Telugu Global
Cinema & Entertainment

ఆ ఛాన్స్ నయన్ నుంచి అనుష్క గుంజేసుకుంది

గతకొంత కాలంగా సాగదీస్తు వస్తున్న చిరంజీవి 150వ సినిమాపై ఇప్పుడిప్పుడే అన్ని విభాగాల్లో క్లారిటీ వస్తుంది. పోయిన వారంలో ముహుర్తం షాట్ ను కుటుంబ సభ్యులమధ్య జరుపుకొని సినిమాని అధికారికంగా మొదలుపెట్టారు. తమిళంలో భారీ హిట్ సాధించిన సినిమా కత్తిని రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. వివి వినాయక్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి కత్తిలాంటోడు అనే టైటిల్ ను ప్రస్తుత్తానికి ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే. హీరోయిన్ గా మొదట నయన తారని ఫిక్స్ చేశారని […]

ఆ ఛాన్స్ నయన్ నుంచి అనుష్క గుంజేసుకుంది
X

గతకొంత కాలంగా సాగదీస్తు వస్తున్న చిరంజీవి 150వ సినిమాపై ఇప్పుడిప్పుడే అన్ని విభాగాల్లో క్లారిటీ వస్తుంది. పోయిన వారంలో ముహుర్తం షాట్ ను కుటుంబ సభ్యులమధ్య జరుపుకొని సినిమాని అధికారికంగా మొదలుపెట్టారు. తమిళంలో భారీ హిట్ సాధించిన సినిమా కత్తిని రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. వివి వినాయక్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి కత్తిలాంటోడు అనే టైటిల్ ను ప్రస్తుత్తానికి ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే. హీరోయిన్ గా మొదట నయన తారని ఫిక్స్ చేశారని వార్తలొచ్చినా అటు యూనిట్ వారుకాని ఇటు నయనతారా కాని దీనిపై ఎప్పుడూ స్పందించలేకపోవటంతో హీరోయిన్ పై సంధిగ్దం కొనసాగుతూనే ఉంది. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం చిరంజీవి సరసన ఈ సినిమాలో అనుష్క హీరోయిన్ నటించబోతున్నట్టు సమాచారం. ప్రస్తుత్తానికి రెండు సినిమాల్లో బిజీగా ఉన్న అనుష్క ఈ సినిమా కోసం డేట్స్ అడ్జెస్ట్ చేస్తున్నట్టు సమాచారం. అయితే అనుష్క గతంలో చిరంజీవితో స్టాలిన్ సినిమాలో ఓ ప్రత్యేక పాత్రలో నటించిన విషయం తెలిసిందే.

Click on Image to Read:

mahesh-bramosavam

mahesh-babu

First Published:  17 May 2016 1:47 AM GMT
Next Story