న‌గరం నుంచి ఇద్ద‌రు మంత్రులు ఔట్‌!

తెలంగాణ‌లో రాజ్య‌స‌భ వేడి, ఇటు మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ ప్ర‌చారం రెండూ ఒకేసారి మొద‌ల‌య్యాయి. ఈ రెండు విష‌యాలు అధికార పార్టీలో కీల‌క‌స్థానాల్లో కొన‌సాగుతున్న‌వారిలో ర‌క‌ర‌కాల స‌మీక‌ర‌ణాల‌కు కార‌ణ‌మ‌వుతున్నాయి. కొంద‌రు క‌ల‌వ‌ర‌పాటుకు గుర‌వుతుంటే.. మ‌రికొంద‌రు ఆశ‌ల ప‌ల్ల‌కిలో ఊరేగుతున్నారు. త్వ‌ర‌లో జ‌రిగే మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌లో న‌గ‌రం నుంచి ఇద్ద‌రు మంత్రుల‌కు ఉద్వాస‌న ఉంటుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే, ఆ ఇద్ద‌రు మంత్రులు ఎవ‌రు? అన్న చ‌ర్చ అధికార‌పార్టీలో మొద‌లైంది. న‌గ‌రం నుంచి ముగ్గురు మంత్రులు ఉన్నారు. వారిలో సికింద్రాబాద్ ఎమ్మెల్యే ప‌ద్మారావు గౌడ్‌, స‌న‌త్‌న‌గ‌ర్ ఎమ్మెల్యే త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్‌, ఎమ్మెల్సీ నాయిని న‌ర‌సింహారెడ్డిలు ఉన్నారు. వీరిలో ప‌ద్మారావు, నాయిని పార్టీ ఆవిర్భావం నుంచి టీఆర్ ఎస్‌లోనే కొన‌సాగుతున్నారు. పార్టీకి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కేసీఆర్‌కు అండ‌గా నిలిచారు. ఆయ‌న ఆదేశాల మేర‌కు ఎమ్మెల్యేల ప‌ద‌వుల‌కు రాజీనామాలు కూడా చేశారు. 
ఆ ఇద్దరు త‌ల‌సాని, నాయిని.?
నాయిని న‌రిసంహారెడ్డిని రాజ్య‌స‌భ‌కు పంపిస్తార‌ని చాలాకాలంగా ప్ర‌చారం జ‌రుగుతోంది. వృద్ధాప్యం కార‌ణంగా ఆయ‌న‌కు విశ్రాంతి ఇవ్వాల‌ని పార్టీ భావిస్తోంద‌ని స‌మాచారం. ఇక‌పోతే ప‌ద్మారావు గౌడ్ కేసీఆర్ కు న‌గరంలో న‌మ్మిన‌బంటుల్లో ముందువ‌రుస‌లో ఉంటాడు. 2014 ఎన్నిక‌ల ప్ర‌చారంలోనే ప‌జ్జ‌న్న (ప‌ద్మారావు)ను గెలిపించి పంపండి.. నేను మంత్రిని చేసి పంపిస్తా.. అని కేసీఆర్ వాగ్దానం చేసి అన్న మాట నిల‌బెట్టుకున్నాడు.  ఇక‌పోతే టీడీపీ నుంచి గెలిచి అధికార పార్టీలో చేరిన త‌ల‌సానికి మంత్రి ప‌ద‌వి ఇచ్చారు కేసీఆర్‌. దీంతో న‌గ‌రం నుంచి ఇద్ద‌రిని మంత్రి వ‌ర్గం నుంచి త‌ప్పిస్తారంటే.. ఆ ఇద్ద‌రు త‌ల‌సాని, నాయిని అన్న వాద‌న‌ల‌కు బ‌లం చేకూరుతోంది. త‌ల‌సాని కుమారుడి కార‌ణంగా ఆయ‌న‌ ప‌లుమార్లు మీడియాకు వివ‌ర‌ణ ఇచ్చుకోవాల్సి వ‌చ్చింది. ఆయ‌న అక్ర‌మాల‌కు పాల్ప‌డుతున్నార‌ని ఆయ‌న ప్ర‌త్య‌ర్థులు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో ఇటీవ‌లే ఆయ‌న శాఖ మార్చారు. తాజా చ‌ర్చ నిజ‌మైతే.. పార్టీలో త‌ల‌సానికి ప్రాధాన్యం త‌గ్గిస్తున్నార‌నిపిస్తోంద‌ని గులాబీనేత‌లు గుస‌గుస‌లాడుతున్నారు. 

Click on Image to Read:

chandrababu-cm

tendulkar-anjali

tdp-rajyasabha-elections

babu

rami-reddy-pratap-kumar-red

CM-Ramesh

sona-chowdary

revanth-reddy

pratap-reddy

chandrababu-naidu

Rosaiah,-EVKS-Elangovan

CNN