Telugu Global
WOMEN

భార‌త మ‌హిళ షేక్‌హ్యాండ్ ఇవ్వ‌ద‌ట‌!

మ‌న ప్ర‌భుత్వాలు మ‌హిళ‌ల‌ను ఎలా చూడాల‌నుకుంటున్నాయి… అనే విష‌యాన్ని మ‌నం తెలుసుకునే అవ‌కాశం ఒక‌టి ఇటీవ‌ల వ‌చ్చింది. ఇత‌ర దేశాల‌నుండి ఇక్క‌డికి వ‌చ్చే విదేశీ  ప‌ర్యాట‌కులు, విద్యార్థులు, ఇంకా ఇత‌ర అవ‌సరాల నిమిత్తం భార‌త్‌కు వ‌చ్చి కొంత‌కాలం ఇక్క‌డ ఉండే విదేశీయుల‌కోసం భార‌త సాంస్కృతిక వ్య‌వ‌హారాల మండ‌లి ఒక హ్యాండ్ బుక్‌ని ప్ర‌చురించింది. అంటే ఇది ప‌ర్యాట‌కుల‌కు గైడ్‌గా, విద్యార్థాల‌కు మార్గ‌ద‌ర్శిగా ప‌నికొస్తుంద‌న్న‌మాట‌. ఇందులో… వారు భార‌త్‌లో నివ‌సించేకాలంలో గుర్తుంచుకోవ‌ల‌సిన అంశాల‌ను గురించి వివ‌రించారు. ఈ పుస్త‌కంలో […]

భార‌త మ‌హిళ షేక్‌హ్యాండ్ ఇవ్వ‌ద‌ట‌!
X

మ‌న ప్ర‌భుత్వాలు మ‌హిళ‌ల‌ను ఎలా చూడాల‌నుకుంటున్నాయి… అనే విష‌యాన్ని మ‌నం తెలుసుకునే అవ‌కాశం ఒక‌టి ఇటీవ‌ల వ‌చ్చింది. ఇత‌ర దేశాల‌నుండి ఇక్క‌డికి వ‌చ్చే విదేశీ ప‌ర్యాట‌కులు, విద్యార్థులు, ఇంకా ఇత‌ర అవ‌సరాల నిమిత్తం భార‌త్‌కు వ‌చ్చి కొంత‌కాలం ఇక్క‌డ ఉండే విదేశీయుల‌కోసం భార‌త సాంస్కృతిక వ్య‌వ‌హారాల మండ‌లి ఒక హ్యాండ్ బుక్‌ని ప్ర‌చురించింది. అంటే ఇది ప‌ర్యాట‌కుల‌కు గైడ్‌గా, విద్యార్థాల‌కు మార్గ‌ద‌ర్శిగా ప‌నికొస్తుంద‌న్న‌మాట‌. ఇందులో… వారు భార‌త్‌లో నివ‌సించేకాలంలో గుర్తుంచుకోవ‌ల‌సిన అంశాల‌ను గురించి వివ‌రించారు. ఈ పుస్త‌కంలో ఇక్క‌డ మ‌హిళ‌ల‌కున్న ప‌రిమితుల‌ను, వారి జీవ‌న‌శైలిని వివ‌రించే ప్ర‌య‌త్నంలో వారిని మ‌రీ వెనుక‌బ‌డిన వారిగా చూపించారు. భార‌త్‌లో మ‌హిళ‌లు చాలావ‌ర‌కు మ‌గ‌వారికి షేక్‌హ్యాండ్ ఇవ్వ‌డానికి ఇష్ట‌ప‌డ‌ర‌ట‌. ఇక్క‌డి ఆడ‌వారు చాలా సాంప్ర‌దాయ ‌బ‌ద్ధంగా ఉంటార‌ని, సినిమాకుగానీ, బ‌య‌ట‌కు ఎక్క‌డికైనా కానీ ర‌మ్మ‌ని అడిగితే మ‌ర్యాద‌పూర్వ‌కంగా తిర‌స్క‌రిస్తార‌ని అందులో ప్ర‌చురించారు.

1999 త‌రువాత ఎడిష‌న్‌గా విడుద‌ల‌ చేసిన ఈ హ్యాండ్‌బుక్‌లో భార‌త మ‌హిళ‌ల తెలివితేట‌లు, ప్ర‌గ‌తి కంటే వారు ఎంత సాంప్ర‌దాయ బ‌ద్దంగా ఉంటారో చెప్ప‌డానికే ప్రాధాన్య‌త‌నిచ్చారు. ఒక‌ప‌క్క మ‌న‌దేశ‌పు స్త్రీలు వివిధ రంగాల్లో త‌మ స‌త్తా చాటుతుంటే, మ‌రో వైపు ప్ర‌భుత్వం వారు షేక్‌హ్యాండ్ కూడా ఇవ్వ‌రు…అని రాయ‌టంలో ఔచిత్య‌మేమిటో అనే విమ‌ర్శ‌లు దీనిపై విన‌బ‌డుతున్నాయి. అలాగే మన న‌టీమ‌ణులు హాలివుడ్ చిత్రాల్లో న‌టిస్తుండ‌గా ఇండియ‌న్ మ‌హిళ సినిమాకు అడిగినా తిర‌స్క‌రిస్తుంది…అని ప్ర‌చురించారు. అవ‌స‌రాన్ని బ‌ట్టి, మ‌నుషులు, ప‌రిస్థితుల‌ను బ‌ట్టి విచ‌క్ష‌ణ‌తో తీసుకోవాల్సిన నిర్ణ‌యాల‌ను త‌ప్ప‌నిస‌రి శాస‌నంలా, ప‌రిమితిలా పేర్కొన్నారు.

కొన్ని ద‌శాబ్దాలుగా భార‌త మహిళ మారుతోంద‌ని, విదేశీయుల్ని ఇత‌రులు ఎవ‌రైనా త‌మ‌కు ప‌రిచ‌యం చేస్తే అప్పుడు మాట్లాడ‌తార‌ని పేర్కొన్నారు. కానీ ఇక్క‌డ డేటింగ్ కామ‌న్ కాద‌ని తెలిపారు. భార‌త యూనివ‌ర్శిటీల్లో రూముల కొర‌త ఉంద‌ని, ముందు వ‌చ్చిన వారికి మంచి రూములు దొరుకుతాయ‌ని, బాత్‌రూముల ప‌క్క‌న ఉన్న గ‌దుల‌ను తీసుకోవ‌ద్ద‌ని, ఎండ‌లు విప‌రీతంగా ఉంటాయి క‌నుక వేడి ఎక్కువ‌గా త‌గిలే పై అంత‌స్తుల్లో ఉండ‌వ‌ద్ద‌ని సూచించారు. కొన్ని గంట‌లే నీళ్లు వ‌స్తాయ‌ని, త‌ర‌చుగా క‌రెంటు క‌ట్ ఉంటుంద‌ని చెప్పారు. బ‌స్‌లు రైళ్ల‌ను క్యూలో ఎక్క‌ర‌ని, రైళ్ల‌లో వెళ్లేట‌ప్పుడు ల‌గేజిని భ‌ద్రంగా కాపాడుకోవాలని చెప్పారు.

చిన్న ప‌ట్ట‌ణాల్లో ఇళ్లు అద్దెకు దొరుకుతాయి కానీ, న‌గ‌రాల్లో ఇళ్లు దొర‌క‌వ‌ని, ఇళ్లు త‌క్కువ‌గా ఉండ‌టం వ‌ల‌న అలా జ‌రుగుతుంద‌ని, అంతేకానీ దాన్ని భార‌తీయుల‌కు స్నేహ‌భావం లేక‌పోవ‌టం గా భావించ‌వ‌ద్ద‌ని పేర్కొన్నారు. మొత్తానికి మిగిలిన విష‌యాల‌ను వాస్త‌వాల‌కు త‌గిన‌ట్టుగా రాసినా, భార‌త మ‌హిళ‌ల స్థితిని మాత్రం…ప్ర‌భుత్వం ఎలా చూడాల‌నుకుంటున్న‌దో అలా ప్ర‌చురించారనే అభిప్రాయాలు దీనిపై వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

First Published:  15 May 2016 2:08 AM GMT
Next Story