Telugu Global
Cinema & Entertainment

గంగోత్రి చూస్తే బ‌న్నీకి భ‌యం వేస్తుందట...!

ఎవ‌రికైనా నటుడిగా  చేసిన ఫ‌స్ట్ ఫిల్మ్  ఒక ఎక్స్ పిరియ‌న్స్.  ఎప్పుడైన రివైండ్ చేసుకుని చూసుకోవ‌డానికి  ఉప‌యుక్తంగా ఉంటాయి.  గంగోత్రి చిత్రం వ‌చ్చిన‌ప్పుడు బ‌న్నీని చూసి ఆడియ‌న్స్… ఇత‌ను ఎలా హీరోగా పనికోస్తాడు అనుకున్నారు.  ప్ర‌స్తుతం బ‌న్నీ స్టార్ హీరో.  ఆయ‌న‌చిత్రం  50 కోట్లు వ‌సూలు చేస్తున్నాయి. ఫెయిల్యూర్ టాక్ వ‌చ్చిన స‌రైనోడు చిత్రం  కూడా  60 కోట్ల  షేర్ క‌లెక్ట్ చేసి స‌రికొత్త రికార్డు సెట్ చేసింది. క‌ట్ చేస్తే..  ఈసంద‌ర్భంగా బ‌న్నీని మీరు న‌టించిన […]

ఎవ‌రికైనా నటుడిగా చేసిన ఫ‌స్ట్ ఫిల్మ్ ఒక ఎక్స్ పిరియ‌న్స్. ఎప్పుడైన రివైండ్ చేసుకుని చూసుకోవ‌డానికి ఉప‌యుక్తంగా ఉంటాయి. గంగోత్రి చిత్రం వ‌చ్చిన‌ప్పుడు బ‌న్నీని చూసి ఆడియ‌న్స్… ఇత‌ను ఎలా హీరోగా పనికోస్తాడు అనుకున్నారు. ప్ర‌స్తుతం బ‌న్నీ స్టార్ హీరో. ఆయ‌న‌చిత్రం 50 కోట్లు వ‌సూలు చేస్తున్నాయి. ఫెయిల్యూర్ టాక్ వ‌చ్చిన స‌రైనోడు చిత్రం కూడా 60 కోట్ల షేర్ క‌లెక్ట్ చేసి స‌రికొత్త రికార్డు సెట్ చేసింది.
క‌ట్ చేస్తే.. ఈసంద‌ర్భంగా బ‌న్నీని మీరు న‌టించిన ఫ‌స్ట్ ఫిల్మ్ గంగోత్రి ఇప్పుడు చూస్తే ఏమ‌నిపిస్తుంది అని అడిగిన ప్ర‌శ్న‌కు ఆయ‌న‌.. నాకు భ‌యం వేస్తుంది… (దాక్కోవావ‌నిసిస్తుంది) అన్నారు. అంటే త‌న‌కు అస‌లు యాక్ష‌న్ ఏమి తెలియ‌ని స‌మ‌యంలో చేసిన చిత్రం..ద‌ర్శ‌కుడు రాఘ‌వేంద్ర రావు గారు ఏది చెబితే అది చేయ‌డం వ‌ర‌కే అన్నారు. త‌ను న‌టించిన పాత సినిమాలను బ‌న్నీ ఎక్కువ సార్లు చూస్తుంటారట‌. చూసి ఏ విష‌యంలో ఇంప్రూవైజ్ చేసుకోవాలో అబ్జ‌ర్వ్ చేసుకుంటార‌ట‌. ఇది నిజంగా మంచి ల‌క్ష‌ణం క‌దా.! ఎందుకంటే న‌టుడిగా ఆడియ‌న్స్ త‌మ హీరో నుంచి ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త‌ద‌నం ఆశిస్తుంటారు. సో ఈ విష‌యంలో బ‌న్నీ ప‌ర్ ఫెక్ట్ గా వున్నార‌న్న‌మాట‌.
First Published:  14 May 2016 9:00 PM GMT
Next Story