Telugu Global
National

ఇక ఢిల్లీకి ఆ తోక‌ని తీసేయ‌వ‌చ్చు!

ఈ మ‌ధ్య‌కాలంలో ఢిల్లీ అక్క‌డి రాజ‌కీయాలు, మ‌హిళ‌ల‌పై హింస‌తో కాకుండా వాతావ‌ర‌ణ కాలుష్యంతో బాగా పాపుల‌ర్ అయ్యింది. కాలుష్యాన్ని అరిక‌ట్ట‌డానికి కేజ్రీవాల్ ప్ర‌భుత్వం తీసుకుంటున్న చ‌ర్య‌ల‌తో కూడా చాలాసార్లు వార్త‌ల్లోకి ఎక్కింది. 2014లో ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ గ‌ణాంకాల‌ను బ‌ట్టి  ఢిల్లీ అత్యంత కాలుష్య‌భ‌రిత‌మైన న‌గ‌రాల్లో మొదటి స్థానంలో ఉంద‌న్న సంగ‌తి తెలిసిందే.  అయితే ఇప్పుడు ఈ పరిస్థితి మారుతున్న‌ట్టే ఉంది. ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ  తాజా లెక్క‌ల ప్ర‌కారం ఢిల్లీ ఇప్పుడు 103 దేశాల్లో అత్యంత […]

ఇక ఢిల్లీకి ఆ తోక‌ని తీసేయ‌వ‌చ్చు!
X

ఈ మ‌ధ్య‌కాలంలో ఢిల్లీ అక్క‌డి రాజ‌కీయాలు, మ‌హిళ‌ల‌పై హింస‌తో కాకుండా వాతావ‌ర‌ణ కాలుష్యంతో బాగా పాపుల‌ర్ అయ్యింది. కాలుష్యాన్ని అరిక‌ట్ట‌డానికి కేజ్రీవాల్ ప్ర‌భుత్వం తీసుకుంటున్న చ‌ర్య‌ల‌తో కూడా చాలాసార్లు వార్త‌ల్లోకి ఎక్కింది. 2014లో ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ గ‌ణాంకాల‌ను బ‌ట్టి ఢిల్లీ అత్యంత కాలుష్య‌భ‌రిత‌మైన న‌గ‌రాల్లో మొదటి స్థానంలో ఉంద‌న్న సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ పరిస్థితి మారుతున్న‌ట్టే ఉంది.

ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ తాజా లెక్క‌ల ప్ర‌కారం ఢిల్లీ ఇప్పుడు 103 దేశాల్లో అత్యంత కాలుష్య‌భ‌రిత‌మైన 3వేల న‌గ‌రాల్లో 11వ స్థానంలో ఉంది. ఇంత‌కుముందు 1600 న‌గ‌రాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోగా ఈసారి అద‌నంగా 1400 న‌గ‌రాల‌ను ఎంపిక చేసుకున్నారు.

ఈ సారి కాలుష్య గ‌ణాంకాలనుబ‌ట్టి ఇరాన్ న‌గ‌రం జ‌బోల్ ప్ర‌థ‌మస్థానంలో ఉంది. భార‌త్‌లోని గ్వాలియ‌ర్‌, అల్హాబాద్ రెండు మూడు స్థానాల్లో పాట్నా, రాయ్‌పూర్ ఆరు, ఏడు స్థానాల్లోనూ ఉన్నాయి. ఆ విధంగా ప్ర‌పంచ వ్యాప్తంగా కాలుష్య‌భ‌రిత న‌గ‌రాల్లో మొద‌టి ప‌దింటిలో నాలుగు భార‌త్‌లోనే ఉన్నాయి. అలాగే మొద‌టి 20 న‌గ‌రాల్లో 10 మ‌న‌దేశంలోనే ఉన్నాయి. 2014 ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ నివేదిక‌లో ఈ సంఖ్య 13గా ఉంది. దీన్ని బ‌ట్టి మ‌న దేశంలో కాలుష్యం కాస్త త‌గ్గిన‌ట్టుగానే భావించాలి.

చైనా న‌గ‌రాలు జింటాయి, బ‌వోడింగ్ తొమ్మిది ప‌ది ర్యాంకుల్లో ఉండ‌గా, బీజింగ్ 56 వ స్థానంలో ఉంది. ఢిల్లీలో కాలుష్యం బాగా అదుపులోకి వ‌చ్చింద‌ని కొంతమంది వాతావ‌ర‌ణ నిపుణులు భావిస్తుండ‌గా, వాతావ‌ర‌ణాన్ని ధూళిక‌ణాల ప‌రిమాణాన్ని బ‌ట్టి అంచ‌నావేశార‌ని, అలా కాకుండా గాలిలో నైట్రోజ‌న్ ఆక్సైడ్స్‌ని బ‌ట్టి ఆంచ‌నావేయాల‌ని అప్పుడే గాలి లోని స్వ‌చ్ఛ‌త తెలుస్తుంద‌ని కొంత‌మంది అంటున్నారు.

First Published:  12 May 2016 4:02 AM GMT
Next Story