Telugu Global
Cinema & Entertainment

గబ్బర్ బ్యూటీకే ఓటేసిన సర్దార్

అంతా ఊహించినట్టుగానే పవన్ మరోసారి సెంటిమెంట్ ఫాలో అయ్యాడు. గబ్బర్ సింగ్ విజయాన్ని సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాతో రిపీట్ చేయలేకపోయిన పవర్ స్టార్… కనీసం నెక్ట్స్ సినిమాతోనైనా ఆ మ్యాజిక్ ను రిపీట్ చేద్దామనుకుంటున్నాడు. అందుకే గబ్బర్ సింగ్ లో తనతో పాటు నటించిన శృతిహాసన్ కు మరోసారి అవకాశమిచ్చాడు. ఈ విషయాన్ని నిర్మాత శరత్ మరార్ కన్ ఫర్మ్ చేశాడు. తమ బ్యానర్ లో ఎస్ జే సూర్య దర్శకత్వంలో పవన్ హీరోగా రానున్న […]

గబ్బర్ బ్యూటీకే ఓటేసిన సర్దార్
X
అంతా ఊహించినట్టుగానే పవన్ మరోసారి సెంటిమెంట్ ఫాలో అయ్యాడు. గబ్బర్ సింగ్ విజయాన్ని సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాతో రిపీట్ చేయలేకపోయిన పవర్ స్టార్… కనీసం నెక్ట్స్ సినిమాతోనైనా ఆ మ్యాజిక్ ను రిపీట్ చేద్దామనుకుంటున్నాడు. అందుకే గబ్బర్ సింగ్ లో తనతో పాటు నటించిన శృతిహాసన్ కు మరోసారి అవకాశమిచ్చాడు. ఈ విషయాన్ని నిర్మాత శరత్ మరార్ కన్ ఫర్మ్ చేశాడు. తమ బ్యానర్ లో ఎస్ జే సూర్య దర్శకత్వంలో పవన్ హీరోగా రానున్న సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటించనుందనే విషయాన్ని ప్రెస్ నోట్ విడుదల చేసి మరీ ప్రకటించాడు. అంతేకాకుండా సినిమా వచ్చే నెల నుంచి సెట్స్ పైకి వస్తుందనే విషయాన్ని కూడా స్పష్టంచేశాడు. ఫ్యాక్షనిజం బ్యాక్ డ్రాప్ లో లవ్ స్టోరీగా కొత్త సినిమా ఉండబోతోందనే విషయాన్ని పవన్ ఇప్పటికే అందరికీ చెప్పేశాడు. ఫార్ములా రొటీన్ గా నే ఉన్నప్పటికీ దాన్ని కొత్తగా చెప్పేందుకు, మరింత కొత్తగా తెరపై చూపించేందుకు దర్శకుడు-హీరో ప్రస్తుతం కసరత్తులు చేస్తున్నారు. ఎస్ జే సూర్య రాసుకున్న కథ, స్క్రీన్ ప్లేలో పవన్ చిన్నచిన్న మార్పులు సూచిస్తున్నాడు. ఈ మార్పుల కోసమే సినిమా ఆలస్యమౌతోంది. లేదంటే ఈ పాటికి సెట్స్ పైకి వెళ్లిపోయేది.
ntr-puri
niharika-konidela
Meharine,-Mega-Family
First Published:  14 May 2016 10:30 PM GMT
Next Story