Telugu Global
Cinema & Entertainment

మహేష్ బాబుకు ఊరు....పేరు రెండూ లేవు...

శ్రీమంతుడు సినిమాలో హర్ష పాత్రలో మహేష్ చక్కగా మెప్పించాడు. ఆ క్యారెక్టర్ బాగా పాపులర్ అయింది కూడా. మరి బ్రహ్మోత్సవంలో మహేష్ క్యారెక్టర్ పేరేంటి? భారీ తారాగణంతో తెరకెక్కిన బ్రహ్మోత్సవం సినిమాలో పాత్రలన్నీ మహేష్ ను ఏమని పిలుస్తాయి..? ఇప్పటివరకుఈ విషయం బయటకు రాలేదు. కానీ తాజా సమాచారం ప్రకారం… సినిమాలో మహేష్ కు పేరు లేదు. అవును.. నిజంగానే మహేష్ కు సినిమాలో పేరు లేదు. నిజంగా ఇది విచిత్రమే కానీ ఆసక్తికరం కూడా. అర్జున్ […]

మహేష్ బాబుకు ఊరు....పేరు రెండూ లేవు...
X
శ్రీమంతుడు సినిమాలో హర్ష పాత్రలో మహేష్ చక్కగా మెప్పించాడు. ఆ క్యారెక్టర్ బాగా పాపులర్ అయింది కూడా. మరి బ్రహ్మోత్సవంలో మహేష్ క్యారెక్టర్ పేరేంటి? భారీ తారాగణంతో తెరకెక్కిన బ్రహ్మోత్సవం సినిమాలో పాత్రలన్నీ మహేష్ ను ఏమని పిలుస్తాయి..? ఇప్పటివరకుఈ విషయం బయటకు రాలేదు. కానీ తాజా సమాచారం ప్రకారం… సినిమాలో మహేష్ కు పేరు లేదు. అవును.. నిజంగానే మహేష్ కు సినిమాలో పేరు లేదు. నిజంగా ఇది విచిత్రమే కానీ ఆసక్తికరం కూడా.
అర్జున్ సినిమాలో కూడా మహేష్ కు పేరు లేదు. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మహేష్ ను ఎవరూ పేరుపెట్టి పిలవరు. క్లయిమాక్స్ లో మహేషే స్వయంగా తన పేరు అర్జున్ అని చెప్పుకుంటాడు. ఇక సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు సినిమాలో కూడా మహేష్ కు పేరు లేదు. చిన్నాపెద్దా అంతా మహేష్ ను చిన్నోడు అనే పిలుస్తుంటారు. హీరోయిన్ సమంత కూడా చిన్నోడు అంటూ ఆటపట్టిస్తుంది. అదే మేజిక్ ను బ్రహ్మోత్సవంలో కూడా రిపీట్ చేయాలనుకుంటున్నారు. ఈ సినిమాలో మహేష్ ను ఎవరూ పేరుపెట్టి పిలవరట. మరి ఏమని పిలుస్తారనేది ప్రస్తుతానికి సస్పెన్స్.
First Published:  17 May 2016 12:28 AM GMT
Next Story