చెర్రీ-సుక్కూ కాంబో పక్కా అయింది

రామ్ చరణ్, సుకుమార్ సినిమా ఇంతకుముందే పక్కా అయింది.ఇందులో కొత్తేంలేదు. కాకపోతే… వీళ్ల కాంబినేషన్ లో సినిమా ఎప్పుడు షురూ అవుతుందనే విషయం తాజాగా కన్ పర్మ్ అయింది. ఆగస్ట్ 22న సుకుమార్ సినిమాకు కొబ్బరికాయ కొట్టాలని చెర్రీ నిర్ణయించాడట. ఆ రోజు చిరంజీవి పుట్టినరోజు కావడం విశేషం. మరోవైపు రామ్ చరణ్ కోసం ఓ డిఫరెంట్ స్టోరీని సుకుమార్ సిద్ధం చేశాడని తెలుస్తోంది. ఇప్పటికే స్క్రీన్ ప్లే పనుల్ని కూడా 70శాతం పూర్తిచేశాడని సమాచారం. మరోవైపు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చెర్రీ చేస్తున్న సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.
ఆగస్ట్ 22 నాటికి ఈ సినిమాను ఓ కొలిక్కి తీసుకొచ్చి.. ఆ వెంటనే సుకుమార్ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లాలనేది చెర్రీ ప్లాన్. అప్పటికే చిరంజీవి 150వ సినిమా షూటింగ్ నడుస్తుంటుంది కాబట్టి.. ఓ వైపు నిర్మాతగా వ్యవహరిస్తూనే మరోవైపు సుకుమార్ సినిమాలో నటించడానికి చెర్రీ ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడు. చెర్రీ-సుకుమార్ సినిమాలో ఓ కొత్త భామను హీరోయన్ గా పరిచయం చేయబోతున్నారు. ఆగస్ట్ 22న ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు బయటకు రానున్నాయి. సుకుమార్ దర్శకత్వంలో చెర్రీ చేస్తున్న మొట్టమొదటి సినిమా ఇదే. 
Click on Image to Read:
ntr-puri
niharika-konidela Meharine,-Mega-Family