Telugu Global
CRIME

జాకీచాన్ హైద‌రాబాద్‌లో దొరికాడు!

నాలుగేళ్లుగా చిక్క‌కుండా త‌ప్పించుకుని తిరుగుతున్న మేక‌ల‌ వెంక‌టేష్ ఉర‌ఫ్ జాకీచాన్ అనే దొంగ‌ని హైద‌రాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. అత‌ని వ‌ద్ద నుండి 500 గ్రాముల బంగారాన్నిస్వాధీనం చేసుకున్నారు. జిమ్నాస్టిక్స్ వంటి నైపుణ్యాలు ఉన్న వెంక‌టేష్ పోలీసుల‌కు చిక్కిన‌ట్టే చిక్కి రెండుసార్లు త‌ప్పించుకుని పారిపోయాడు. క‌ర్నూలుకి చెందిన వెంక‌టేష్ 2005లో, త‌న ప‌దిహేన‌వ ఏట‌నే దొంగ‌త‌నాలు ప్రారంబించాడు. క‌ర్నూలు పోలీసులు ఇత‌నిపై 18 దొంగ‌త‌నాల కేసులు న‌మోదు చేశారు. ఇత‌నితో పాటు ఇత‌ని బంధువులు ఒక గ్యాంగ్‌గా […]

జాకీచాన్ హైద‌రాబాద్‌లో దొరికాడు!
X

నాలుగేళ్లుగా చిక్క‌కుండా త‌ప్పించుకుని తిరుగుతున్న మేక‌ల‌ వెంక‌టేష్ ఉర‌ఫ్ జాకీచాన్ అనే దొంగ‌ని హైద‌రాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. అత‌ని వ‌ద్ద నుండి 500 గ్రాముల బంగారాన్నిస్వాధీనం చేసుకున్నారు. జిమ్నాస్టిక్స్ వంటి నైపుణ్యాలు ఉన్న వెంక‌టేష్ పోలీసుల‌కు చిక్కిన‌ట్టే చిక్కి రెండుసార్లు త‌ప్పించుకుని పారిపోయాడు. క‌ర్నూలుకి చెందిన వెంక‌టేష్ 2005లో, త‌న ప‌దిహేన‌వ ఏట‌నే దొంగ‌త‌నాలు ప్రారంబించాడు. క‌ర్నూలు పోలీసులు ఇత‌నిపై 18 దొంగ‌త‌నాల కేసులు న‌మోదు చేశారు. ఇత‌నితో పాటు ఇత‌ని బంధువులు ఒక గ్యాంగ్‌గా ఏర్ప‌డి క‌ర్నూలులో ప‌లు దొంగ‌త‌నాలు చేశారు. 2007 ఒక‌సారి 2012లో మ‌రొక‌సారి క‌దులుతున్న వాహ‌నాల నుండి దూకి త‌ప్పించుకున్నాడు. త‌ప్పించుకునేందుకు ఇత‌ను చేసిన విన్యాసాల కార‌ణంగానే వెంక‌టేష్‌కి జాకీచాన్ అనే పేరు వ‌చ్చింది. ఇక్క‌డ త‌ప్పించుకున్నాక బెంగ‌లూరు పారిపోయాడు. అక్క‌డ మ‌రో ఎనిమిది మందితో క‌లిసి మ‌రోసారి గ్యాంగ్‌ని ఏర్పాటు చేసి క‌ర్ణాట‌క‌, త‌మిళ‌నాడు, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ల్లో దొంగ‌త‌నాలు చేయ‌టం మొద‌లుపెట్టాడు. రాళ్ల‌తో త‌లుపులు బ‌ద్ద‌లు కొట్టి, ఇంట్లోని వారిని తాళ్ల‌తో బంధించి వీరు దొంగ‌త‌నాలు చేస్తుంటార‌ని పోలీసులు వెల్ల‌డించారు.

First Published:  12 May 2016 2:26 AM GMT
Next Story