కోతి.. స‌న్నాసి.. చెప్పు, తోక.. మ‌ళ్లీ నోరు పారేసుకున్న రేవంత్!

తిట్టే నోరు..తిరిగే కాలు ఊరికే ఉండ‌వంటారు పెద్ద‌లు.. బ‌హుశా రేవంత్ రెడ్డి లాంటి వాళ్లను చూసి ఇలాంటి సామెత‌లు పుట్టాయేమో! పాలేరు ఎన్నిక‌ల‌ ప్ర‌చారంలో పాల్గొన్న రేవంత్ మ‌రోసారి త‌న నోటికి ప‌ని చెప్పాడు. కోతి.. స‌న్నాసి.. చెప్పు, తోక‌ లాంటిప‌దాలు సీఎం, మంత్రుల‌పై ప్ర‌యోగించి మ‌రోసారి త‌న నాలిక దుర‌ద తీర్చుకున్నారు.  రాజ‌కీయాల్లో వ్య‌క్తిగ‌త దూష‌ణ‌ల‌కు తెర‌లేపి దిగ‌జారుడు రాజ‌కీయాల‌కు తెర‌లేపిన వ్య‌క్తిగా రేవంత్ నిత్యం వార్త‌ల్లో నిలుస్తూనే ఉన్నాడు. రేవంత్ వ్యాఖ్య‌ల్లో ప్ర‌భుత్వ విధానాను వ్య‌తిరేకించ‌డం కంటే వ్య‌క్తిగ‌త దూష‌ణ‌లు, క‌క్ష‌ల‌కే ఎక్కువ ప్రాధాన్య‌మిస్తున్న‌ట్లు క‌నిపిస్తోంది. సీఎం కేసీఆర్ కు ఎవ‌రు ఏ ప‌ని మొద‌లు పెట్టినా అక్క‌డ క్ష‌ణాల్లో తానున్నానంటూ ప్ర‌త్యక్ష‌మ‌వుతున్నారు రేవంత్ రెడ్డి. సిద్ధాంత‌ప‌రంగా శాశ్వ‌త శ‌త్రువుగా భావించే కాంగ్రెస్ ప‌క్షాన టీడీపీ నేత‌గా నిల‌వ‌డం ఇందుకు నిద‌ర్శ‌నం. 
స‌హ‌జంగానే దుందుడుకు, దూకుడు స్వ‌భావం క‌లిగిన రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో పోలీసుల‌కు రెడ్ హ్యాండెడ్‌గా ప‌ట్టుబ‌డిన‌ప్ప‌టి నుంచి ఈ పోక‌డ మ‌రింత పెరిగిపోయింది. రాజ‌కీయాలు వ‌దిలేసి, అర్థంలేని ఆరోప‌ణ‌లు, ఇష్టానుసారంగా తిట్ల దండ‌కం అందుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్ర‌జాప్ర‌తినిధిగా ఇలాంటి దిగజారుడు దూష‌ణ‌లపై గులాబీ దండునేత‌లే కాదు, విద్యావంతులు, మేథావులు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.
అస‌లు ఏమ‌న్నాడు?
టీడీపీ, కాంగ్రెస్‌ల‌పై  కేటీఆర్ చేస్తోన్న విమ‌ర్శ‌ల‌పై రేవంత్ ఒంటికాలిపై లేచాడు. కేటీఆర్ క‌ల్లు తాగిన కోతిలా మాట్టాడుతున్నాడ‌ని, సీఎం కేసీఆర్ ఓ స‌న్నాసి అని తిట్టిపోశారు. మ‌రో అడుగు ముందుకేసి మీ అయ్య 2004లో కాంగ్రెస్ కు తోక‌పార్టీ అయిండు, 2009లో మాపార్టీ కాలికి చెప్పుగా మారిండు అంటూ అభ్యంత‌ర‌క‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తల్లిలాంటి పార్టీని కాంట్రాక్టుల కోసం అమ్ముకుని.. ద్రోహం చేశారని వ్యాఖ్యానించారు. కన్న తల్లి, అక్కలాంటి సుచరితను ఎర్రటి ఎండలో నిలబెట్టిన దుర్మార్గుడు కేసీఆర్ అని అన్నారు. ఈ ఎన్నికలో నయవంచకులు తుమ్మల, కేసీఆర్‌కు తగిన గుణపాఠం చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ ద్రోహులైన సన్నాసులు తుమ్మల, తలసాని… మరో సన్నాసి కేసీఆర్‌తో జత కట్టారని అన్నారు. టీఆర్‌ఎస్ ఏమిచ్చినా తీసుకొని ఓటు మాత్రం కాంగ్రెస్ కే వేయాలని ఆయన సూచించారు.

Click on Image to Read:

revanth-reddy

swamy

pratyusha-madileti-kcr

rami-reddy-pratap-kumar-red

pratap-reddy

hero-uday

CNN

ttdp

sangeeta-chatterjee

heritage1