Telugu Global
WOMEN

మ‌ళ్లీ... ద‌ర్గా వ‌ద్ద‌కు తృప్తీ దేశాయి!

ఆల‌యాలు, ప్రార్థ‌నా స్థ‌లాల్లోకి మ‌హిళల ప్ర‌వేశాన్ని నిషేధించ‌డంపై నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్న భూమాతా బ్రిగేడ్ నేత తృప్తి దేశాయి మ‌రోసారి ముంబ‌యిలోని హ‌జీ అలీ ద‌ర్గాకు వెళ్లారు.  గురువారం ఉద‌యం కొంత‌మంది మ‌హిళ‌ల‌తో క‌లిసి తృప్తి దేశాయి ద‌ర్గా వ‌ద్ద‌కు వెళ్లారు. అయితే ఆమె మ‌హిళ‌ల‌కు నిషిద్ధ‌మైన ద‌ర్గా అంత‌ర్భాగంలోకి వెళ్లే ప్ర‌య‌త్నం చేయ‌లేదు. మ‌హిళ‌లకు ద‌ర్గాలోప‌లి భాగంలోకి ప్ర‌వేశం దొర‌కాల‌ని ప్రార్థించాన‌ని ఆమె త‌రువాత వెల్ల‌డించారు. పోలీసులు ద‌ర్గాకు గ‌ట్టి  బందోబ‌స్తు ఏర్పాటు చేయ‌టంతో పాటు […]

ఆల‌యాలు, ప్రార్థ‌నా స్థ‌లాల్లోకి మ‌హిళల ప్ర‌వేశాన్ని నిషేధించ‌డంపై నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్న భూమాతా బ్రిగేడ్ నేత తృప్తి దేశాయి మ‌రోసారి ముంబ‌యిలోని హ‌జీ అలీ ద‌ర్గాకు వెళ్లారు. గురువారం ఉద‌యం కొంత‌మంది మ‌హిళ‌ల‌తో క‌లిసి తృప్తి దేశాయి ద‌ర్గా వ‌ద్ద‌కు వెళ్లారు. అయితే ఆమె మ‌హిళ‌ల‌కు నిషిద్ధ‌మైన ద‌ర్గా అంత‌ర్భాగంలోకి వెళ్లే ప్ర‌య‌త్నం చేయ‌లేదు. మ‌హిళ‌లకు ద‌ర్గాలోప‌లి భాగంలోకి ప్ర‌వేశం దొర‌కాల‌ని ప్రార్థించాన‌ని ఆమె త‌రువాత వెల్ల‌డించారు. పోలీసులు ద‌ర్గాకు గ‌ట్టి బందోబ‌స్తు ఏర్పాటు చేయ‌టంతో పాటు తృప్తి దేశాయి వెంటే ఉన్నారు. గ‌త‌నెల 28న తృప్తి దేశాయి ఇదే ద‌ర్గాలోకి వెళ్లే ప్ర‌య‌త్నం చేయ‌గా జ‌నం ఆమెను అడ్డుకున్నారు. జ‌న‌మంతా త‌న కారుపైకి దూసుకువ‌చ్చినా పోలీసులు మౌనంగా చోద్యం చూశార‌ని త‌ప్తీ దేశాయి ఆ సంద‌ర్భంలో ఆరోపించారు. శివ‌సేన‌కు చెందిన ముస్లిం నేత అరాఫాత్‌ షేఖ్‌, తృప్తి దేశాయి దర్గాలో అడుగు పెడితే చెప్పుతో కొడతానంటూ విపరీత వ్యాఖ్యలు చేయ‌టం, మ‌రో ముస్లిం పార్టీ నేత ఆమె మొహాన్ని ఇంకుతో న‌ల్ల‌గా చేస్తాన‌ని బెదిరించ‌డం…తెలిసిందే. ముస్లింల ఆన‌వాయితీ ప్రకారం మహిళలు దర్గాలు, స్మశానాల్లోకి ప్రవేశించడం నిషిద్ధం.

First Published:  12 May 2016 7:19 AM GMT
Next Story