Telugu Global
Others

హ‌నుమంత‌న్న, సుధారాణికి మొండిచెయ్యే!

రాజ్య‌స‌భ‌కు ఎన్నిక‌ల న‌గారా మోగ‌గానే తెలంగాణ‌లో అప్పుడే రాజ‌కీయ వేడి రాజుకుంది. ఈసారి రాజ్య‌స‌భ అవ‌కాశం ఎవ‌రిని వ‌రిస్తుంద‌న్న విష‌యంపై అప్పుడే జోరుగా లెక్క‌లు, స‌మీక‌ర‌ణాలు మొద‌ల‌య్యాయి. ఇక్క‌డ ఉన్న అసెంబ్లీ సీట్ల సంఖ్య ప‌రంగా చూస్తే.. తెలంగాణ నుంచి కేవ‌లం ఇద్ద‌రు మాత్ర‌మే రాజ్య‌స‌భ‌కు వెళ్ల‌గ‌ల‌రు. ఇప్ప‌టికే రాష్ట్రం నుంచి రాజ్య‌స‌భ‌కు ప్రాతినిధ్యం వ‌హిస్తోన్న ఎంపీ హ‌నుమంత‌రావు (కాంగ్రెస్‌), గుండు సుధారాణి (టీడీపీ)లకు ఈసారి అవ‌కాశం లేన‌ట్లే క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే బీసీ కోటాలో రెండుసార్లు రాజ్య‌స‌భ‌కు […]

రాజ్య‌స‌భ‌కు ఎన్నిక‌ల న‌గారా మోగ‌గానే తెలంగాణ‌లో అప్పుడే రాజ‌కీయ వేడి రాజుకుంది. ఈసారి రాజ్య‌స‌భ అవ‌కాశం ఎవ‌రిని వ‌రిస్తుంద‌న్న విష‌యంపై అప్పుడే జోరుగా లెక్క‌లు, స‌మీక‌ర‌ణాలు మొద‌ల‌య్యాయి. ఇక్క‌డ ఉన్న అసెంబ్లీ సీట్ల సంఖ్య ప‌రంగా చూస్తే.. తెలంగాణ నుంచి కేవ‌లం ఇద్ద‌రు మాత్ర‌మే రాజ్య‌స‌భ‌కు వెళ్ల‌గ‌ల‌రు. ఇప్ప‌టికే రాష్ట్రం నుంచి రాజ్య‌స‌భ‌కు ప్రాతినిధ్యం వ‌హిస్తోన్న ఎంపీ హ‌నుమంత‌రావు (కాంగ్రెస్‌), గుండు సుధారాణి (టీడీపీ)లకు ఈసారి అవ‌కాశం లేన‌ట్లే క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే బీసీ కోటాలో రెండుసార్లు రాజ్య‌స‌భ‌కు నామినేట్ అయిన హ‌నుమంత‌రావుకు ఈసారి అవ‌కాశాలు దాదాపుగా లేవు. ఇక‌పోతే గుండు సుధారాణి ఇటీవ‌ల టీడీపీ నుంచి అధికార టీఆర్ ఎస్‌లోకి మారారు. ఒక్కో రాజ్య‌స‌భ స‌భ్యునికి 40 మంది శాస‌న స‌భ్యుల మ‌ద్ద‌తు కావాలి. ఈ రెండు పార్టీల‌కు తెలంగాణ‌లో ఆ మేరకు బ‌లం లేదు. కాబ‌ట్టి ఈపార్టీలు ఈ ద‌ఫా తెలంగాణ నుంచి ఎవ‌రినీ రాజ్య‌స‌భ‌కు పంపించ‌లేని ప‌రిస్థితి. ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ పుణ్య‌మాని ఈ రెండు పార్టీలు ఎమ్మెల్యేల ఫిరాయింపుతో బల‌హీన‌మ‌య్యాయి. ఈ విష‌యంలో కాంగ్రెస్ కాస్త ఫ‌ర్వాలేదుగానీ,టీడీపీకి రేవంత్ మినహా మ‌రెవ్వ‌రూ మిగిలేలా క‌నిపించ‌డం లేదు.
First Published:  12 May 2016 10:39 PM GMT
Next Story