Telugu Global
Others

త‌మ్ముడికి స్పాట్ పెట్టిన డీకే

డీకే అరుణ ఏం మాట్లాడినా సంచ‌ల‌న‌మే! రాష్ట్ర రాజ‌కీయాల్లో ఆమె మాట‌లు తూటాల్లా పేలుతుంటాయి. రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థుల‌ను త‌న ప‌దునైన విమ‌ర్శ‌ల‌తో క‌ట్ట‌డి చేసే వాక్చాతుర్యం ఆమె సొంతం.  అందుకే ఆమెను ఫైర్‌బ్రాండ్ అని ఆమె స‌న్నిహితులు పిలుస్తుంటారు. తాజాగా డీకే అరుణ‌ మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్యలు చేశారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న త‌మ్ముడిని ఓడిస్తాన‌ని ఆమె శ‌ప‌థం చేయ‌డం చ‌ర్చానీయాంశమైంది. ఇటీవ‌ల త‌న త‌మ్ముడు, మ‌క్త‌ల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే చిట్టెం న‌ర‌సింహా రెడ్డి కారెక్కిన సంగ‌తి […]

త‌మ్ముడికి స్పాట్ పెట్టిన డీకే
X
డీకే అరుణ ఏం మాట్లాడినా సంచ‌ల‌న‌మే! రాష్ట్ర రాజ‌కీయాల్లో ఆమె మాట‌లు తూటాల్లా పేలుతుంటాయి. రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థుల‌ను త‌న ప‌దునైన విమ‌ర్శ‌ల‌తో క‌ట్ట‌డి చేసే వాక్చాతుర్యం ఆమె సొంతం. అందుకే ఆమెను ఫైర్‌బ్రాండ్ అని ఆమె స‌న్నిహితులు పిలుస్తుంటారు. తాజాగా డీకే అరుణ‌ మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్యలు చేశారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న త‌మ్ముడిని ఓడిస్తాన‌ని ఆమె శ‌ప‌థం చేయ‌డం చ‌ర్చానీయాంశమైంది. ఇటీవ‌ల త‌న త‌మ్ముడు, మ‌క్త‌ల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే చిట్టెం న‌ర‌సింహా రెడ్డి కారెక్కిన సంగ‌తి తెలిసిందే! అందుకే ఈసారి అత‌న్నే ల‌క్ష్యంగా చేసుకున్నారు.
కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచిన నీవు కారెక్క‌డం సిగ్గు చేట‌ని అన్నారు. నీకు ద‌మ్ము, ధైర్యం ఉంటే ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసి ఎన్నిక‌ల్లో పోటీ చేసి గెలువు అని స‌వాలు విసిరారు. పాల‌మూరు జిల్లా మ‌క్త‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో జ‌రిగిన కార్య‌క‌ర్త‌ల స‌మావేశం ఈ వ్యాఖ్య‌ల‌కు వేదికైంది. స‌మావేశంలో కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌ల్లో ఉత్సాహం నింపేందుకు ఆమె ఆవేశంగా ప్ర‌సంగించారు. మేము (కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లం) గెలిపిస్తే నువ్వు (చిట్టెం న‌ర‌సింహా రెడ్డి) ఎమ్మెల్యే అయ్యావు. మా క‌ష్టం లేకుంటే నీకు ఆ ప‌ద‌వి ఎక్క‌డి నుంచి వ‌చ్చింది? ఒక్క‌సారి ఆత్మ విమ‌ర్శ చేసుకో! అని సూచించారు. త‌మ తండ్రి ఆశ‌య సాధ‌న‌కోసం పార్టీ మారానని చెప్పుకోవ‌డం సిగ్గుచేట‌ని ఘాటు విమ‌ర్శ‌లు చేశారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌మ్ముడిని ఓడించేందుకు ఇప్ప‌టి నుంచే సిద్ధం కావాల‌ని కార్య‌క‌ర్త‌లకు పిలుపునిచ్చారు. మ‌క్త‌ల్‌లో మ‌ళ్లీ కాంగ్రెస్ జెండా ఎగ‌రాల‌ని స్ప‌ష్టం చేశారు.
త‌న‌పై ఆరోప‌ణ‌లు రాకుండా ఉండేందుకేనా..!
డీకే అరుణ సోద‌రుడు పార్టీ మార‌డం రాష్ట్ర వ్యాప్తంగా చ‌ర్చానీయాంశ‌మైంది. ఒక ద‌శ‌లో డీకే అరుణ కూడా కారెక్కుతార‌న్న ప్ర‌చారం జ‌రిగింది. వాటిని ఆమె ఖండించారు. ఊపిరి ఉన్నంత వ‌ర‌కు కాంగ్రెస్‌లోనే కొన‌సాగుతాన‌న్నారు. అయిన‌ప్ప‌టికీ ఆమెపై జ‌రుగుతున్న ప్ర‌చారం ఆగ‌క‌పోవ‌డంతోనే.. ఆమె త‌న సోద‌రుడిపై ఈ ఘాటు వ్యాఖ్య‌లు చేశార‌ని ప‌లువురు విశ్లేషిస్తున్నారు. డీకే వ్యాఖ్య‌ల‌ను ప‌లువురు స‌మ‌ర్థిస్తుండ‌గా, చిట్టెం పార్టీ మారిన విష‌యంలో త‌నపై విమ‌ర్శ‌లు రాకుండా జాగ్ర‌త్త‌ప‌డుతున్నార‌ని ఆమె ప్ర‌త్య‌ర్థులు వ్యాఖ్యానిస్తున్నారు.

Click on Image to Read:

harish-rao

vishal-nadigar-elections

ys-jagan

vishal-comments

BJP-MP-Poonamben-Madam

chandrababu-naidu

Kavita-Krishnan-free-sex

amaravathi-capital-city

tdp-lokesh

speaker-kodela

Gutha-Sukender-Reddy

godavari-stamped-report

First Published:  15 May 2016 10:53 PM GMT
Next Story