Telugu Global
Cinema & Entertainment

కొత్త సినిమాకు ముహూర్తం ఫిక్స్

ఒకేసారి రెండు సినిమాలు చేశాడు రామ్. వాటిలో రాశిఖన్నాతో చేసిన శివమ్ సినిమా ఫ్లాప్ అవ్వగా…. కీర్తి సురేష్ తో చేసిన నేను శైలజ సినిమా సూపర్ హిట్టయింది. సో… ఆటోమేటిగ్గా తన నెక్ట్స్ సినిమాలో కీర్తి సురేష్ కు మరోసారి అవకాశమిస్తాడని అంతా అనుకున్నారు. కానీ ఫ్లాప్ వచ్చినా రాశిఖన్నాకే ఓటేశాడు రామ్. త్వరలోనే కందిరీగ శ్రీనివాస్ దర్శకత్వంలో చేయబోతున్న సినిమాలో రాశిఖన్నాను హీరోయిన్ గా తీసుకున్నాడు. నిజానికి ఈ సినిమాలో హీరోయిన్ గా మొదట […]

కొత్త సినిమాకు ముహూర్తం ఫిక్స్
X
ఒకేసారి రెండు సినిమాలు చేశాడు రామ్. వాటిలో రాశిఖన్నాతో చేసిన శివమ్ సినిమా ఫ్లాప్ అవ్వగా…. కీర్తి సురేష్ తో చేసిన నేను శైలజ సినిమా సూపర్ హిట్టయింది. సో… ఆటోమేటిగ్గా తన నెక్ట్స్ సినిమాలో కీర్తి సురేష్ కు మరోసారి అవకాశమిస్తాడని అంతా అనుకున్నారు. కానీ ఫ్లాప్ వచ్చినా రాశిఖన్నాకే ఓటేశాడు రామ్. త్వరలోనే కందిరీగ శ్రీనివాస్ దర్శకత్వంలో చేయబోతున్న సినిమాలో రాశిఖన్నాను హీరోయిన్ గా తీసుకున్నాడు. నిజానికి ఈ సినిమాలో హీరోయిన్ గా మొదట తమన్న పేరు బయటకొచ్చినప్పటికీ… ఆ విషయాన్ని మిల్కీబ్యూటీ ఖండించింది. రామ్ కూడా ఆ వార్తను తోసిపుచ్చాడు. అప్పుడే రాశిఖన్నాను తీసుకుంటున్నట్టు ప్రకటించాడు. ఈ సినిమాకు తాజాగా డేట్ కూడా ఫిక్స్ చేశాడు రామ్. జూన్ 3 నుంచి రాశిఖన్నాతో కలిసి సెట్స్ పైకి వెళ్లబోతున్నట్టు ప్రకటించాడు. గతంలో శ్రీనివాస్ దర్శకత్వంలో తను చేసిన కందిరీగ సినిమా కంటే ఇది ఇంకాస్త ఎనర్జిటిక్ గా ఉంటుందంటున్నాడు రామ్. కథ పరంగా ఆ సినిమాకు తాజా చిత్రానికి చాలా తేడా ఉంటుందని, ఎనర్జీ లెవెల్స్ మాత్రం ఈక్వెల్ గా ఉంటాయని చెబుతున్నాడు. 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై తాజా చిత్రం తెరకెక్కనుంది.
First Published:  14 May 2016 10:31 PM GMT
Next Story