Telugu Global
National

తాళి క‌డ‌తావా...ఆగు...ఓటేసొస్తా!

ఎన్నిక‌లు ఐదేళ్ల‌కు ఒక‌సారి వ‌స్తాయి…పెళ్లి జీవితంలో ఒకేసారి వ‌స్తుంది. అయినా ఆ కేర‌ళ అమ్మాయికి ఓటు విలువ బాగా తెలిసిన‌ట్టే ఉంది. మ‌రో రెండుగంట‌ల్లో పెళ్లి పీట‌ల‌మీద కూర్చోబోతూ, జీవితంలో అత్యంత ముఖ్య‌మైన రోజులోంచి ఆమె కొంత స‌మ‌యాన్ని ఓటుకి వినియోగించింది. అను (25) అనే ఈ పెళ్లి కూతురు చ‌క్క‌గా పెళ్లికూతురి అలంక‌ర‌ణ‌తో పోలింగ్ బూత్‌కి వ‌చ్చి ఓటేసింది. అను తొలిసారి ఇప్పుడే ఓటు వేసింది. దాంతో ఆమె, ఎంతో ఉత్సాహంగా…అమ్మ‌య్య  పెళ్లి రోజ‌యినా ఓటుని […]

తాళి క‌డ‌తావా...ఆగు...ఓటేసొస్తా!
X

ఎన్నిక‌లు ఐదేళ్ల‌కు ఒక‌సారి వ‌స్తాయి…పెళ్లి జీవితంలో ఒకేసారి వ‌స్తుంది. అయినా ఆ కేర‌ళ అమ్మాయికి ఓటు విలువ బాగా తెలిసిన‌ట్టే ఉంది. మ‌రో రెండుగంట‌ల్లో పెళ్లి పీట‌ల‌మీద కూర్చోబోతూ, జీవితంలో అత్యంత ముఖ్య‌మైన రోజులోంచి ఆమె కొంత స‌మ‌యాన్ని ఓటుకి వినియోగించింది. అను (25) అనే ఈ పెళ్లి కూతురు చ‌క్క‌గా పెళ్లికూతురి అలంక‌ర‌ణ‌తో పోలింగ్ బూత్‌కి వ‌చ్చి ఓటేసింది. అను తొలిసారి ఇప్పుడే ఓటు వేసింది. దాంతో ఆమె, ఎంతో ఉత్సాహంగా…అమ్మ‌య్య పెళ్లి రోజ‌యినా ఓటుని మిస్ కాలేదు… అంటూ మీడియాతో త‌న ఆనందాన్ని పంచుకుంది. ఇంట్లో వాళ్లు వ‌ద్దంటున్నా, స‌మ‌యం స‌రిపోదని చెబుతున్నా విన‌కుండా ప‌ట్టుద‌ల‌తో త‌ల్లితో క‌లిసి వ‌చ్చాన‌ని చెప్పింది. ఓటేసిన వెంట‌నే అను పోలింగ్ కేంద్రానికి గంట దూరంలో ఉన్న పెళ్లి మండ‌పానికి వెళ్లేందుకు, అక్క‌డే వేచి ఉన్న కారులో ప‌రిగెత్తుకుని వెళ్లి కూర్చుంది.

First Published:  16 May 2016 2:00 AM GMT
Next Story