Telugu Global
CRIME

జెయింట్ వీల్‌...కూలింది!

థీమ్ పార్కులో ఏర్పాటు చేసిన  జెయింట్ వీల్ కూలిపోయి, ఒక‌రు మ‌ర‌ణించిన కేసులో పోలీసులు ఆ పార్క్ య‌జ‌మానిని , హెచ్ఆర్ మేనేజ‌ర్‌ని గురువారం అరెస్టుచేశారు. త‌మిళ‌నాడు, తంబ‌రం స‌మీపంలో ఉన్న కిష్కింత థీమ్ పార్కులో డిస్కోరైడ‌ర్ పేరుతో ఒక కొత్త జెయింట్ వీల్‌ని ఏర్పాటు చేశారు. దీని ప‌నితీరుని ప‌రిశీలించ‌డానికి నిర్వ‌హించిన ట్ర‌య‌ల్ ర‌న్‌లో అదే పార్కులో ప‌నిచేస్తున్న ఎస్ మ‌ణి మ‌ర‌ణించాడు. తొమ్మిదిమంది గాయ‌ప‌డ్డారు. పార్కు య‌జ‌మాని కేర‌ళ‌లోని ప్ర‌ముఖ సినీ నిర్మాత చాకో […]

థీమ్ పార్కులో ఏర్పాటు చేసిన జెయింట్ వీల్ కూలిపోయి, ఒక‌రు మ‌ర‌ణించిన కేసులో పోలీసులు ఆ పార్క్ య‌జ‌మానిని , హెచ్ఆర్ మేనేజ‌ర్‌ని గురువారం అరెస్టుచేశారు. త‌మిళ‌నాడు, తంబ‌రం స‌మీపంలో ఉన్న కిష్కింత థీమ్ పార్కులో డిస్కోరైడ‌ర్ పేరుతో ఒక కొత్త జెయింట్ వీల్‌ని ఏర్పాటు చేశారు. దీని ప‌నితీరుని ప‌రిశీలించ‌డానికి నిర్వ‌హించిన ట్ర‌య‌ల్ ర‌న్‌లో అదే పార్కులో ప‌నిచేస్తున్న ఎస్ మ‌ణి మ‌ర‌ణించాడు. తొమ్మిదిమంది గాయ‌ప‌డ్డారు. పార్కు య‌జ‌మాని కేర‌ళ‌లోని ప్ర‌ముఖ సినీ నిర్మాత చాకో పున్నూస్ కుమారుడు జోస్ పున్నూస్‌. పోలీసులు జోస్‌తో పాటు హెర్ ఆర్ మేనేజ‌ర్‌ని సైతం అరెస్టు చేశారు. గాయ‌ప‌డిన వారిని మిలీలోని ప్ర‌యివేటు ఆసుప‌త్రిలో చేర్చ‌గా, మ‌ర‌ణించిన మ‌ణి బంధువులు, మ‌ణి శ‌వం ఆసుప‌త్రిలో లేద‌ని చెబుతున్నా విన‌కుండా ఆసుప‌త్రి అద్దాలు ప‌గుల‌గొట్టారు. పోలీసులు మ‌ణి బాడీని క్రోమ్ పేట ప్ర‌భుత్వ ఆసుప‌త్రికి త‌ర‌లించి అనంత‌రం అత‌ని బంధువుల‌కు అప్ప‌గించారు. థీమ్ పార్కు ప్ర‌తినిధితో చ‌ర్చ‌లు జ‌రిపిన అనంత‌రం న‌ష్ట ప‌రిహారం విష‌యంలో ఒప్పందానికి వ‌చ్చాక మ‌ణి కుటుంబ స‌భ్యులు అత‌ని శ‌వాన్ని ఇంటికి తీసుకువెళ్లిన‌ట్టుగా తెలుస్తోంది.

First Published:  13 May 2016 1:43 AM GMT
Next Story