Telugu Global
Cinema & Entertainment

బ్రహ్మోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి

ఈసారి మహేష్ టీం  4 రోజులు ముందే సిద్ధమైపోయింది. మహేష్ సినిమా థియేటర్లలోకి వస్తుందంటే చాలు హడావుడి చాలా ఉంటుంది. టెన్షన్ పీక్స్ కు వెళ్లిపోతుంది. కానీ బ్రహ్మోత్సవం విషయంలో అంతా కూల్ గా జరిగిపోతోంది. ఈ సినిమా 4 రోజుల ముందే సిద్ధమైంది. అంతేకాదు సెన్సార్ కూడా పూర్తయింది. బ్రహ్మోత్సవం సినిమాను ప్రత్యేకంగా వీక్షించిన సెన్సార్ సిబ్బంది… ఈ సినిమాకు ఎలాంటి కట్స్ చెప్పకుండా క్లీన్-యు సర్టిఫికేట్ ఇచ్చారు. సినిమా ఆసాంతం ఎలాంటి ఇబ్బందులు లేవని […]

బ్రహ్మోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి
X
ఈసారి మహేష్ టీం 4 రోజులు ముందే సిద్ధమైపోయింది. మహేష్ సినిమా థియేటర్లలోకి వస్తుందంటే చాలు హడావుడి చాలా ఉంటుంది. టెన్షన్ పీక్స్ కు వెళ్లిపోతుంది. కానీ బ్రహ్మోత్సవం విషయంలో అంతా కూల్ గా జరిగిపోతోంది. ఈ సినిమా 4 రోజుల ముందే సిద్ధమైంది. అంతేకాదు సెన్సార్ కూడా పూర్తయింది. బ్రహ్మోత్సవం సినిమాను ప్రత్యేకంగా వీక్షించిన సెన్సార్ సిబ్బంది… ఈ సినిమాకు ఎలాంటి కట్స్ చెప్పకుండా క్లీన్-యు సర్టిఫికేట్ ఇచ్చారు. సినిమా ఆసాంతం ఎలాంటి ఇబ్బందులు లేవని మెచ్చుకున్నారు. డైలాగ్స్ నుంచి డ్రెస్సింగ్ వరకు ఎక్కడా తమకు అభ్యంతరాలు లేవని చెప్పుకొచ్చారు. అలా శ్రీకాంత్ అడ్డాల మార్కుతో సకుటుంబ సపరివార సమేతంగా చూడదగ్గ క్లీన్ ఎంటర్ టైనర్ గా బ్రహ్మోత్సవం సినిమా విడుదలకు ముస్తాబైంది. ఓవైపు ప్రచారంతో హోరెత్తిస్తూనే.. మరోవైపు ప్రీమియర్ షోకు ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. ఏపీ, తెలంగాణలోని ముఖ్యపట్టణాల్లో 19వ తేదీ రాత్రి, 20వ తేదీ వేకువజామున బ్రహ్మోత్సవం ప్రీమియర్ షోలకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. శ్రీమంతుడు సినిమా సూపర్ హిట్ అవ్వడంతో… బ్రహ్మోత్సవం ప్రీమియర్ టిక్కెట్ రేట్లు ఆకాశన్నంటున్నాయి. హైదరాబాద్, విజయవాడ సిటీస్ లో ఈ సినిమా ప్రీమియర్ షో టిక్కెట్ ధరలు ఇప్పటికే వెయ్యి రూపాయలకు చేరుకున్నట్టు సమాచారం.
First Published:  17 May 2016 12:23 AM GMT
Next Story