Telugu Global
Cinema & Entertainment

ప్రతిష్టాత్మక సినిమాలో విలన్ గా జగపతిబాబు

ఇప్పటికే విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా యమ బిజీ అయిపోయాడు జగపతిబాబు. తన మేనరిజమ్స్, ఇమేజ్ కు తగ్గట్టు ఉన్న సినిమాల్నే ఎంచుకుంటున్నాడు. ఇందులో భాగంగా మరో ప్రతిష్టాత్మక సినిమాలో నటించే అవకాశం జగపతిబాబును వరించింది. ప్రస్తుతం నడుస్తున్న ఊహాగానాల ప్రకారం… చిరంజీవి 150వ సినిమాలో జగపతిబాబును తీసుకున్నారనే టాక్ నడుస్తోంది. అయితే చిరు ప్రతిష్టాత్మక 150వ సినిమాలో జగపతిబాబును విలన్ కోసం తీసుకున్నారా… లేక మరో కీలకమైన పాత్ర కోసం ఎంపిక చేశారా… అనే విషయం […]

ప్రతిష్టాత్మక సినిమాలో విలన్ గా జగపతిబాబు
X
ఇప్పటికే విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా యమ బిజీ అయిపోయాడు జగపతిబాబు. తన మేనరిజమ్స్, ఇమేజ్ కు తగ్గట్టు ఉన్న సినిమాల్నే ఎంచుకుంటున్నాడు. ఇందులో భాగంగా మరో ప్రతిష్టాత్మక సినిమాలో నటించే అవకాశం జగపతిబాబును వరించింది. ప్రస్తుతం నడుస్తున్న ఊహాగానాల ప్రకారం… చిరంజీవి 150వ సినిమాలో జగపతిబాబును తీసుకున్నారనే టాక్ నడుస్తోంది. అయితే చిరు ప్రతిష్టాత్మక 150వ సినిమాలో జగపతిబాబును విలన్ కోసం తీసుకున్నారా… లేక మరో కీలకమైన పాత్ర కోసం ఎంపిక చేశారా… అనే విషయం తేలాల్సి ఉంది. ఏదైమైనా ఇప్పటివరకు బాలకృష్ణ మినహా… మహేష్, ఎన్టీఆర్ లాంటి కుర్రహీరోలతోనే జగపతిబాబు నటించాడు. ఇప్పుడు బాలకృష్ణతో పాటు చిరంజీవి సినిమాలో కూడా నటించే అవకాశం దక్కించుకున్నాడు. ఓవైపు వివిధ క్యారెక్టర్లతో బిజీగా ఉంటూనే మరోవైపు తన సొంత బ్యానర్ లో సినిమాలు కూడా నిర్మించాలనుకుంటున్నాడు జగపతిబాబు. త్వరలోనే తన బ్యానర్ పై రెండు సినిమాల్ని ఎనౌన్స్ చేయబోతున్నాడు. చిరంజీవి 150వ సినిమాలో ఆఫర్ కన్ ఫర్మ్ అయిన తర్వాత తన బ్యానర్ సినిమాల్ని జగపతిబాబు ప్రకటించే అవకాశముంది
First Published:  15 May 2016 11:48 PM GMT
Next Story