Telugu Global
NEWS

సోము వీర్రాజుకు బాబు లీకు పత్రిక గట్టి వార్నింగ్

ఏపీలో బీజేపీకి అంటూ ఒక వ్యవస్థ ఉన్నప్పటికీ అందులోని చాలా మంది నేతలు చంద్రబాబుకు వంతపాడేవారేనన్న ఆరోపణలు చాలా కాలంగా ఉన్నాయి. సామాజికవర్గ కోణంలో వారు చంద్రబాబు మేలుకోసం సొంత పార్టీని కూడా తాకట్టు పెట్టేందుకు రెడీగా ఉంటారన్న భావన ఉంది. అయితే ఏపీ బీజేపీ నుంచి టీడీపీకి ఇటీవల చుక్కలు చూపిస్తున్నది ఒకేఒక్కడు ఎమ్మెల్సీ సోమువీర్రాజు. బీజేపీపై టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలకు వీర్రాజు ధీటుగా కౌంటర్ ఇస్తూ వస్తున్నారు. చివరకు ఏపీ బీజేపీ అధ్యక్షుడు […]

సోము వీర్రాజుకు బాబు లీకు పత్రిక గట్టి వార్నింగ్
X

ఏపీలో బీజేపీకి అంటూ ఒక వ్యవస్థ ఉన్నప్పటికీ అందులోని చాలా మంది నేతలు చంద్రబాబుకు వంతపాడేవారేనన్న ఆరోపణలు చాలా కాలంగా ఉన్నాయి. సామాజికవర్గ కోణంలో వారు చంద్రబాబు మేలుకోసం సొంత పార్టీని కూడా తాకట్టు పెట్టేందుకు రెడీగా ఉంటారన్న భావన ఉంది. అయితే ఏపీ బీజేపీ నుంచి టీడీపీకి ఇటీవల చుక్కలు చూపిస్తున్నది ఒకేఒక్కడు ఎమ్మెల్సీ సోమువీర్రాజు. బీజేపీపై టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలకు వీర్రాజు ధీటుగా కౌంటర్ ఇస్తూ వస్తున్నారు. చివరకు ఏపీ బీజేపీ అధ్యక్షుడు హరిబాబు కూడా ఆ పని చేయలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో వీర్రాజును టీడీపీ, దాని అనుకూల మీడియా టార్గెట్ చేసింది.

టీడీపీ లీకు పత్రిక ఇందుకు బలం చేకూర్చేలా ఒక కథనాన్ని కూడా రాసింది. ఇటీవల ఫేస్‌బుక్‌లో ఆంధ్రా బీజేపీ పేరుతో ఒక పేజీని తెరిచారు. అచ్చం బీజేపీ అధికార పేజీలాగే ఉండే ”ఆంధ్రా బీజేపీ” పేజీలో టీడీపీని చీల్చిచెండాడుతూ పోస్టులు ఉంటున్నాయి. ఈ పోస్టులు చూసి టీడీపీ శ్రేణులు గిలగిలలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ సదరు ఫేస్‌బుక్ పేజీపై కన్నేసింది. బీజేపీలో తమ వర్గం నేతల ద్వారా అసలు విషయాన్ని రాబట్టింది. ఈ పేజీ నిర్వాహణ వెనుక బీజేపీ ఎమ్మెల్సీ ఒకరు ఉన్నట్టు టీడీపీ గుర్తించిందని లీక్‌ పత్రిక కథనాన్ని అచ్చేసింది. పరోక్షంగా ఎమ్మెల్సీ సోమువీర్రాజును టార్గెట్ చేసింది. అంతటితో ఆగితే కిక్కేముంటుంది?. వీర్రాజు ప్రత్యేకంగా పేజీని నిర్వహించడంపై అమిత్‌షాకు టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారట. విషయం తెలుసుకున్న అమిత్‌ షా ఈవ్యవహారంపై సీరియస్ అయ్యారట. బీజేపీ అధికార పేస్ బుక్‌ పేజీ నిర్వాహకుల ద్వారా విషయాన్ని ఆరా తీశారట.

ఆంధ్రా బీజేపీ పేరుతో పేజీని నిర్వహించి బీజేపీకి అనుకూలంగా, టీడీపీకి వ్యతిరేకంగా పోస్టులు పెట్టడంపై అమిత్‌ షా ఆగ్రహం వ్యక్తం చేశారని పత్రిక కథనం. ఇంకో అడుగు ముందుకేసిన లీకు పత్రిక…ఆంధ్రా బీజేపీ పేజీ నిర్వాహకులపై ఐటీ యాక్ట్ కింద పోలీసులకు ఫిర్యాదు చేయాలని కూడా పార్టీ నేతలకు అమిత్ షా ఆదేశించారట. ఈకథనం ద్వారా సోమువీర్రాజుకు గట్టి హెచ్చరిక చేసేందుకే టీడీపీ అనుకూల పత్రిక ప్రయత్నించింది. అయినా పేస్‌బుక్‌లో ఒక పేజీ క్రియేట్ చేసి టీడీపీకి వ్యతిరేకంగా పోస్టులు పెట్టడం చూసే తెలుగుతమ్ముళ్లకు ఇంత మండి ఉంటే… మరి నిత్యం తన పత్రికల ద్వారా, అనుకూల టీవీ చానళ్ల ద్వారా బీజేపీకి వ్యతిరేకంగా టీడీపీ నేతలు చేయిస్తున్న ప్రచారం చూసి కమలనాథుల (నిజమైన ఏపీ బీజేపీ నేతల)కు ఎంత మండి ఉండాలి. అయినా టీడీపీ నేతల ఫిర్యాదుకు అమిత్ షా… లీకు పత్రిక రాసినంత రేంజ్‌లో స్పందించి ఉంటారా?. బీజేపీ పేరుతో టీడీపీకి విమర్శించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అమిత్‌ షా చెప్పడానికి చంద్రబాబు ఏమైనా షాకు బాబాయి కొడుకా ఏంది?.

Click on Image to Read:

pinchans

pinnamaneni-venkateswara-ra

laxmi-paravathi-cbn

veeraju-babu

harish-rao

vishal-nadigar-elections

ys-jagan

DK-Aruna

BJP-MP-Poonamben-Madam

Kavita-Krishnan-free-sex

vishal-comments

chandrababu-naidu

amaravathi-capital-city

First Published:  17 May 2016 12:16 AM GMT
Next Story