Telugu Global
Cinema & Entertainment

అమెరికాలో జనతా గ్యారేజీ ఆడియో

నాన్నకు ప్రేమతో సినిమాతో తారక్ కు ఓవర్సీస్ లో మంచి బేస్ ఏర్పడింది. అప్పటివరకు ఉన్న కొన్ని రికార్డుల్ని తుడిపేయడమే కాకుండా…. ఎన్టీఆర్ కెరీర్ లోనే అత్యధిక ఓవర్సీస్ వసూళ్లు సాధించిన చిత్రంగా నాన్నకు ప్రేమతో నిలిచింది. దీంతో తన నెక్ట్స్ సినిమాకు కూడా ఓవర్సీస్ కనెక్షన్ ఇవ్వాలనే ఉద్దేశంతో… జనతా గ్యారేజీ ఆడియో ఫంక్షన్ ను అమెరికాలో ప్లాన్ చేశాడు ఎన్టీఆర్. అన్నీ అనుకున్నట్టు జరిగితే న్యూజెర్సీ రాష్ట్రంలో జనతా గ్యారేజీ పాటలు విడుదలవుతాయి. తెలుగువాళ్లు […]

అమెరికాలో జనతా గ్యారేజీ ఆడియో
X
నాన్నకు ప్రేమతో సినిమాతో తారక్ కు ఓవర్సీస్ లో మంచి బేస్ ఏర్పడింది. అప్పటివరకు ఉన్న కొన్ని రికార్డుల్ని తుడిపేయడమే కాకుండా…. ఎన్టీఆర్ కెరీర్ లోనే అత్యధిక ఓవర్సీస్ వసూళ్లు సాధించిన చిత్రంగా నాన్నకు ప్రేమతో నిలిచింది. దీంతో తన నెక్ట్స్ సినిమాకు కూడా ఓవర్సీస్ కనెక్షన్ ఇవ్వాలనే ఉద్దేశంతో… జనతా గ్యారేజీ ఆడియో ఫంక్షన్ ను అమెరికాలో ప్లాన్ చేశాడు ఎన్టీఆర్. అన్నీ అనుకున్నట్టు జరిగితే న్యూజెర్సీ రాష్ట్రంలో జనతా గ్యారేజీ పాటలు విడుదలవుతాయి. తెలుగువాళ్లు ఎక్కువగా ఉండే న్యూజెర్సీలో ఆడియో ఫంక్షన్ పెడితే… విడుదలైన తర్వాత వసూళ్లు మరింత పెరుగుతాయని యూనిట్ భావిస్తోంది. దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక సమాచారం రాలేదు. అయితే అమెరికాలో ఆడియో ఫంక్షన్ పెట్టినప్పటికీ… తెలుగు ప్రేక్షకులు, తారక్ అభిమానుల్ని దృష్టిలో పెట్టుకొని… హైదరాబాద్ లో మరోసారి ఆడియో లాంఛ్ చేయాలని భావిస్తున్నారు. అయితే ఇలా చేయడం వల్ల రెండు నష్టాలున్నాయి. ఒకటి హైదరాబాద్ లో ఆడియో లాంఛ్ కు ముందే పాటలు నెట్ లోకి వచ్చేస్తాయి. అందరూ వినేస్తారు. దీనివల్ల హైదరాబాద్ ఆడియో లాంచ్ ఫ్లాప్ అయ్యే ప్రమాదముంది. ఇక రెండో నష్టం ఏంటంటే… 2 సార్లు ఆడియో ఫంక్షన్ పెడితే… నిర్మాతకు ఖర్చు తడిసిమోపెడవుతుంది. ఈ రెండు యాంగిల్స్ దగ్గర మేకర్స్ ఆలోచనలో పడ్డారు.
First Published:  13 May 2016 11:01 PM GMT
Next Story