Telugu Global
International

ఆ ఫ్యామిలీ థెర‌పిస్టు...పెళ్లాన్ని ఎలా కొట్టాలో చెప్పాడు!

కొన్ని టివి ఛాన‌ల్స్‌లో  కుటుంబాల‌ను క‌లిపే షోలు, మ‌న‌స్ప‌ర్ధ‌ల‌ను తీర్చే కార్య‌క్ర‌మాల‌ను మ‌నం చూస్తున్నాం. అలాగే…సౌదీలో ఒక ఫ్యామిలీ థెర‌పిస్ట్… పెళ్లాన్ని ఎలా కొట్టాలో ఒక టివి షోలో వివ‌రించి చెప్పాడు. అది అక్క‌డి ప్ర‌భుత్వ అనుమ‌తి పొంది, వారి జాతీయ ఛాన‌ల్‌లో ప్రసారం అయిన‌ట్టుగా ఒక న్యూస్ వెబ్‌సైట్ వెల్ల‌డించింది. సౌదీ అరేబియా జాతీయ టెలివిజ‌న్‌లో ఈ వీడియో ఫిబ్ర‌వరిలో ప్ర‌సారం కాగా, వాషింగ్ట‌న్ నుండి ప‌నిచేస్తున్న ఓ మీడియా ప‌రిశోధ‌నా సంస్థ ద్వారా గ‌త […]

కొన్ని టివి ఛాన‌ల్స్‌లో కుటుంబాల‌ను క‌లిపే షోలు, మ‌న‌స్ప‌ర్ధ‌ల‌ను తీర్చే కార్య‌క్ర‌మాల‌ను మ‌నం చూస్తున్నాం. అలాగే…సౌదీలో ఒక ఫ్యామిలీ థెర‌పిస్ట్… పెళ్లాన్ని ఎలా కొట్టాలో ఒక టివి షోలో వివ‌రించి చెప్పాడు. అది అక్క‌డి ప్ర‌భుత్వ అనుమ‌తి పొంది, వారి జాతీయ ఛాన‌ల్‌లో ప్రసారం అయిన‌ట్టుగా ఒక న్యూస్ వెబ్‌సైట్ వెల్ల‌డించింది. సౌదీ అరేబియా జాతీయ టెలివిజ‌న్‌లో ఈ వీడియో ఫిబ్ర‌వరిలో ప్ర‌సారం కాగా, వాషింగ్ట‌న్ నుండి ప‌నిచేస్తున్న ఓ మీడియా ప‌రిశోధ‌నా సంస్థ ద్వారా గ‌త నెల‌లో ఇది అమెరికాలో ప్ర‌సార‌మైంది. దాంతో ఈ వీడియో వెలుగులోకి వచ్చింది. ఇందులో ఖ‌లేద్ అల్‌- సాఖ్‌బీ అనే ఆ థెర‌పిస్టు, భార్య‌ని ఎలా కొట్టాలో వివ‌రించాడు. ఈ విష‌యంలో అనేక అవాంత‌రాలు వ‌స్తాయ‌ని, కానీ అల్లా ద‌య‌వ‌ల‌న వాటిని దాట‌వ‌చ్చ‌ని, ఇది కేవ‌లం భార్య‌ని క్ర‌మ‌శిక్ష‌ణ‌లో ఉంచ‌డానికే త‌ప్ప కోపాన్ని ప్ర‌ద‌ర్శించ‌డానికి కాద‌ని ఆయ‌న చెప్పుకొచ్చాడు.

అయితే కొట్ట‌డానికి ప‌దునైన గ‌ట్టి ఆయుధాల‌ను వాడవ‌ద్ద‌ని, ప‌ళ్ల‌ను శుభ్రం చేసుకునే పుల్ల‌ల‌ను, చేతి రుమాళ్ల‌ను ఇందుకు వాడ‌వ‌చ్చ‌ని స‌ల‌హా ఇచ్చాడు. భార్య‌ని కొట్ట‌డం వెనుక ఉన్న ల‌క్ష్యం… భ‌ర్త‌ని ఎలా చూడాలో ఆమెకు అర్థ‌మ‌య్యేలా చెప్ప‌డ‌మేన‌ని ఈ ఫ్యామిలీ థెర‌పిస్ట్ చెప్పాడు. భార్య‌ని కొట్టేముందు అల్లా ప్ర‌కారం ఆమె విధులు, మీకున్న హ‌క్కుల‌ను గురించి ఆమెకు చెప్పండి… అని కూడా సూచించాడు.

దుర‌దృష్ట వ‌శాత్తూ కొంత‌మంది భార్య‌లు తాము భ‌ర్త‌తో స‌మాన‌మ‌ని భావిస్తున్నారని, ఇదే భార్య‌ల‌ను కొట్ట‌డానికి ప్ర‌ధాన కార‌ణ‌మ‌ని వెల్ల‌డించాడు. ఇది చాలా పెద్ద స‌మ‌స్య అని, కొంత‌మంది మ‌హిళ‌లు భ‌ర్త త‌మ‌ని కొట్టేలా అత‌డిని రెచ్చ‌గొడ‌తార‌ని…కూడా ఆ థెర‌పిస్ట్ చెప్పుకొచ్చాడు.

First Published:  15 May 2016 4:02 AM GMT
Next Story