Telugu Global
Cinema & Entertainment

సర్దార్ దెబ్బకు రూ.47 కోట్లు ఆవిరి

అవును… సర్దార్ గబ్బర్ సింగ్ మిగిల్చిన గాయాల ఖరీదు అక్షరాలా 47 కోట్ల రూపాయలు. ఈ సినిమా కొన్నందుకు బయ్యర్లంతా కలిసి నష్టపోయిన మొత్తం 47 కోట్ల రూపాయలు. ఫైనల్ రన్ లో సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాకు మిగిలిన ఆర్థిక లోటు ఇది. సినిమా దారుణ పరాజయం అని చెప్పడానికి కళ్లముందు నిలువెత్తున నిలిచిన సాక్ష్యమిది. సర్దార్ గబ్బర్ సింగ్ విడుదలకు ముందే వంద కోట్ల రూపాయల బిజినెస్ చేసింది. కానీ ఫైనల్ రన్ లో […]

అవును… సర్దార్ గబ్బర్ సింగ్ మిగిల్చిన గాయాల ఖరీదు అక్షరాలా 47 కోట్ల రూపాయలు. ఈ సినిమా కొన్నందుకు బయ్యర్లంతా కలిసి నష్టపోయిన మొత్తం 47 కోట్ల రూపాయలు. ఫైనల్ రన్ లో సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాకు మిగిలిన ఆర్థిక లోటు ఇది. సినిమా దారుణ పరాజయం అని చెప్పడానికి కళ్లముందు నిలువెత్తున నిలిచిన సాక్ష్యమిది. సర్దార్ గబ్బర్ సింగ్ విడుదలకు ముందే వంద కోట్ల రూపాయల బిజినెస్ చేసింది. కానీ ఫైనల్ రన్ లో ఈ సినిమాకు ఇప్పటివరకు 53కోట్ల రూపాయల వసూళ్లు మాత్రమే వచ్చాయి. ఇంతకుమించి ఒక్క పైసా కూడా ఎక్కువ వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే ఓవర్సీస్ తో పాటు లోకల్ లో కూడా ఈ సినిమాను థియేటర్లలోంచి ఎత్తేశారు. ఈ సినిమా పరాజయాన్ని పవన్ ఒప్పుకున్నాడు. కాబట్టే బయ్యర్లు శాంతించారు. లేకపోతే రజనీకాంత్ అంతటి వాన్నే పట్టుకొని నానా మాటలన్నారు డిస్ట్రిబ్యూటర్లు. 47కోట్ల రూపాయల నష్టమొస్తే పవన్ ను ఊరికే వదిలేస్తారా… పవన్ పరాజయాన్ని ఒప్పుకోవడమే కాకుండా… తన వల్ల నష్టపోయిన బయ్యర్లందరికీ తన నెక్ట్స్ సినిమా హక్కుల్లో 25శాతం రిబేటు కూడా ఇచ్చాడు. అంతేకాదు… నిర్మాతతో పాటు బయ్యర్లందరికోసం వెంటనే మరో సినిమా స్టార్ట్ చేస్తున్నాడు.
First Published:  14 May 2016 10:29 PM GMT
Next Story