Telugu Global
NEWS

తెలుగు తమ్ముళ్ల బరితెగింపు- పోలీసులనే ఉరికించి కొట్టారు

ఒకప్పుడు బీహార్‌లో పోలీసులనే రౌడీలు, నేరస్తులు కొట్టేవారట. నితీష్ కుమార్ వచ్చాక అక్కడ అలాంటి పరిస్థితులు మాయమయ్యాయి. ఇప్పుడు ఏపీ ఆ ప్లేస్‌ను కైవసం చేసుకునే దిశగా వెళ్తోంది. ఏపీలో అధికార పార్టీ, పోలీస్ వ్యవస్థ తీరు ఎలా ఉందో అందరూ చూస్తూనే ఉన్నారు. తాజాగా టీడీపీ నేతల బరితెగింపుకు, వారి అధికార అహంకారానికి పరాకాష్ట లాంటి ఘటన సీఎం సొంత జిల్లాలోనే జరిగింది. సీఎం నుంచి ఉన్నతాధికారుల వరకు అంతా తమ తొత్తులే అనుకున్నారో ఏమో […]

తెలుగు తమ్ముళ్ల బరితెగింపు- పోలీసులనే ఉరికించి కొట్టారు
X

ఒకప్పుడు బీహార్‌లో పోలీసులనే రౌడీలు, నేరస్తులు కొట్టేవారట. నితీష్ కుమార్ వచ్చాక అక్కడ అలాంటి పరిస్థితులు మాయమయ్యాయి. ఇప్పుడు ఏపీ ఆ ప్లేస్‌ను కైవసం చేసుకునే దిశగా వెళ్తోంది. ఏపీలో అధికార పార్టీ, పోలీస్ వ్యవస్థ తీరు ఎలా ఉందో అందరూ చూస్తూనే ఉన్నారు. తాజాగా టీడీపీ నేతల బరితెగింపుకు, వారి అధికార అహంకారానికి పరాకాష్ట లాంటి ఘటన సీఎం సొంత జిల్లాలోనే జరిగింది. సీఎం నుంచి ఉన్నతాధికారుల వరకు అంతా తమ తొత్తులే అనుకున్నారో ఏమో గానీ రెచ్చిపోయారు. ఏకంగా పోలీసులనే కాలర్లు పట్టుకుని కుమ్మేశారు. ప్రాణభయంతో పరిగెత్తినా వెంటాడి దాడి చేశారు. చివరకు పోలీస్ స్టేషన్‌కు పరిగెత్తి పోలీసులు దాక్కున్నారు.

చిత్తూరు జిల్లా పాకాలలో ఎంపీపీ చాముండేశ్వరి నాయుడు అనుచరుడు త్యాగరాజుకు, తెలుగు యువత నాయకుడు మాన్యం కిషోర్ నాయుడు మధ్య పాతకక్షలు ఉన్నాయి. సాయంత్రం ఎన్టీఆర్‌ సర్కిల్‌లో కిషోర్‌ నాయుడుపై ప్రత్యర్థులు చెప్పులు, కర్రలతో దాడి చేశారు. దీంతో కిషోర్ నాయుడు వెళ్లి తనకు అండగా ఉన్న నాగరాజునాయుడు, సురేష్‌ నాయుడుకు చెప్పుకున్నాడు. దీంతో కిషోర్ నాయుడు తన బ్యాచ్‌తో వచ్చి ప్రత్యర్థులపై దాడి చేశాడు. ఈ గొడవ విషయం తెలుసుకుని అక్కడికి ఏఎస్‌ఐ రవీంద్రబాబు, శ్యామ్ బాబు, కానిస్టేబుల్ భాషా వెళ్లారు. గొడవ విజువల్స్‌ను రికార్డు చేసేందుకు ప్రయత్నించారు. అంతే తమ్ముళ్లు రెచ్చిపోయారు. ముగ్గురు పోలీసులను కాలర్లు పట్టుకుని పిడిగుద్దులు కురిపించారు. విజువల్స్ రికార్డు చేసిన ట్యాబ్‌ను పగులగొట్టారు. సెల్‌ ఫోన్లు లాక్కున్నారు.

టీడీపీ నేతలు కిషోర్ నాయుడు, ఉమాపతి, మహేష్ నాయుడు, బొల్లినేని సురేష్‌ కలిసి పోలీసులను వెంటాడి కర్రలతో కొట్టారు. తమ్ముళ్ల ప్రతాపం ముందు పోలీసులు పారిపోయారు. వెళ్లి స్టేషన్‌లో దాక్కున్నారు. ఈ ఘటనను పోలీసులు అవమానంగా భావిస్తున్నారు. పోలీసులనే తరిమికొట్టారంటే టీడీపీ నేతల తీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చంటున్నారు. పోలీసులపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చిత్తూరు ఎస్పీ ఆదేశించారు. ఎస్పీ ఘట్టమనేని శ్రీనివాస్ ఆదేశాలతో డీఎస్పీ శ్రీనివాసులు నాయుడు రంగంలోకి దిగారు. అయితే టీడీపీ నేతలు కూడా కేసును నీరుగార్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు వార్తలొస్తున్నాయి. అందరూ మనవాళ్లే చూసిచూడనట్టు వదిలేయండని టీడీపీ బడా నేతలు పోలీసులకే సర్ధిచెప్పే ప్రయత్నం చేస్తున్నారని సమాచారం.

Click on Image to Read:

botsa1

vishal

570 cror containor

DS

chandrababu

vijayawada-corporaters

heritage

chandrababu-naidu

YSRCP

talasani-srinivas-yadav-nay

chandrababu-cm

babu

tdp-rajyasabha-elections

First Published:  14 May 2016 10:26 AM GMT
Next Story