Telugu Global
Cinema & Entertainment

వారసులొస్తే పండగ చేసుకుంటున్న స్టార్లు

కొడుకంటే ఎవరికైనా ప్రేమే. అదే కొడుకు తన ప్రొఫెషన్ ను ఇష్టపడితే మరింత ఆనందం. ఈమధ్య కాలంలో మన స్టార్లు అంతా తమకు తెలియకుండానో లేక తెలిసో తమ వారసుల్ని పబ్లిక్ కు పరిచయం చేస్తున్నారు. ఒక్కో స్టేజ్ లో ఒక్కో మేటర్ రివీల్ చేస్తూ… తమ అభిమానులతో ఆనందం పంచుకుంటున్నారు. ఈమధ్యకాలంలో మహేష్, ఎన్టీఆర్, బాలయ్య… ఇలా వీళ్లంతా పుత్రోత్సాహాన్ని చాటుకున్నారు. బ్రహ్మోత్సవం ఆడియో ఫంక్షన్ తనకు చాలా ప్రత్యేకమైనదని చెప్పుకున్నాడు మహేష్. దానికి కారణం… […]

వారసులొస్తే పండగ చేసుకుంటున్న స్టార్లు
X
కొడుకంటే ఎవరికైనా ప్రేమే. అదే కొడుకు తన ప్రొఫెషన్ ను ఇష్టపడితే మరింత ఆనందం. ఈమధ్య కాలంలో మన స్టార్లు అంతా తమకు తెలియకుండానో లేక తెలిసో తమ వారసుల్ని పబ్లిక్ కు పరిచయం చేస్తున్నారు. ఒక్కో స్టేజ్ లో ఒక్కో మేటర్ రివీల్ చేస్తూ… తమ అభిమానులతో ఆనందం పంచుకుంటున్నారు. ఈమధ్యకాలంలో మహేష్, ఎన్టీఆర్, బాలయ్య… ఇలా వీళ్లంతా పుత్రోత్సాహాన్ని చాటుకున్నారు. బ్రహ్మోత్సవం ఆడియో ఫంక్షన్ తనకు చాలా ప్రత్యేకమైనదని చెప్పుకున్నాడు మహేష్. దానికి కారణం… తన కూతురు సితార తొలిసారిగా ఓ పబ్లిక్ ఫంక్షన్ కు వచ్చింది. అది కూడా బ్రహ్మోత్సవం ఆడియో వేడుకకు వచ్చింది. కాబట్టి ఆ సినిమా తనకు చాలా ప్రత్యేకమన్నాడు.
ఇక ఎన్టీఆర్ కూడా ఇదే రాగం అందుకున్నాడు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు తారక్. ఈ సినిమా సెట్స్ లోకి కొడుకు అభయ్ వచ్చాడు. తారక్ భార్య అభయ్ ను ప్రత్యేకంగా సెట్స్ కు తీసుకొచ్చింది. దీంతో ఎన్టీఆర్ సంబరపడిపోయాడు. జనతా గ్యారేజీ స్టార్టయిన తర్వాత తొలిసారిగా అభయ్ సెట్స్ పైకి వచ్చాడంటూ ట్వీట్ చేశాడు. ఫొటోలు కూడా షేర్ చేశాడు.
ప్రస్తుతం ఇదే ఆనందాన్ని బాలకృష్ణ కూడా ఎంజాయ్ చేస్తున్నారు. కుమారుడు మోక్షజ్ఞ… సినిమా రంగంలోకి ప్రవేశించడమే నటసింహం ఆనందానికి కారణం. అవును… బాలయ్య వందో సినిమా గౌతమీపుత్ర శాతకర్ణితో మోక్షజ్ఞ ఇండస్ట్రీలోకి ఎంటరయ్యాడు. ఈ సినిమాకు అసిస్టెంట్ డైరక్టర్ గా పనిచేస్తున్నాడు. క్రిష్ వద్ద దర్శకత్వంలో మెళకువలు నేర్చుకుంటున్నాడు. సినిమాకు సంబంధించిన అన్ని విభాగాలపై పట్టు సంపాదించే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ సినిమా కంప్లీట్ అవ్వగానే ముఖానికి రంగేసుకోవడానికి కూడా రెడీ అయిపోతున్నాడు. ఇలా స్టార్లు అంతా తమ వారసుల్ని చూసి పొంగిపోయే ఘటనలు వరుసగా జరుగుతున్నాయి.

Click on Image to Read:

sona-chowdary

rami-reddy-pratap-kumar-red

CM-Ramesh

revanth-reddy

rajya-sabha-election-notifi

pratap-reddy

chandrababu-naidu

pratyusha-madileti-kcr

CNN

Rosaiah,-EVKS-Elangovan

swamy

heritage1

First Published:  12 May 2016 12:17 AM GMT
Next Story