Telugu Global
CRIME

ఘోర రోడ్డు ప్ర‌మాదం...ఒకే కుటుంబానికి చెందిన 16మంది మృతి!

ఆదిలాబాద్ జిల్లాలో శ‌నివారం అర్థ‌రాత్రి జ‌రిగిన ఘోర‌మైన రోడ్డు ప్ర‌మాదంలో ఒకే కుటుంబానికి చెందిన 16మంది మృతి చెందారు. అత్యంత విషాద‌క‌ర‌మైన ఈ సంఘ‌ట‌న  బైంసా మండ‌లం దేగాం వ‌ద్ద జాతీయ ర‌హ‌దారిపై జ‌రిగింది. మృతులంతా మ‌హారాష్ట్ర‌లోని నాందేడ్ జిల్లా, బ‌ల్లాడ్ గ్రామానికి చెందిన‌వారు. వీరంతా కొన్ని సంవ‌త్సార కింద‌ట నిజామాబాద్ జిల్లా న‌వీ పేట‌కు వ‌ల‌స వ‌చ్చి కూలిప‌నుల‌తో జీవ‌నం సాగిస్తున్నారు.   శనివారం రాత్రి ఆదిలాబాద్‌ జిల్లా సారంగాపూర్‌ మండలం అడెల్లి పోచమ్మ గుడికి అంద‌రూ […]

ఆదిలాబాద్ జిల్లాలో శ‌నివారం అర్థ‌రాత్రి జ‌రిగిన ఘోర‌మైన రోడ్డు ప్ర‌మాదంలో ఒకే కుటుంబానికి చెందిన 16మంది మృతి చెందారు. అత్యంత విషాద‌క‌ర‌మైన ఈ సంఘ‌ట‌న బైంసా మండ‌లం దేగాం వ‌ద్ద జాతీయ ర‌హ‌దారిపై జ‌రిగింది. మృతులంతా మ‌హారాష్ట్ర‌లోని నాందేడ్ జిల్లా, బ‌ల్లాడ్ గ్రామానికి చెందిన‌వారు. వీరంతా కొన్ని సంవ‌త్సార కింద‌ట నిజామాబాద్ జిల్లా న‌వీ పేట‌కు వ‌ల‌స వ‌చ్చి కూలిప‌నుల‌తో జీవ‌నం సాగిస్తున్నారు. శనివారం రాత్రి ఆదిలాబాద్‌ జిల్లా సారంగాపూర్‌ మండలం అడెల్లి పోచమ్మ గుడికి అంద‌రూ క‌లిసి ఆటోలో బయలుదేరారు. వీరు ప్రయాణిస్తున్న ఆటో ని అర్థ‌రాత్రి 11గంటల ప్రాంతంలో ఎదురుగా వ‌స్తున్న టిప్పర్ లారీ ఢీకొన‌టంతో ఈ దుర్ఘ‌ట‌న జ‌రిగింది. టిప్పర్‌లారీ ఆటోపై నుంచి దూసుకుపోవడంతో 16 మంది అక్కడికక్కడే మృతి చెందారు. ఆటోలో మొత్తం 18మంది ప్ర‌యాణిస్తున్నారు. ఆటో డ్రైవ‌ర్‌, మ‌రొక వ్య‌క్తి ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డి, నిజామాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్ర‌మాదంలో మ‌ర‌ణించిన‌వారిలో మ‌హిళ‌లు, పిల్ల‌లు ఎక్కువ సంఖ్య‌లో ఉన్నారు.

తెలంగాణ రాష్ట్రమంత్రులు హరీశ్‌రావు, ఇంద్రకరణ్‌రెడ్డి, కలెక్టర్‌ జగన్‌మోహన్‌, ఎంపీ నగేశ్‌, ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి భైంసా ఆసుపత్రిలో మృతుల కుటుంబ సభ్యులను ఆదివారం పరామర్శించారు. మంత్రి హరీశ్‌రావు మృతుల కుటుంబాలకు రూ.25వేల చొప్పున తెరాస పార్టీ తరఫున ఆర్థిక సహాయం అందిస్తామ‌ని తెలిపారు. మహారాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి బాధిత కుటుంబాలకు పరిహారం అందేలా కృషి చేస్తామన్నారు. బాధితుల విజ్ఞప్తి మేరకు మృతదేహాలకు ప్రభుత్వం తరఫున అంత్యక్రియలు నిర్వహించేందుకు అధికారులను ఆదేశించినట్లు ఆయ‌న తెలిపారు.

First Published:  15 May 2016 3:14 AM GMT
Next Story