డే రేవంత్ మాట తూలాడ‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు. డ‌బ్బులు తీసుకోమని ఓట‌ర్ల‌కు చెప్ప‌డం క‌చ్చితంగా ఎన్నిక‌ల నియ‌మావ‌ళికి వ్య‌తిరేక‌మే అవుతుంద‌ని చెబుతున్నారు. ఆయ‌న ఎన్నిక‌ల నియ‌మావ‌ళిని ఉల్లంఘించార‌ని వాదిస్తున్నారు. దీనిపై ఎన్నిక‌ల సంఘం ఫిర్యాదు చేయాల‌ని ఆయ‌న ప్ర‌త్య‌ర్థులు భావిస్తున్నారు. ఇందుకోసం న్యాయ‌నిపుణుల‌ను సంప్ర‌దిస్తున్న‌ట్లు తెలుస్తోంది. కేసీఆర్ కుటుంబంపై వ్య‌క్తిగ‌త ద్వేషంతో రేవంత్ ఇలాంటి వ్యాఖ్య‌లు చేస్తున్నాడ‌ని గులాబీ నేత‌లు ఆరోపిస్తున్నారు. ఇదే క్ర‌మంలో ఆయ‌న నోటిదురుసుత‌నంతో ఎన్నిక‌ల నియ‌మావళిని ఉల్లంఘించాడ‌ని చెబుతున్నారు. రేవంత్ వ్యాఖ్య‌లను గులాబీపార్టీ లైట్ తీసుకున్నా.. ఎన్నిక‌ల సంఘం (ఈసీ) దీనిపై దృష్టి సారించి, కేసు న‌మోదు చేస్తే.. రేవంత్ కు ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని విశ్లేష‌కులు అంచ‌నావేస్తున్నారు.