కాంగ్రెస్ దోస్తీతో టీడీపీ అంత‌ర్మ‌థ‌నం!

కాంగ్రెస్‌ను ధీటుగా ఎదుర్కోవాల‌న్న‌ ల‌క్ష్యంతో ఎన్టీఆర్ టీడీపీని స్థాపించాడు. సీఎం గా ఉన్న ఆయ‌న్ను త‌ప్పించి గ‌ద్దెనెక్కిన చంద్ర‌బాబు ఆ త‌రువాత కాలంలో పార్టీ అధినేత‌గా కొన‌సాగుతూ వ‌స్తున్నాడు. ఎన్టీఆర్ మ‌ర‌ణానంత‌రం ఆయ‌న సిద్ధాంతాలు, ల‌క్ష్యాలు సాధిస్తామ‌ని ప్ర‌తిమబూనిన చంద్ర‌బాబు… అందుకు విరుద్ధంగా వ్య‌హ‌రించ‌డం కార్య‌క‌ర్త‌లకు మింగుడుప‌డ‌టం లేదు. ముఖ్యంగా తెలంగాణ‌లో టీడీపీ కార్య‌క‌ర్త‌లు త‌మ పార్టీ కాంగ్రెస్‌కు సాగిల‌ప‌డుతోంద‌ని ప‌లువురి వ‌ద్ద ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఉమ్మ‌డి రాష్ట్రంలో ప‌రోక్షంగా కిర‌ణ్ కుమార్ స‌ర్కారును కూలకుండా ఆపార‌న్న విమ‌ర్శ‌లు వ‌చ్చినా పార్టీ ప్ర‌యోజ‌నాల కోస‌మ‌ని అంతా స‌రిపెట్టుకున్నారు. తెలంగాణ ఏర్ప‌డ్డాక ఓటుకునోటు కేసుతో జీవిత‌కాలంపాటు చెరిపినా  చెర‌గ‌ని ముద్ర వేసుకుని పార్టీ ప్ర‌తిష్ట‌ను దిగ‌జార్చార‌ని కార్య‌క‌ర్త‌లు చంద్ర‌బాబుపై కినుక వ‌హిస్తున్నారు. ఈ కార‌ణంతో ఇప్ప‌టికే చాలామంది పార్టీని వీడిన మాట వాస్త‌వ‌మే! ఎంత టీఆర్ ఎస్‌పై కోపం ఉంటే మాత్రం.. సొంతంగా ఉద్య‌మించే స‌త్తా ఉన్న టీడీపీ శాశ్వ‌త విరోధి అయిన కాంగ్రెస్ ను ద‌గ్గ‌రుండి గెలిపించేందుకు ప్ర‌య‌త్నించ‌డం పార్టీ సిద్ధాంతాల‌కు ముమ్మాటికీ వ్య‌తిరేక‌మేన‌ని సీనియ‌ర్ టీడీపీ నేత‌లే వ్యాఖ్యానిస్తున్నారు.
రేవంత్‌పై టీడీపీ నేత‌ల ఆగ్ర‌హం!
పాలేరు ఉప ఎన్నిక‌లో కాంగ్రెస్‌కు రేవంత్ ప్ర‌చారం చేయ‌డం చాలామంది తెలంగాణ తెలుగుదేశం నేత‌ల‌కు రుచించ‌డం లేదు. ఇటీవ‌ల ఆర్డీ ఎస్ ధ‌ర్నాకు హాజ‌రై కాంగ్రెస్‌కు సంఘీభావం ప్ర‌క‌టించ‌డం, తాజాగా పాలేరులో ప్ర‌చారం చేయ‌డంతో.. ప్ర‌జ‌ల్లో టీడీపీ విధానంపై ప‌లు సందేహాలు లేవ‌నెత్తుతున్నాయ‌ని స్థానిక టీడీపీ కార్య‌క‌ర్త‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. తాను చెడ్డ కోతి వ‌నమంతా చెరిచింద‌ని.. ఓటుకు నోటు కేసులో ఇరుక్కున్న రేవంత్ కాంగ్రెస్‌తో అంట‌కాగుతున్న‌ తీరు పార్టీకి మ‌రింత చేటు తెస్తోంద‌ని మండిప‌డుతున్నారు. కాంగ్రెస్ అభ్య‌ర్థికి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించి ఉంటే స‌రిపోయేది. అంతేకానీ, ఇలా క్షేత్ర‌స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి మ‌ద్ద‌తు ప‌ల‌క‌డం పార్టీకి ప్ర‌జ‌ల్లో ఉన్న అంతంత ఆద‌ర‌ణ కూడా పోయే ప్ర‌మాద‌ముంద‌ని వ్యాఖ్యానిస్తున్నారు. టీడీపీ జాతీయాధ్య క్షుడు చంద్ర‌బాబుపై కూడా ఓటుకు నోటు కేసులో ఆరోప‌ణ‌లు రావ‌డం, ఆ కేసులో రేవంత్ ప‌లుమార్లు చంద్ర‌బాబు పేరు ప్ర‌స్తావించ‌డంతో ఈ విష‌యం ఎవ‌రికి చెప్పుకోవాలో తెలియ‌క త‌మ‌లో తామే మ‌ద‌న‌ప‌డుతున్నారు. పాపం! తెలుగు త‌మ్ముళ్ల ప‌రిస్థితి తెలంగాణ‌లో ఇబ్బందిక‌రంగానే ఉంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు కూడా చెబుతున్నారు. 

Click on Image to Read:

sona-chowdary

rami-reddy-pratap-kumar-red

CM-Ramesh

revanth-reddy

rajya-sabha-election-notifi

pratap-reddy

chandrababu-naidu

pratyusha-madileti-kcr

CNN

Rosaiah,-EVKS-Elangovan

swamy

heritage1